Ammayi garu Serial Today Episode రూపకి తన కొడుకు చనిపోలేదనే నిజం తెలుస్తుంది. తండ్రికి విషయం చెప్తానని ఇంటికి బయల్దేరుతుంది. రూప సూర్యప్రతాప్‌ని కలిసి నిజం చెప్పకుండా ఆపాలని విజయాంబిక, దీపక్‌లు పరుగులు తీస్తారు. రూప తనలో తాను ఆ రోజు బిడ్డని ఒక సారి చూడాల్సిందని ఏడుస్తుంది.
రూప: ఆ రోజు వీళ్లు నా బిడ్డ చనిపోయాడు అని చెప్తే ఎందుకు నమ్మాను. నిజంగానే నా బిడ్డ బతికే ఉన్నాడా.
విజయాంబిక: రూప బిడ్డ బతికే ఉన్నాడని రూపకి తెలిసింది కదా దీపక్ ఎంక్వైరీ చేస్తే ఏం చేస్తాం. రాజుకి విషయం తెలుసు కదా.
దీపక్: రాజుకి తెలిసుండొచ్చు కానీ రాజు చెప్పాలి అనుకుంటే ఇప్పటికే రూపకి చెప్పేవాడు కదా కానీ ఎందుకు రూపకి చెప్పకుండా దాస్తున్నాడా.
విజయాంబిక: అది నిజమే.
అప్పలనాయుడు: మనసులో ఆ కుటుంబం మొత్తం బాబుని చంపాలి అనుకున్నారు ఇప్పుడు పింకీ ఏంటి ఏం తెలీనట్లు అడుగుతుంది.
పింకీ: చెప్పు రాజు బంటీ ఎందుకు నిన్ను నాన్న అని పిలుస్తున్నాడు. అత్తయ్యా మామయ్య మిమల్ని ఎందుకు నానమ్మ తాతయ్య అని పిలుస్తున్నాడు. బంటీ ఎవరు. పెద్దమ్మ నువ్వు అయినా చెప్పు పెద్దమ్మా.
విరూపాక్షి: బంటీ ఒక అనాథ పింకీ. అవును పింకీ రూప డెలివరీ రోజే ఇంకో తల్లి తన బిడ్డని కడతేర్చాలి అని చూసింది. అది రాజు చూసి బిడ్డ చావడం ఇష్టం లేక తనతో పాటు తెచ్చుకున్నాడు.
ముత్యాలు: తల్లి పారేసుకున్నా వాడు మా బిడ్డే అనిపించి నలుగురు తల్లులం అయి పెంచుకుంటున్నాం.
పింకీ: మనసులో వీళ్లు చెప్పింది నిజమే అనిపిస్తుంది. కానీ ఫ్యామిలీ మొత్తం ఇంత ప్రేమ చూపించడం ఎక్కడో ఏదో తేడా కొడుకుతుంది. ఈ విషయం వెంటనే అక్కకి చెప్పాలి.
రూప: నాన్న నాన్న నీకు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి.
సూర్యప్రతాప్: అంత కంటే ముందు నేను నీకు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. నీకు నన్ను నాన్న అని పిలవొద్దు అన్నాను నీ ముఖం చూపించొద్దని చెప్పాను కానీ నువ్వు పట్టించుకోవద్దు. అయినా ఏం చెప్తావ్ ఆ రాజు గురించి చెప్తావా. పరువు తీసిన నీ చెల్లి గురించి చెప్తావా.
రూప: మీరంతా చనిపోయాడని చెప్పిన నా కొడుకు గురించి చెప్తాను నాన్న. ఆ రోజు మీరంతా నా కొడుకుని చూసి చనిపోయాడని నిర్ధారించుకొని చెప్పారా లేదంటే ఎవరో చెప్పిన మాట విని నాకు చెప్పారా నాన్న.
చంద్ర: ఏమంటున్నావ్ అమ్మా రూప.
రూప: ఇంత కాలం చనిపోయాడు అనుకున్న నా బిడ్డ బతికే ఉన్నాడు బాబాయ్. జీవన్, అత్తయ్య, దీపక్ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. మన ఫ్యామిలీని నాశనం చేయాలి అనుకున్న ఆ జీవన్‌తో కలిసి మాట్లాడారు.
సూర్య: నీ నాటకాలు ఆపు. నువ్వు చేసిన తప్పు మర్చిపోయి నిన్ను క్షమించడానికి ఇదో కొత్త నాటకం ఆడుతున్నావా నిన్ను క్షమించడం ఈ జన్మలో జరగదు.
రూప: నాన్న మీరు ఏ శిక్ష వేసినా నేను భరిస్తా కానీ నా బిడ్డ గురించి ఆలోచించండి.
సూర్య: నీ బిడ్డ చనిపోయి ఈ రోజుకి ఆరేళ్లు అయింది ఇంకా మాట్లాడుతావేంటి.
రూప: వీళ్లు మాట్లాడుకోవడం నా విన్నాను నాన్న చూశాను నాన్న నా దగ్గర ఆధారం ఉంది అని పోటో చూపిస్తుంది.
సూర్య: అయినా ఇందులో ఏముంది అక్క వాళ్లు జీవన్‌ని కలవడానికి వెళ్తున్నట్లు నాకు చెప్పారు. ( ఫ్లాష్ బ్యాక్‌లో విజయాంబిక, దీపక్‌లు సూర్య దగ్గరకు వెళ్లి దీపు చదువుతున్న స్కూల్‌లో పిల్లల్ని కిడ్నాప్ చేయించి దీపక్ చేయిస్తున్నాడని అందరినీ నమ్మిస్తున్నాడని రూప తమని అడిగిందని ఫోన్లు చెక్ చేసిందని అందుకే జీవన్‌ని కలిసి వార్నింగ్ ఇస్తానని చెప్పి వెళ్తుంది.)
మరోవైపు పింకీ రూపకి కాల్ చేస్తుంది. అది చూసిన దీపక్ సూర్యతో పింకీ కాల్ చేసిందని రూప మాట్లాడుతుందని తగిలిస్తారు. మనల్ని కాదని వెళ్లిపోయిన పింకీతో మాట్లాడుతుందంటే మనం ఇలా ఉండటం కూడా రూపకి ఇష్టం లేదని సూర్య సీరియస్ అయిపోతాడు. పింకీ మళ్లీ కాల్ చేస్తే రూప కట్ చేస్తుంది. ఇక పింకీ తన అక్క చెప్పిన బంటీ ఈ బంటీ ఒకరేనా.. అక్క టేస్ట్‌లే ఈ బంటీకి ఉండటం ఏంటి అని అన్నీ ఆలోచిస్తుంది. ఇక గోపీ వచ్చి భర్త్‌డే ఏర్పాట్లకు పిలుస్తాడు. సూర్య రూపని తిట్టేసి పంపేస్తాడు. రూప ఏడుస్తూ వెళ్లిపోతుంది. తన కొడుకు బతికే ఉంటే ఎక్కడ ఉన్నాడని అనుకుంటుంది. ఇక పింకీకి కాల్ చేస్తుంది. ఏమైందని అడిగితే నువ్వు బంటీ గురించి చెప్తుంటావ్ కదా సేమ్ క్వాలిటీస్‌తో రాజు ఇంట్లో ఓ బంటీ ఉన్నాడని చెప్తుంది. ఈ బాబు రాజుని నాన్న అని అందరినీ వరసలు పెట్టి పిలుస్తున్నాడని చెప్తుంది. రూప షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: రోడ్ల మీద తిరుగుతూ పిచ్చోడిలా ఏడుస్తున్న కార్తీక్.. 2 రోజుల్లో ఆపరేషన్.. శౌర్య బతుకుతుందా!