Bigg Boss 6 Telugu: మరొక మూడు వారాల్లో  బిగ్ బాస్ సీజన్ 6 ముగియపోనుంది. ఇప్పటికీ ఈ సీజన్ గందరగోళమే. ఒక్కరికి కూడా విన్నర్ అయ్యే క్వాలిటీస్ కంప్లీట్‌గా కనిపించలేదు. చివరికి ఉన్నది ఉన్నట్టు చూపించే రేవంత్ బెటర్ అనిపిస్తున్నాడు ప్రేక్షకులకు. కామన్ మ్యాన్ గా వచ్చిన ఆదిరెడ్డి గీతూతో చేరి అతి చేష్టలు నేర్చుకోవడంతో ఆయనకు కాస్త వ్యతిరేకత మొదలైంది. ‘నేనే విన్నర్ నేనే విన్నర్’ అంటూ అరవడం, బిగ్ బాస్ ఇచ్చిన ఆటలను ఆడకపోవడం వంటివి కొంచెం చికాకు కలిగించాయి. ముఖ్యంగా గీతూ వెళ్లిపోయాక గీతూలా మారిపోయాడు ఆదిరెడ్డి. అందుకే శనివారం గట్టిగానే క్లాసు తీసుకున్నారు నాగార్జున. 


ఇక ఈ ఎపిసోడ్లో నాగార్జున హౌస్ మేట్స్ తో కొన్ని ఆటలు ఆడించారు. తరువాత  ప్రతి ఒక్క హౌస్ మేట్‌‌ని పిలిచి బాటమ్ 5 ఎవరో చెప్పమని అడిగారు. ప్రతి ఒక్కరూ చెప్పినవారి పేర్ల నుంచి ఎక్కువ మంది ఎవరి పేర్లు చెప్పారో వారిని బాటమ్ 5గా ప్రకటించారు నాగార్జున. బాటమ్ 5గా ఇనాయ, కీర్తి, రాజ్, మెరీనా, రోహిత్ ఉన్నారు. మిగతా వాళ్లంతా టాప్ 5 అని చెప్పారు నాగార్జున. 


ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చిన నాగార్జున చివరిలో మెరీనా, ఇనాయ ఫోటోలను పట్టుకున్నారు. చివరికి మెరీనా ఫోటో ముక్కలు కావడంతో ఆమె ఎలిమినేట్ అయినట్టు చెప్పారు. దీంతో రోహిత్ బాగా ఏడ్చాడు. మెరీనా స్టేజీ మీదకు వచ్చాక ఇంట్లో ఎవరు స్వచ్ఛమైన వారు, ఎవరు కాదో చెప్పమని అడిగారు నాగార్జున. 


వాళ్లే ప్యూర్
మెరీనా రోహిత్, కీర్తి, రేవంత్, ఆదిరెడ్డి, రాజ్ చాలా ప్యూర్ అని చెప్పింది. రోహిత్‌లాంటి స్వచ్ఛమైన వ్యక్తిని తాను చూడలేదని చెప్పింది. అలాగే రేవంత్ కూడా కోపం ఉంటే కోపం, బాధ ఉంటే బాధ చూపించేస్తాడని చెప్పింది. కీర్తి ఏదో బాధలో ఉంటుందని, కానీ ఆ బాధ నిజమేనని చెప్పింది. ఇక స్వచ్ఛమైన కానివారి జాబితాలో ఉన్న ఇనాయ, శ్రీసత్య, శ్రీహాన్, ఫైమాల గురించి చెప్పింది. ఇనాయ ఎదుటి వాళ్లు చెప్పింది  వినాలని  అంది. అలాగే శ్రీసత్య మానిప్యులేట్ అయిపోయినట్టు కనిపిస్తోందని అంది. ఇక ఫైమా మాటలు వదిలేస్తుందని అంది. ఇక శ్రీహాన్ గురించి చెబుతూ కోపం వచ్చినప్పుడు కంట్రోల్‌లో ఉండాలని, ఓసారి నా మీద అరిచావని, నేను సైలెంట్ కాబట్టి సరిపోయింది, అదే వేరేవాళ్లు అయితే పరిస్థితి మరోలా ఉండేదంటూ కాస్త గట్టిగానే చెప్పింది.  అంతేకాదు శ్రీసత్యను ఎక్కువగా చూస్తాడంటూ ఇన్ డైరెక్ట్ గా చెప్పింది మెరీనా.


ఏమైనా ఇంట్లోకి వచ్చిక కాస్త కూడా నెగిటివిటీ లేకుండా బయటికి వెళ్లింది మెరీనా. అదే పెద్ద అఛీవ్‌మెంట్ అని చెప్పాలి.  ఒక రోహిత్ ఒంటరిగానే ఆడాలి. భార్య వెళ్లాక కాసేపు ఏడ్చినా తరువాత వెంటనే తేరుకున్నాడు. 


Also read: ‘ఇఫ్ యూ ఆర్ బ్యాడ్, ఐ యామ్ యువర్ డాడ్’ - రేవంత్ వార్నింగ్ వేరే లెవెల్, ఆయనే కొత్త కెప్టెన్?