Bigg Boss 6 Telugu:  రేవంత్ ఫిజికల్ గేమ్‌లో ఉన్నాడంటే మిగతా సభ్యులకు చెమటలు పట్టడం ఖాయం. చాలా స్ట్రాంగ్‌గా ఆడే కంటెస్టెంట్లలో ఈయన కూడా ఒకరు. కెప్టెన్సీ పోటీకి ఫిజికల్ గేమ్ ఇచ్చారు బిగ్ బాస్. ఇక అందరి కళ్లు రేవంత్‌పైనే పడ్డాయి. ‘కెప్టెన్సీ ఈజ్ యువర్ గోల్’ అనే టాస్క్ ఇచ్చారు. కెప్టెన్సీ పోటీదారులు అయిన ఇనాయ, రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, రోహిత్ పోటీ పడ్డారు. 


వీరు అయిదుగురు గుండ్రంగా నిల్చోగా, వారు నిల్చున్న చోట రెండు స్టాండులు పెట్టారు. మధ్యలో పెద్ద బంతి పెట్టారు. ఆ బంతిని ఎవరికి చెందిన రెండు స్టాండుల మధ్య నుంచి బయటికి పోతుందో వారు అవుట్ అయినట్టు. పెద్ద బంతిని అడ్డుకోవడానికి అందరూ ఫిజికల్ పోటీ పడ్డారు. ఆట మొదట్లోనే రేవంత్ ‘ఇఫ్ యూ ఆర్ బ్యాడ్... ఐ యామ్ యువర్ డాడ్’ అన్నాడు. దానికి అర్థం మిగతా ఇంటి సభ్యులకు క్లియర్‌గా అర్థమైంది. 


ఇక ఆట మొదలయ్యాక ఆ బంతిని తమ స్టాండుల మధ్య నుంచి బయటికి వెళ్లకుండా చూసుకునేందుకు అందరూ కష్టపడ్డారు. మధ్యలో ఆదిరెడ్డిని శ్రీహాన్ పట్టుకోగా, రేవంత్ బంతిని బయటికి పంపేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి రెండు స్టాండుల మధ్య నుంచి వెళ్లకుండా పక్క నుంచి వెళ్లిపోయింది. ఇక రోహిత్ మొదట ఈ ఆట నుంచి అవుట్ అయ్యాడు. కాగా ఈ ఆటలో రేవంత్ గెలిచి రెండో సారి కెప్టెన్ అయినట్టు సమాచారం. 


ఆదిరెడ్డి మాత్రం తనను శ్రీహాన్ లాగేసరికి చాలా కోప్పడిపోయాడు. స్ట్రాటజీలు ఉపయోగిస్తున్నారా అంటూ చాలా సీరియస్ అయిపోయాడు. విన్నర్ తానే అని ఫిక్స్ అయిపోయినా ఆదిరెడ్డి ఓటమిని తీసుకోలేకపోతున్నాడు. మధ్యలో ఫైమా రేవంత్ వాదించుకున్నారు. వీరిద్దరికీ ఎందుకు గొడవ వచ్చిందో తెలియదు కానీ ఫైమా ‘గేమ్ అనగానే ఇలా కొట్టుకోవడం కాదు’ అంటూ చేతులతో యాక్షన్ చూసి చూపించింది. దీంతో రేవంత్‌కు కోపం వచ్చింది. ‘ఆ వెటకారమే తగ్గించుకుంటే మంచిది’ అన్నాడు రేవంత్. దానికి ఫైమా ‘వెటకారం నీ అంత లేదులే’ అంది. వెటకారం నేను చేశానంటే ఏడుస్తావ్ అని రేవంత్ అనగానే, ఫైమా అమ్మో నాకు భయమేస్తుంది అంటూ యాక్షన్ చేసింది.



ఇక ఈ వారం నామినేషన్లలో ఉన్న సభ్యులు ఎవరంటే..
1. రోహిత్
2. ఇనాయ
3. శ్రీహాన్
4. ఆదిరెడ్డి
5. రాజ్
6. రేవంత్
7. మెరీనా
8. శ్రీసత్య
9. కీర్తి


గత ఆదివారం బిగ్ బాస్ గ్లామర్ క్వీన్ వాసంతి ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం ఎవరు అవుతారో అన్నదానిపై ఇంకా అంచనాలు వేయలేక పోతున్నాం. మెరీనా వెళ్లిపోయే ఛాన్సు అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతవరకు మెరీనా ఆట కన్నా చక్కటి ప్రవర్తన, మాటతీరుతో వచ్చింది. ఇకపైనా బిగ్ బాస్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


Also read: కీర్తి చెప్పిన సామెతలో తామే కుక్కలమని ఫీలైపోతున్నా శ్రీసత్య, శ్రీహాన్ - వీరికి సామెతలు కూడా అర్థం కావన్నమాట