రో మూడు వారాల్లో ‘బిగ్ బాస్’ సీజన్-6 ముగిసిపోనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో 10 మంది కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు. వీరిలో ఒకరు ఆదివారం రాత్రి ఎలిమినేట్ అవుతారు. దీంతో మిగతా 9 మంది కంటెస్టెంట్ల మధ్య పోటాపోటీ నెలకోనుంది. ఈ వారం నామినేషన్లలో ఉన్న ఇనయా, శ్రీసత్య, మెరీనా, రోహిత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, రాజ్, రేవంత్, కీర్తిలో ఒకరు బయటకు వెళ్లక తప్పదు. అయితే, ఇప్పటికే శ్రీహాన్, ఆదిరెడ్డి, రాజ్, రేవంత్‌, కీర్తిలు నామినేషన్ల నుంచి సేవ్ అయ్యారు. తాజా ప్రోమో ప్రకారం.. ఇనయా, శ్రీసత్య, మెరీనాలు డేంజర్ జోన్‌లో ఉన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మెరీనా ఈ రోజు ఎలిమినేట్ కానుంది. 



ఈ రోజు ఎపిసోడ్‌లో ఫన్‌తోపాటు ఎలిమినేషన్ టెన్షన్ కూడా ఉండనుంది. షో చివరి దశకు వచ్చిన నేపథ్యంలోకి హోస్ట్ నాగార్జున ఎవరు బాటమ్-5లో ఉంటారని హౌస్‌మేట్స్‌ను అడిగి తెలుసుకున్నారు. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో పేరు చెప్పారు. ఆదిరెడ్డి మెరీనా పేరు చెప్పగా.. ఇనయ, శ్రీసత్య రాజ్ పేరు చెప్పారు. కీర్తి ఆదిరెడ్డి పేరు, మెరినా.. శ్రీహన్ పేరు, రేవంత్.. రోహిత్ పేరు, శ్రీహాన్, రోహిత్‌లు.. కీర్తి పేరు, ఫైమా, రాజ్‌లు ఇనయా పేరు చెప్పారు. కంటెస్టెంట్ల అభిప్రాయం ప్రకారం.. ఇనయా, రాజ్, కీర్తిలు టాప్‌-5లో ఉండరని, ఫినాలేకు చేరుకోలేరని తెలుస్తోంది. అయితే, బయట ఓటింగ్ మాత్రం వేరేలా ఉన్నట్లు సమాచారం. టైటిల్ కోసం ఇనయా గట్టి పోటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొందరైతే రేవంత్‌కు టైటిల్ ఫిక్స్ అయిపోయిందని అంటున్నారు. కానీ, కచ్చితమైన నిర్ణయాన్ని ఇప్పట్లో చెప్పడం కష్టమే. ఒక్కోసారి అంచనాలు తారుమారయ్యే అవకాశాలుంటాయి. మరి, మీరు ఎవరు టైటిల్ గెలుస్తారని అనుకుంటున్నారు?



శనివారం నాటి ఎపిసోడ్‌లో.. ఆదిరెడ్డికి నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్:  


 ఇటీవల ‘బిగ్ బాస్’ ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకునే పోటీ పెట్టారు. ఏ ముగ్గురు ఇంటి సభ్యులైతే ముందుగా బజర్ నొక్కి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కొనుగోలు చేస్తారో వాళ్ళు పాస్ కోసం పోటీ పడే అవకాశం పొందుతారు. ఈ గేమ్ లో ఆదిరెడ్డి ఆడను అని పక్కన కూర్చున్నాడు. బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చినప్పుడు అందులో పాల్గొనాలి కదా అని ఇనయా చెప్తుంటే.. ఆదిరెడ్డి తాను ఆడకూడదు అనుకోవడం కూడా టాస్క్ అని విరుద్ధంగా మాట్లాడాడు. నువ్వు విన్నర్ కాకపోతే వేరే వాళ్ళ డబ్బులతో ఇక్కడ వన్ వీక్ ఉంటున్నావ్ అంటూ లాజిక్ చెప్పాడు.


ఇదే విషయంపై నాగార్జున.. శనివారం ఎపిసోడ్‌లో ఆదిరెడ్డిని నిలదీశారు. ‘‘ఇనయా నీకో విషయం చెప్పింది. బిగ్ బాస్ నీకో ఆట ఇచ్చినప్పుడు ఆట ఆడాలి కానీ, అడ్డమైన కారణాలతో ఆట ఆడకుండా చూసుకోకూడదని తెలిపింది. నీ ఫీలింగ్ ఏమిటీ? టాస్క్ ఆడకపోవడమే నీ టాస్కా? నువ్వేగానీ ఆ టాస్క్ గెలిచి ఎవిక్షన్ ఫ్రీ పాస్ నీకు వచ్చి ఉంటుంటే.. ఒక జెన్యున్ క్యాండిడేట్ హౌస్ నుంచి వెళ్లకుండా ఆపగలిగేవాడివి కాదా. అది సపోర్ట్ చేయడం కాదా? అది ఆట తీరు కాదా? నువ్వు అలా చేస్తే జనం ఎంత మెచ్చుకుంటారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వేస్టా? ఆ పాస్ ఎవరికి వస్తే.. వారికి ఓట్లు రావా? నువ్వేమన్నా తోపా తురుమువా? ఆడియన్స్ ఏమనుకుంటున్నారో చెప్పడానికి? గేమ్ విషయంలో ఎక్కువ ఆలోచిస్తే ఏం జరుగుతుందో తెలుసా??’’ అని నాగార్జున అన్నారు. 


దీనికి ఆదిరెడ్డి స్పందిస్తూ.. ‘‘నేను నిజంగా గెలిస్తే.. నాకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ వస్తే నాకు నేను వాడుకోను కదా. నాకెందుకు అది?’’ అన్నాడు. ఇందుకు నాగ్ స్పందిస్తూ.. ‘‘అది గెలిచి చెప్పాలి. అది గెలవకుండా కాదు’’ అని అన్నారు. దీంతో ఆదిరెడ్డి ‘‘దాని వల్ల డబ్బులు వేస్ట్ కాదా’’ అని అన్నాడు. నాగ్ స్పందిస్తూ.. ‘‘మరి ఇమ్యునిటీ ఎందుకు నీకు?’’ అన్నారు. ‘‘కెప్టేన్ అయితే అది తీసుకుంటాను కదా ఇమ్యునిటీ’’ అని వాదించే ప్రయత్నం చేశాడు ఆదిరెడ్డి. దీంతో నాగార్జునకు కాస్త సహనం నశించినట్లే కనిపించింది. ‘‘ఆది బిగ్ బాస్ హౌస్‌లో తీరు మార్చుకో. మార్చుకోకపోతే.. గేట్లు తీయండి నేను వెళ్లిపోతా కాదు. ఆడియన్సే వచ్చి గేట్లు తెరిచి నిన్ను తీసుకెళ్లిపోతారు’’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నాగ్. గేమ్‌లో లూప్స్ వెతికితే గీతూ పరిస్థితే ఏర్పడుతుందని అన్నారు. ఆ తర్వాత శ్రీసత్య, శ్రీహాన్‌కు కూడా నాగార్జున క్లాస్ పీకారు. నామినేషన్స్ సమయంలో వెకిలి నవ్వులు నవ్వుతున్న శ్రీసత్యకు గట్టిగానే క్లాస్ పీకారు నాగ్. ‘‘అహంకారం, వెటకారం వల్లే ఆ నవ్వు వస్తుంది’’ అని నాగ్ అన్నారు. మరి వచ్చే ఇకపై శ్రీసత్య తన ప్రవర్తన మార్చుకుంటుందో లేదో చూడాలి.


Also Read: నయన్ ‘కనెక్ట్’ టీజర్: ఈ సీన్ చూస్తే ఉలిక్కిపడతారు - ఈ సినిమాకు ఇంటర్వెల్ ఉండదట!