‘బిగ్ బాస్’ ఇంకో మూడు వారాల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో హౌస్‌లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ పోటీలో ఆదిరెడ్డి చేసిన హైడ్రామా ఈ రోజు (శనివారం) అక్కినేని నాగార్జున నిలదీశారు. అయితే, ఇప్పటికీ ఆదిరెడ్డి తన చేసింది కరక్టే అనే ఫీలింగ్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. హోస్ట్ నాగార్జున చెప్పినా సరే.. తాను చేసింది కరక్టే అని సమర్దించుకొనే ప్రయత్నం చేశాడు. దీంతో నాగార్జున సహనం నశించింది. కాస్త ఆగ్రహంతోనే.. ఆదిరెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా విడుదలైన ప్రోమోలో ఆది రెడ్డి - నాగ్‌ల వాదన చూడొచ్చు. 


అసలు ఏం జరిగింది?: ఇటీవల ‘బిగ్ బాస్’ ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకునే పోటీ పెట్టారు. ఏ ముగ్గురు ఇంటి సభ్యులైతే ముందుగా బజర్ నొక్కి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కొనుగోలు చేస్తారో వాళ్ళు పాస్ కోసం పోటీ పడే అవకాశం పొందుతారు. ఈ గేమ్ లో ఆదిరెడ్డి ఆడను అని పక్కన కూర్చున్నాడు. బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చినప్పుడు అందులో పాల్గొనాలి కదా అని ఇనయా చెప్తుంటే.. ఆదిరెడ్డి తాను ఆడకూడదు అనుకోవడం కూడా టాస్క్ అని విరుద్ధంగా మాట్లాడాడు. నువ్వు విన్నర్ కాకపోతే వేరే వాళ్ళ డబ్బులతో ఇక్కడ వన్ వీక్ ఉంటున్నావ్ అంటూ లాజిక్ చెప్పాడు.


ఇదే విషయంపై నాగార్జున.. ఈ రోజు ఆదిరెడ్డిని నిలదీశారు. ‘‘ఇనయా నీకో విషయం చెప్పింది. బిగ్ బాస్ నీకో ఆట ఇచ్చినప్పుడు ఆట ఆడాలి కానీ, అడ్డమైన కారణాలతో ఆట ఆడకుండా చూసుకోకూడదని తెలిపింది. నీ ఫీలింగ్ ఏమిటీ? టాస్క్ ఆడకపోవడమే నీ టాస్కా? నువ్వేగానీ ఆ టాస్క్ గెలిచి ఎవిక్షన్ ఫ్రీ పాస్ నీకు వచ్చి ఉంటుంటే.. ఒక జెన్యున్ క్యాండిడేట్ హౌస్ నుంచి వెళ్లకుండా ఆపగలిగేవాడివి కాదా. అది సపోర్ట్ చేయడం కాదా? అది ఆట తీరు కాదా? నువ్వు అలా చేస్తే జనం ఎంత మెచ్చుకుంటారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వేస్టా? ఆ పాస్ ఎవరికి వస్తే.. వారికి ఓట్లు రావా? నువ్వేమన్నా తోపా తురుమువా? ఆడియన్స్ ఏమనుకుంటున్నారో చెప్పడానికి? గేమ్ విషయంలో ఎక్కువ ఆలోచిస్తే ఏం జరుగుతుందో తెలుసా??’’ అని నాగార్జున అన్నారు. 


Also Read: నయన్ ‘కనెక్ట్’ టీజర్: ఈ సీన్ చూస్తే ఉలిక్కిపడతారు - ఈ సినిమాకు ఇంటర్వెల్ ఉండదట!


దీనికి ఆదిరెడ్డి స్పందిస్తూ.. ‘‘నేను నిజంగా గెలిస్తే.. నాకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ వస్తే నాకు నేను వాడుకోను కదా. నాకెందుకు అది?’’ అన్నాడు. ఇందుకు నాగ్ స్పందిస్తూ.. ‘‘అది గెలిచి చెప్పాలి. అది గెలవకుండా కాదు’’ అని అన్నారు. దీంతో ఆదిరెడ్డి ‘‘దాని వల్ల డబ్బులు వేస్ట్ కాదా’’ అని అన్నాడు. నాగ్ స్పందిస్తూ.. ‘‘మరి ఇమ్యునిటీ ఎందుకు నీకు?’’ అన్నారు. ‘‘కెప్టేన్ అయితే అది తీసుకుంటాను కదా ఇమ్యునిటీ’’ అని వాదించే ప్రయత్నం చేశాడు ఆదిరెడ్డి. దీంతో నాగార్జునకు కాస్త సహనం నశించినట్లే కనిపించింది. ‘‘ఆది బిగ్ బాస్ హౌస్‌లో తీరు మార్చుకో. మార్చుకోకపోతే.. గేట్లు తీయండి నేను వెళ్లిపోతా కాదు. ఆడియన్సే వచ్చి గేట్లు తెరిచి నిన్ను తీసుకెళ్లిపోతారు’’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నాగ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే.. ఈ రోజు ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్‌ను చూడాల్సిందే.