Jabardasth Faima About Bigg Boss Remuneration: ఫైమా.. ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయిన ‘పటాస్’ షోతో బుల్లితెరకు పరిచయం అయ్యింది. తన కామెడీ టైమింగ్, పంచ్ లు, యాక్టింగ్ తో ఎంతోమందిని కడుపుబ్బా నవ్వించింది. ఆ తర్వాత జబర్దస్త్ లో కూడా సూపర్ పర్ఫామెన్స్ ఇస్తూ, తన స్పెషల్ యాక్టింగ్ తో అభిమానులను సంపాదించుకుంది. బిగ్ బాస్ షోకి వెళ్లి.. తన ఆట తీరుతో చివరి వరకు హౌస్ లోనే ఉంది. అయితే, ఇప్పుడు ఆ రెమ్యునరేషన్ గురించి బయటపెట్టింది ఫైమా. తనకు వచ్చిన రెమ్యునరేషన్ ఎంత? దాంతో ఏం చేసిందో చెప్పుకొచ్చింది.
బిగ్ బాస్‌కు అందుకే వెళ్లా..
బిగ్ బాస్ పెద్ద షో అని, తనలో ఏదో స్పెషల్ ఉంది కాబట్టే వాళ్లు తనను పిలిచారని చెప్పింది ఫైమా. జబర్దస్త్ లో మంచి పేరు ఉన్నప్పుడు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్లావు అనే ప్రశ్నకి సమాధానం చెప్పుకొచ్చింది. "అది పెద్ద ఫ్లాట్ ఫామ్. ఎవ్వరికీ ఛాన్స్ రాదు. నాకు వచ్చిందంటే స్పెషల్ అనుకుంటున్నాను. దానికోసం ఒక్కొక్కరు చాలా వెయిట్ చేస్తుంటారు. అలాంటిది వాళ్లే నన్ను అడిగే సరికి నాలో ఏదో ఉందని అనిపించింది. అది ఫస్ట్ ఆలోచించాను. జబర్దస్త్ కూడా పెద్ద షోనే. కానీ, బిగ్ బాస్ లో కనిపించడం అనేది చాలా కష్టం. అలాంటి ఛాన్స్ నాకు వచ్చిందని నేను వదులుకోలేదు. ఇంకోటి డబ్బుల గురించి ఆలోచించాను. ఇక్కడ కష్టపడితే కొంచెం కొంచెం సంపాదించాలి. కానీ, అక్కడ ఒకేసారి సంపాదించొచ్చు. కొడితే పెద్దది కొట్టాలి అనుకున్నాను. నా టాలెంట్ కి నేను ఎక్కువ రోజులే ఉండొచ్చు. ఇల్లు కట్టించుకోవచ్చు. మనీ పరంగా, ఫ్లాట్ ఫాం పరంగా కూడా పెద్దది అని ఆలోచించాను" అని చెప్పింది ఫైమా.
అప్పటికి అగ్రిమెంట్ అయిపోయింది..
"నాకు అగ్రిమెంట్ లేదు. లక్ ఏంటంటే? అగ్రిమెంట్ అయిపోయి 20 రోజులు అవుతుంది. మళ్లీ అగ్రిమెంట్ రాసే గ్యాప్ లో ఛాన్స్ వచ్చింది. దీంతో మళ్లీ అగ్రిమెంట్ రాయకుండా.. ఎన్ వోసీ తీసుకుని వచ్చేశాను. అందరూ అన్నారు, నాకు కూడా అనిపించింది ఫస్ట్ వీక్ లేదా సెకెండ్ వీక్ వచ్చేస్తాను అని. ఎందుకంటే అందరూ పెద్దవాళ్లు కదా. అందరూ నాకంటే గ్లామర్ గా ఉంటారు. సీనియారిటీ, పేరు అందరికీ ఎక్కువే. నేనేమో ఇట్ల ఉన్న అనుకున్నాను. చాలామంది రెండు వారాలకి వచ్చేస్తావు అన్నారు. కానీ, ఒక్కటే అనుకున్నాను, బిగ్ బాస్ లో కనిపిస్తాను చాలు అనుకున్నాను. ఫస్ట్ వీక్ నామినేషన్స్ అప్పుడు కూడా నేను ఎలిమినేట్ అవుతానని అనుకున్నాను. ఫస్ట్ నేను సేవ్ అయ్యాను."
రెమ్యునరేషన్ ఎంతంటటే?
"మంచిగా సంపాదించుకున్నాను. ఎలా సేవ్ చేసుకోవాలో తెలియలేదు. బిగ్ బాస్ కి పోయేముందే ఇల్లు తీసుకున్నాను. బాగు చేయించాను. రేకులది ఉంటే చాలు అనుకున్నారు అమ్మ నాన్న. కానీ నేను పెద్దగానే కట్టించాను. అమ్మ నాన్నను కారులో తిప్పాలి అనుకున్నాను. కారు తీసుకున్నాను. మిగతా డబ్బులతో ఒక ఫ్లాట్ కొన్నాను. అలా సేవింగ్స్ చేసుకున్నాను" అని రెమ్యునరేషన్ గురించి చెప్పింది ఫైమా.
"బిగ్ బాస్ తర్వాత వెంటనే పిలిచారు నన్ను. కానీ, నాకు ఇక్కడ అగ్రిమెంట్ ఉందని చెప్పాను. నువ్వు ఎప్పుడు రావాలి అనుకుంటే అప్పుడు రావొచ్చు అని చెప్పారు. వెళ్లేముందు కూడా నన్ను వదిలిపెట్టుకోవాలని అనుకోలేదు. నువ్వు మళ్లీ రావాలనుకుంటే రావచ్చు. మనం అంతా ఫ్యామిలీ అనే చెప్పారు. నిన్ను రానివ్వను అని అలాంటి మాటలు ఏం చెప్పలేదు."
Also Read: కష్టాల్లో ఉన్నా మా అన్న నన్ను కాపాడలేదు: బోనీ కపూర్ తమ్ముడు సంజయ్ కపూర్