Bigg Boss Telugu Season 8: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుంది. ఆ షో ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీజన్ 8ను గ్రాండ్‌గా లాంచ్‌ చేయబోతున్నారు. అయితే ఈసారి బిగ్ బాస్ షో ముందు మూడు ప్రధానమైన సవాళ్లు ఉన్నాయి. 


1) బలవంతపు లవ్ ట్రాకులు 
బిగ్ బాస్ లవర్స్‌ను చికాకు పెడుతున్న అంశం ఈ షోలో కనిపించే బలవంతపు ప్రేమ కథలు. కొందరు హౌస్‌మేట్స్ మధ్య పనిగట్టుకొని బిగ్ బాస్ టీమ్ లవ్ స్టోరీ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. తేజస్వి- సామ్రాట్, రాహుల్ సిప్లిగంజ్ - పునర్నవి, అభిజిత్-మోనాల్ -అఖిల్, అర్జున్ కళ్యాణ్-శ్రీసత్య, పల్లవి ప్రశాంత్ - రితిక రోజ్ - ప్రిన్స్ యావర్ , షణ్ముఖ్ - సిరి వంటి హౌస్ మేట్స్ మధ్య లవ్ స్టోరీలు నడిపించింది.



ఇలా హౌస్‌లో లవ్ ట్రాక్‌లను నడపడానికి బిగ్ బాస్ టీం చేసిన ప్రయత్నాల్లో కొన్ని మాత్రమే వర్క్ ఔట్ అయితే మిగిలినవి చూసేవాళ్లకు చికాకు పుట్టించాయి. ఈ లవ్ స్టోరీస్‌ను కావాలని క్రియేట్ చేస్తున్నట్టు ఎప్పుడైతే ఆడియన్స్ గమనించడం మొదలుపెట్టారో అప్పటి నుంచి బోర్ కొట్టడం మొదలైంది. పైపెచ్చు ఈ అనవసర ట్రాక్‌లు కొందరు హౌస్‌మేట్‌ల పర్సనల్ జీవితాలను సైతం ఇరుకున పెడుతున్నాయి. దీనికి సీజన్ 5ను ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. కనీసం ఈ సీజన్ లో నైనా ఈ అనవసర ఫోర్స్డ్ లవ్ ట్రాక్ లు పెట్టకుంటే చాలని బిగ్ బాస్ షో ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు.


2) అనవసరపు హైపులు 
బిగ్ బాస్ టీం గత రెండు సీజన్‌లుగా అమలు చేస్తున్న మరో స్ట్రాటజీ అనవసర హైపులు. సీజన్ 6 ఫెయిల్యూర్‌కి ఇదొక కారణం అంటారు బిగ్ బాస్ రివ్యూవర్స్. మొదటి 4 వారాల్లోనే వెళ్ళి పోవాల్సిన ఒక హోస్ మేట్ చివరి వరకూ ఉండడం కేవలం బిగ్ బాస్ టీమ్ ఇచ్చిన "పుష్" వల్లే అంటారు. పోనీ బయటి వ్యక్తులు అంటే సరే కానీ ఏకంగా ఆ సీజన్‌లో పాల్గొని టాప్ 5 వరకూ ఉండి వచ్చిన బిగ్ బాస్ రివ్యూవర్ ఆదిరెడ్డి కూడా తమ సీజన్ డిజాస్టర్ అంటారు. సరైన ప్లానింగ్ లేకుండా సీజన్ స్టార్ట్ చేసేశారని దానితో కొన్ని వారాలు అసలు టాస్కులే లేకుండా గడిపేసారని ఆయన చెప్పుకొచ్చారు. 



సీజన్ 7 అయితే మరీ దారుణం. మొదటి 5 వారాల్లో అస్సలు ఆడనీ హౌస్ మేట్ ఏకంగా లాస్ట్ వరకూ ఉండడం దాదాపు విన్ అయ్యే స్థితికి చేరుకోవడం వెనుక కూడా ఏడో వారం నుంచి ఆయనకు వచ్చిన "పుష్" కారణం అని అప్పట్లోనే రివ్యూవర్ " శ్రీనివాస్" తన యూ ట్యూబ్ ఛానెల్లో చెప్పుకొచ్చారు. అయితే దీనికి కారణం సీజన్ 2 ప్రభావం అనేవాళ్ళు లేకపోలేదు. ఆ సీజన్‌లో ఒక హౌస్‌మేట్‌కు చెందిన ఫ్యాన్స్ సోషల్ మీడియా " ఆర్మీ"గా పేరు పెట్టుకుని చేసిన రచ్చ బిగ్‌బాస్ అభిమానులు మర్చిపోలేదు. ఒకానొక దశలో షో మొత్తం బిగ్ బాస్ టీమ్ చేతుల్లో నుంచి సదరు ఆర్మీ చేతుల్లోకి వెళ్ళిపోయింది.


ఆ ఆర్మీ దెబ్బకు మిగిలిన హౌస్ మేట్స్ అనే కాదు ఏకంగా హోస్ట్ నాని కూడా విపరీతమైన సోషల్ మీడియా ట్రోలింగ్‌కు గురయ్యారు. దానితో నాని ఏకంగా బిగ్ బాస్ హోస్టింగ్‌కే గుడ్ బై చెప్పేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే షో వన్ సైడ్‌గా మారకుండా వేరే వేరే హౌస్‌మేట్‌లకు కూడా కాస్త హైప్ ఇచ్చి ఆల్రెడీ టాప్‌కు దూసుకెళుతున్న కంటెస్టెంట్‌కు పోటీ ఇప్పిస్తున్నారు బిగ్ బాస్ టీం. ఈ ప్రయత్నంలో ఇచ్చే ప్రయారిటీలు ఆడియన్స్‌లో అనుమానాలు కలిగిస్తున్నాయి అనే అభిప్రాయం సోషల్ మీడియా ఫాలో అయిన వాళ్లకు ఇట్టే తెలిసి పోతుంది. మరి ఈసారైనా ఆ దిశగా బిగ్ బాస్ టీమ్ జాగ్రత్తలు తీసుకుంటుందేమో చూడాలి.


3) హోస్టింగ్ పై N కన్వెన్షన్ ఎఫెక్ట్ ఉంటుందా?
గత 6 సీజన్లుగా బిగ్ బాస్ షోను తెలుగులో ఒంటి చేత్తో నడిపిస్తున్న హోస్ట్ నాగార్జున. ఎలాంటి సిట్యుయేషన్‌నైనా కూల్‌గా తనదైన శైలిలో డీల్ చేసే నాగ్ ఈసారి మాత్రం పబ్లిక్ లైఫ్‌లో పెద్ద ఇబ్బందినే ఫేస్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన N కన్వెన్షన్ కూల్చివేత నాగ్ ఇమేజ్‌పై సోషల్ మీడియాలో సైతం ప్రభావం చూపింది. ఈ ఇష్యూపై ఆయన లీగల్‌గా ఫైట్ చేస్తున్నట్టు ప్రకటించారు కూడా. అయితే ఈ చికాకుల మధ్య ఆయన హోస్టింగ్‌లో మునుపటి జోష్ కనపడుతుందా అనేది బిగ్ బాస్ ప్రేమికుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. అలాంటివి ఏమీ ఉండదవి బిగ్‌బాస్ టీం చెబుతుంది. ఈ ఇష్యూస్‌ అన్నీ క్లియర్ అయిపోయి సీజన్ 8 కూడా పెద్ద హిట్ కావాలని సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు తెలుగు బిగ్ బాస్ షో ప్రేమికులు. 


Also Read: సందడే సందడి.. బిగ్ బాస్‌లో ఈసారి అన్ ఎక్స్‌పెక్టెడ్ హడావిడి..!


Also Read: బిగ్‌బాస్‌తో రీచార్జ్ అవుతున్న నాగ్- ఈసారి మరింత ఉల్లాసంగా ఉత్సాహంగా!


Also Read: నేచర్ థీమ్‌తో రెడీ అయిన బిగ్‌బాస్‌ సెట్‌- లోపల ఎలా ఉందో చదివేయండి!


Also Read: ఈసారి బిగ్ బాస్ లో "రీ ఎంట్రీ" సెన్సేషన్.. ఎవరొస్తున్నారో తెలుసా?


Also Read: షాకిస్తున్న బిగ్‌బాస్‌ 8 ఫైనల్‌ లిస్ట్‌! - హౌజ్‌లోకి ఊహించని కంటెస్టెంట్స్‌, ఈసారి వాళ్లు కూడా...