Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ (Bigg Boss Telugu New Season) బజ్ మామూలుగా లేదు. వీళ్లే కంటెస్టెంట్స్ (Bigg Boss Telugu Season 8 Contestants) అంటూ కొందరు.. లీకుల పేరుతో మరి కొందరు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టే.. ఈసారి ప్రొడక్షన్ టీమ్ కూడా కొత్త ప్లాన్ తో జనాల్లోకి షో ను తీసుకురాబోతోంది. అందుకోసం సూపర్ ప్లాన్ తో ఎపిసోడ్లను డిజైన్ చేసింది. మామూలుగానే బిగ్ బాస్ సీజన్ 8 షో లాంచింగ్ ఎపిసోడ్ కు బాగానే రేటింగ్ ఉంటుంది. కంటెస్టెంట్లు ఎవరు.. గేమ్ ఎలా ఉండబోతోంది అన్నది మొదటి ఎపిసోడ్ లోనే క్లారిటీ వస్తుంది కాబట్టి.. ఆ దిశగా ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ కూడా సూపర్ గా వస్తూ ఉంటుంది. ఈ సారి ఆ టెంపోను మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకువెళ్లాలన్నది బిగ్ బాస్ ప్రొడక్షన్ టీమ్ ప్లాన్ గా తెలుస్తోంది.


సెప్టెంబర్ 1.. ఆదివారం.. సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ బ్యాంగ్.. తెలుగు ప్రజలను ఊపేయబోతోంది. ఈ ఉత్సాహాన్ని పండగ థీమ్ తో ముందుకు తీసుకువెళ్లనుంది బిగ్ బాస్ టీమ్. ఎందుకంటే.. కొత్త సీజన్ లాంచ్ అయిన వారానికే వినాయక చవితి పండగ రానుంది. నవరాత్రుల వేడుకలు ప్రారంభం కానున్నాయి. నిమజ్జనం వరకూ ఆ సందడి కంటిన్యూ అవుతుంది. ఈ బజ్ నే తమ రీచ్ కోసం వాడుకునేందుకు బిగ్ బాస్ టీమ్ రెడీ అయినట్టు కనిపిస్తోంది. ఇదే నిజమైతే.. రెండో వారంలోనే కింగ్ నాగ్ ఆధ్వర్యంలో వినాయక చవితి పండగ స్పెషల్ బిగ్ బాస్ ఎపిసోడ్ బయటికి రావడం ఖాయం.


Also Read:బిగ్‌బాస్‌తో రీచార్జ్ అవుతున్న నాగ్- ఈసారి మరింత ఉల్లాసంగా ఉత్సాహంగా!


ప్రతి సీజన్ లో దసరా, దీపావళి పండగలకు బిగ్ బాస్ సెట్ లో సందడి కనిపించేది. కానీ.. ఫెస్టివల్ సీజన్ ను క్యాష్ చేసుకుంటే రీచ్ బాగా ఉంటుందని.. తమ కొత్త సీజన్ సూపర్ సక్సెస్ అవడం కూడా ఖాయమని బిగ్ బాస్ టీమ్ అనుకుంటున్నట్టే కనిపిస్తోంది. అందుకే.. వినాయక చవితితో మొదలయ్యే హడావిడిని.. దసరాతో కంటిన్యూ చేసి.. దీపావళికి పీక్ స్టేజ్ కు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సెప్టెంబర్ 8 నుంచి బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ ప్రారంభం అవుతుందని మొదట్లో వార్తలు వచ్చినా.. ఈ కారణంగానే వారం ముందుకు జరిపి మరీ కొత్త సీజన్ ను లాంచ్ చేసేస్తున్నారు.



ఈ పండుగల మధ్యలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో క్యూరియాసిటీ పెంచడం.. పాత కంటెస్టెంట్లను కూడా గేమ్ లో భాగం చేయడం.. సర్ ప్రైజింగ్ గెస్టులతో కంటెస్టెంట్లలో ఉత్సాహాన్ని నింపడం.. వీటికి కొనసాగింపుగా ఫ్యామిలీ వీక్.. ఇలా అనుకోని రీతిలో.. అనూహ్య రీతిలో గేమ్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు.. ఈసారి కూడా 24/7 లైవ్ అందుబాటులో ఉంటుందని.. వీకెండ్ ఎపిసోడ్స్ తప్ప మిగతా 5 రోజుల పాటు.. అన్ లిమిటెడ్ గా ఎంటర్ టైన్ మెంట్ ను జనానికి అందించడమే లక్ష్యంగా బిగ్ బాస్ టీమ్ పక్కా ప్లాన్ చేసిందని తెలుస్తోంది. ఇదే నిజమైతే.. ఈసారి ఎంటర్ టైన్ మెంట్ మామూలుగా ఉండదన్న అంచనాలు.. పెరిగిపోతున్నాయి.


Also Read:నేచర్ థీమ్‌తో రెడీ అయిన బిగ్‌బాస్‌ సెట్‌- లోపల ఎలా ఉందో చదివేయండి!