Bigg Boss OTT Telugu | ‘బిగ్ బాస్’ సీజన్-4 ఎంత రంజుగా సాగిందో మీకు తెలిసింది. ఆ సీజన్‌లో ఎక్కువ హైలెట్ అయ్యింది అభిజిత్(Abhijeeth), మోనల్, అఖిల్(Akhil Sarthak), సోహైల్(Sohile) మాత్రమే. వారి మధ్య సాగిన ట్రయాంగిల్ స్టోరీ.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మొదట్లో ‘అభి-మోనల్’ దోస్తీ క్రమేనా వివాదాస్పదం కావడం. వారి మధ్యకు అఖిల్ ఎంట్రీ ఇవ్వడం, సీజన్ మొత్తం మోనల్‌తోనే కనిపించడం ఇలా చాలానే జరిగాయి. వారి మధ్య కెమిస్ట్రీ చూసి అఖిల్, మోనల్(Monal Gajjar) ప్రేమలో ఉన్నారేమో అనే సందేహం కూడా చాలామందిలో కలిగింది. దీంతో బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకుంటారనే రూమర్స్ కూడా వచ్చాయి. కానీ, ప్రేక్షకులు ఊహించనది ఏదీ బయట జరగలేదు. వారి కెమిస్ట్రీ కేవలం ‘బిగ్ బాస్’కే పరిమితమైంది. బయటకు వెళ్లిన తర్వాత అప్పుడప్పుడు కలుస్తూ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు కూడా షేర్ చేశారు. ఇద్దరు కలిసి గతేడాది ‘తెలుగు అబ్బాయి, గుజరాతీ అమ్మాయి’ వెబ్ సీరిస్‌లో నటిస్తున్నారు. కోవిడ్ వల్ల షూటింగ్ ఆగినట్లు సమాచారం. 


‘ఢీ’ నుంచి మళ్లీ ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’కు: ‘బిగ్ బాస్’ సీజన్-4లో ఫినాలే వరకు వెళ్లి కొద్దిలో టైటిల్ మిస్సయ్యాడు అఖిల్. అభికి గట్టి పోటీ ఇచ్చి రన్నరప్‌గా నిలిచాడు. అయితే, విన్నర్, రన్నర్ కంటే ఎక్కువ లాభపడింది సోహైల్ మాత్రమే. ఇక మోనల్ కూడా టాప్‌-5లోకి వస్తుందని భావించినా, ఆమెకు హారిక, అరియానా ఊహించని షాకిచ్చారు. చివరి వారం ఎలిమినేషన్‌లో ఆమె రేసు నుంచి తప్పుకుంది. ఆ తర్వాత అఖిల్ అప్పుడప్పుడు ‘స్టార్ మా’ రియాల్టీ షోల్లో మాత్రమే కనిపించాడు. మోనల్.. డ్యాన్స్ ప్లస్ షోకు జడ్జిగా వ్యవహరించింది. ఈ షోలో ముమైత్ ఖాన్ కూడా జడ్జి. దీంతో మోనల్, ముమైత్‌లు కూడా ఫ్రెండ్స్ అయ్యారు. దాదాపు రెండేళ్ల తర్వాత అఖిల్ ‘ఢీ’ కొత్త సీజన్‌లో ఛాన్స్ కొట్టేశాడు. కానీ, అతడికి మళ్లీ ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’లో పాల్గొనేందుకు అవకాశం లభించింది. 


పాతవాళ్లైనా పర్వాలేదంటూ..: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’లో అఖిల్ ఇప్పుడు పూర్తిగా తన స్ట్రాటజీ మార్చాడు. కూల్‌గా కనిపిస్తూ అందరితో కలిసిపోతున్నాడు. ముఖ్యంగా అజయ్, ముమైత్ ఖాన్, స్రవంతి, తేజస్వి, శివతో ఎక్కువ కలుస్తున్నాడు. మంగళవారం ప్రసారమైన 4వ ఎపిసోడ్‌లో అఖిల్, ముమైత్ ఖాన్, స్రవంతి, అజయ్‌లు కలిసి కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. అఖిల్‌కు తగిన జోడీ దొరకడం లేదంటూ ముమైత్ ఖాన్న అనడంతో.. వైల్డ్ కార్డు ద్వారా అందమైన, కొత్త అమ్మాయిని పంపితే బాగుంటుందని అజయ్ అన్నాడు. దీంతో అఖిల్ ‘‘పాతవాళ్లైనా పర్వాలేదు’’ అని సిగ్గుపడుతూ చెప్పాడు. దీంతో స్రవంతి, అజయ్‌లు.. ‘‘నువ్వు ఎవరు రావాలని అనుకుంటున్నావో మాకు తెలుసు’’ అంటూ కాసేపు ఆటపట్టించారు. 


Also Read: బిగ్ బాస్ నాన్ స్టాప్ - అఖిల్ ముందే అభిజీత్ పేరెత్తిన శ్రీ రాపాక, అతడి రియాక్షన్ ఇది!


మోనల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ సాధ్యమేనా?: ముమైత్ కూడా ‘‘అవును, మీ గురించి విన్నాను. ఆమె(మోనల్) నీకు వీడియో కాల్ చేసినప్పుడు నీతో మాట్లాడాను గుర్తుందా? అప్పుడు నిన్ను రమ్మని పిలిచాం, రాలేదు ఎందుకు?’’ అని ముమైత్ ఖాన్ అడిగింది. ఇందుకు అఖిల్ సమాధానం ఇస్తూ.. ‘‘మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, ఆమె కోసం వెతుకుతూ అక్కడికి వస్తే వేరేలా అనుకుంటారు. షూటింగ్స్ వల్ల ఆమెను మళ్లీ కలవడం కుదరలేదు. తాను కూడా షూటింగ్స్‌తో బిజీగా ఉంది’’ అని తెలిపాడు. మొత్తానికి అఖిల్‌ ‘బిగ్ బాస్’ హౌస్‌లో మోనల్‌ను మిస్సవుతున్నాడని అర్థమవుతోంది. మరి, అఖిల్ కోరుకున్నట్లే ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’లోకి మోనల్‌ను పంపితే షోకు ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి. కానీ, మోనల్ ప్రస్తుతం పలు సినిమాల్లో బిజీగా ఉంది. మంగళవారం ఆమె నయన తార బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ నిర్మిస్తున్న తొలి గుజరాతీ చిత్రంలో మోనల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెకు ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడం కష్టమే. 


Also Read: తమిళ ‘బిగ్ బాస్’లో భళా అనిపించిన బిందు మాధవి - వామ్మో, గట్టి పోటీయే ఇచ్చింది!