Bigg Boss Non Stop: 'బిగ్ బాస్' నాన్-స్టాప్ షో మొదలైంది. హోస్ట్ నాగార్జున 17 మంది కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించారు. గత బిగ్ బాస్ సీజన్లలోని బిగ్ బాస్ సభ్యులను వారియర్స్‌గా, కొత్త సభ్యులను ఛాలెంజర్స్‌గా హౌస్‌లోకి పంపించారు. మూడో రోజు సోమవారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగిన హైలెట్స్‌ను ఇప్పుడు చూసేద్దాం!


గుడ్ వైబ్స్-బ్యాడ్ వైబ్స్ : ఈరోజు ఎపిసోడ్ లో కంటెస్టెంట్లకు ఓ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. బిగ్ బాస్ ఇంట్లో తమకు నచ్చిన, నచ్చని వ్యక్తుల గురించి చెప్పాలని, వారికి థమ్స్ అప్, థమ్స్ డౌన్ బ్యాడ్జీలు పెట్టాలని తెలిపారు. ముందుగా అరియానా(Ariyana) అజయ్‌కు థమ్స్ అప్ ఇచ్చింది. అజయ్ తనకు బాగా నచ్చాడని, అతడి సమయస్ఫూర్తి నచ్చిందని చెప్పింది. తనతో బాండింగ్ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంది. శ్రీ రాపాకకు థమ్స్ డౌన్ ఇచ్చింది. తనని ఓవర్ యాక్షన్ అనడం తట్టుకోలేకపోయానని అరియానా ఫీలయ్యింది. ఆ తర్వాత అఖిల్(Akhil) కూడా అజయ్‌కు థమ్స్ అప్, శ్రీ రాపాకకు థమ్స్ డౌన్ ఇచ్చాడు. 


అజయ్ - (3 లైక్స్/0 డిస్ లైక్స్) అరియానా, అఖిల్, ముమైత్ ఖాన్ (థమ్స్ అప్)
శ్రీ రాపాక - (0/3) అరియానా, అఖిల్, ముమైత్ ఖాన్ (థమ్స్ డౌన్)
శివ - (2/0) సరయు, నటరాజ్ మాస్టార్ (థమ్స్ అప్) 
అనిల్ - (1/1) సరయు (థమ్స్ డౌన్), అషు రెడ్డి (థమ్స్ అప్)
మిత్ర - (1/3) అషు, మహేష్, తేజస్వి(థమ్స్ డౌన్) మిత్ర (థమ్స్ అప్)
చైతూ - (1/0) మహేష్ (థమ్స్ అప్)
స్రవంతి - (1/2) తేజస్వి (థమ్స్ అప్) హమీద, నటరాజ్ మాస్టార్ (థమ్స్ డౌన్)


మిత్ర ముద్దులు - సరయు బూతులు : ఛాలెంజర్స్ తో ముచ్చట్లు పెడుతోన్న ముమైత్(Mumaith khan) దగ్గరకు మిత్ర వచ్చి 'ఐ లవ్యూ' చెబుతూ ముద్దులు పెట్టడం మొదలుపెట్టింది. నిన్న కూడా అలానే చేసింది. ముమైత్ కొన్ని విషయాలను మిత్రతో షేర్ చేసుకుంటుంటే.. సడెన్ గా ఆమెకి హగ్గులిచ్చి, ముద్దులు పెట్టింది. ఎంతసేపటికీ ఆపకపోవడంతో ముమైత్ వదలమంటూ నవ్వుతూ చెప్పింది.కానీ ఈరోజు మాత్రం ముమైత్ చాలా చిరాకు పడింది. అయినప్పటికీ మిత్ర ముద్దులు పెట్టడం ఆపకపోవడంతో ఆమె మెల్లగా తోసేసింది. ఇక బెడ్ రూమ్ లో హమీద(Hamida), సరయు(Sarayu) కలిసి క్లీన్ చేస్తుండడంతో ఆర్జే చైతు వచ్చి వాళ్లను ఏడిపిస్తున్నాడు. ఇంతలో సరయు తనదైన స్టైల్ లో బూతులతో సెటైర్లు వేయడం మొదలుపెట్టింది. మధ్యలో సెన్సార్ అంటూ డైలాగ్ కూడా వేసింది.  


కెప్టెన్సీ టాస్క్ : హౌస్ మేట్స్ కి కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇప్పటివరకు ఇల్లు ఛాలెంజర్స్ ఆధీనంలో ఉందని.. ఈ టాస్క్ తో వారియర్స్ ఇంటిని కంట్రోల్ లోకి తీసుకోవచ్చని చెప్పారు బిగ్ బాస్. ఇందులో ఛాలెంజర్స్ వర్సెస్ వారియర్స్ డేర్ ఛాలెంజ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ఎవరు గెలుస్తారో వారి టీమ్ నుంచి కెప్టెన్ ఎన్నికయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం టాస్క్ లు జరుగుతూనే ఉన్నాయి. 


Also Read:నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ చూడలేని వారికోసం స్పెషల్ ఎపిసోడ్స్


Also Read: 'బిగ్ బాస్ నాన్ స్టాప్' - నాగార్జున రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?