బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ఓటీటీ వెర్షన్ ను మొదలుపెట్టింది. 24 గంటల పాటు హాట్ స్టార్ లో ఈ షో ప్రసారమవుతూనే ఉంటుంది. ఈ షోకి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి బిగ్ బాస్ సీజన్ 3 నుంచి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
ఓటీటీ వెర్షన్ కి హోస్ట్ మారతారేమో అనుకుంటే.. మళ్లీ నాగార్జుననే కంటిన్యూ చేస్తున్నారు. 17 మంది కంటెస్టెంట్స్ తో ఫిబ్రవరి 26న గ్రాండ్ గా ఈ షోని మొదలుపెట్టారు. షో మొదలైన రెండో రోజే నామినేషన్స్ పెట్టి హౌస్ మేట్స్ మధ్య గొడవలు పెట్టేశారు బిగ్ బాస్. అలానే కెప్టెన్సీ టాస్క్ కూడా జరుగుతోంది. ఇదిలా ఉండగా.. సాధారణంగా నాగార్జున శనివారం, ఆదివారం మాత్రమే స్క్రీన్ పై కనిపించేవారు.
అయితే ఓటీటీ వెర్షన్ కి సంబంధించి మాత్రం శనివారం మాత్రమే హోస్ట్ గా కనిపించనున్నారు. ఈ క్రమంలో నాగార్జున బిగ్ బాస్ ఓటీటీ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత సీజన్ కి గాను పది నుంచి పన్నెండు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్న నాగార్జున ఈసారి కొంత తగ్గించినట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ నాన్-స్టాప్ హోస్టింగ్ కోసం ఆయన దాదాపు రూ.8 నుంచి 9 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నాగార్జున ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నా తప్పు లేదంటున్నారు అభిమానులు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నాగ్.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలానే రెండు, మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి.