బుల్లితెరపై ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ మంచి రేటింగ్స్ సాధించింది. ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ఓటీటీ వెర్షన్ ను మొదలుపెట్టారు. షో మొదలైన రెండో రోజే నామినేషన్స్ పెట్టి షాకిచ్చారు బిగ్ బాస్. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నటరాజ్ మాస్టర్, సరయు, ముమైత్ ఖాన్, హమీద, అరియానా, ఆర్జే చైతు, మిత్ర శర్మ నామినేట్ అయ్యారు.
ఇక ఈరోజు ఎపిసోడ్ లో కంటెస్టెంట్లకు ఓ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. బిగ్ బాస్ ఇంట్లో తమకు నచ్చిన, నచ్చని వ్యక్తుల గురించి చెప్పాలని, వారికి థమ్స్ అప్, థమ్స్ డౌన్ బ్యాడ్జీలు పెట్టాలని తెలిపారు. ముందుగా అరియానా తనకు అజయ్‌కు థమ్స్ అప్ ఇచ్చింది. శ్రీ రాపాకకు థమ్స్ డౌన్ ఇచ్చింది. తనని ఓవర్ యాక్షన్ అనడం తట్టుకోలేకపోయానని అరియానా ఫీలయ్యింది. ఆ తర్వాత అఖిల్ కూడా అజయ్‌కు థమ్స్ అప్, శ్రీ రాపాకకు థమ్స్ డౌన్ ఇచ్చాడు.
నామినేషన్స్, ఛాలెంజర్స్ వర్సెస్ వారియర్స్ టాస్క్ లతో కంటెస్టెంట్ల మధ్య మనస్పర్థలు పెరిగాయి. ఈ క్రమంలో ముమైత్ ఖాన్ వలన హీరోయిన్ శ్రీరాపాక బాగా హర్ట్ అయినట్లు ఉంది. ఆమె తన తోటి కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ.. ముమైత్ తో మూడేళ్లక్రితం జరిగిన సంఘటనను షేర్ చేసుకుంది. అప్పట్లో ముమైత్ తన చేయి విరగ్గొట్టిందని.. అప్పుడు చేయి దారుణంగా వాచిపోయిందని.. దీనికి ఆర్జే చైతునే సాక్ష్యమని చెప్పింది.
ఆ సమయంలో చైతు-కాజల్ అక్కడే ఉన్నారని.. చేయి విరిగినట్లుగా రిపోర్టులు చూసి తనవైపు నిలబడ్డారని చెప్పుకొచ్చింది. అయినా సరే ఆ విషయాన్ని అక్కడితో వదిలేశానని.. కానీ ముమైత్ ఇంకా దాన్నే మనసులో పెట్టుకుందని.. ఇప్పుడు బిగ్ బాస్ షోకి వచ్చిన తరువాత తనంతో అదోలా మాట్లాడుతుందని చెప్పుకొచ్చింది. నేరుగా వెళ్లి ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా.. ఆమె మాత్రం పట్టించుకోవడం లేదని.. పైగా తనను అబద్దాలకోరు అని కామెంట్ చేసిందని బాధ పడింది.
తన శరీరానికి గాయం చేసినా.. పట్టించుకోలేదని.. కానీ ఆమె(ముమైత్) మాత్రం అదే విషయాన్ని పట్టుకొని వేలాడుతూ తనను టార్గెట్ చేస్తుందని చెప్పుకొచ్చింది. చీటర్, లయర్ అనే పదాలు తనకు నచ్చవని.. ఆ మాట నేను భరించలేకపోతున్నాను అంటూ ఏడ్చేసింది. మరి ఫ్యూచర్ లో వీరి రిలేషన్ బలపడుతుందో.. లేక గొడవలు పడతారో చూడాలి!
Also Read: తమిళ ‘బిగ్ బాస్’లో భళా అనిపించిన బిందు మాధవి - వామ్మో, గట్టి పోటీయే ఇచ్చింది!
Also Read: నన్ను పెళ్లి చేసుకుంటావా? చైతూకు సరయు ఆఫర్, హమీదాకు వాతలు పెడతానన్న నటరాజ్!
బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరే:
వారియర్స్:
1. అషురెడ్డి (సీజన్ 3)
2. మహేష్ విట్టా (సీజన్ 3)
3. ముమైత్ ఖాన్ (సీజన్ 1)
4. అరియనా (సీజన్ 4)
5. నటరాజ్ మాస్టర్ (సీజన్ 5)
6. తేజస్వి మదివాడ (సీజన్ 2)
7. సరయు (సీజన్ 5)
8. హమీద (సీజన్ 5)
9. అఖిల్ సార్థక్ (సీజన్ 4)
ఛాలెంజర్స్:
1. ఆర్జే చైతు (ఆర్జే)
2. అజయ్ కతుర్వర్ (నటుడు)
3. స్రవంతి చొక్కారపు (యాంకర్)
4. శ్రీరాపాక (నటి)
5. అనిల్ రాథోడ్ (మోడల్)
6. మిత్రా శర్మ (నటి, నిర్మాత)
7. యాంకర్ శివ (యూట్యూబ్ యాంకర్)
8. బిందు మాధవి (హీరోయిన్)