Bigg Boss Telugu 7: ఫినాలే అస్త్ర కోసం కంటెస్టెంట్స్ మరో రెండు ఛాలెంజ్‌లను ఎదుర్కున్నారు. ఈ రెండు ఛాలెంజ్‌ల్లో ఒకదాంట్లో పల్లవి ప్రశాంత్ విన్ అవ్వగా.. మరోదాంట్లో అర్జున్ గెలిచాడు. ఇక ఫినాలే అస్త్ర టాస్కులు మొదలయినప్పటి నుంచి ప్రతీ ఛాలెంజ్‌లో అయితే ప్రశాంత్ లేదా అర్జున్.. ఇలా ఈ ఇద్దరిలోనే ఎవరో ఒకరు గెలుస్తూ వస్తున్నారు. అయినా కూడా పాయింట్స్ బోర్డులో పల్లవి ప్రశాంత్.. ఇంకా చివరిలోనే ఉన్నాడు. శివాజీ, శోభా కలిసి అమర్‌దీప్‌కు పాయింట్స్ ఇవ్వడంతో పాయింట్స్ టేబుల్‌లో లీడ్‌లో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలోనే అర్జున్ నిలబడ్డాడు. బుధవారం ఫినాలే అస్త్రా టాస్కుల ద్వారా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం కూడా చేశారు కంటెస్టెంట్స్.
జెండా ఎత్తడం కోసం గౌతమ్ స్ట్రాటజీ..
ఫినాలే అస్త్రా కోసం బిగ్ బాస్ ఇచ్చిన నాలుగో ఛాలెంజ్ ‘ఎత్తరా జెండా’. ఈ టాస్క్ కోసం గార్డెన్ ఏరియాలో కంటెస్టెంట్స్ పేరుపై విడివిడిగా పడవలు ఏర్పాటు చేసుంటాయి. ఆ పడవల్లో వారి ఫోటో ఉన్న జెండాలు కూడా ఉంటాయి. గార్డెన్ ఏరియాలో మరోవైపు ఉన్న ఇసుకను తీసుకొచ్చి వారి పడవల్లో పోసి ఆ పడవ మరోవైపు వాలేలా చేయాలి. అంటే వారి జెండాను పైకి ఎత్తాల్సి ఉంటుంది. ఈ టాస్కులో జెండాను ముందుకు ఎవరు పైకి ఎత్తుతారో వారికి 100 పాయింట్లు లభిస్తాయి. చివరిగా చేసినవారికి 50 పాయింట్లు లభిస్తాయి. ఈ టాస్క్‌కు శివాజీ, శోభా సంచాలకులుగా వ్యవహరించారు.
బజర్ మోగిన వెంటనే కంటెస్టెంట్స్ అంతా టాస్క్‌ను పోటాపోటీగా ప్రారంభించారు. సంచాలకులు పెట్టిన రూల్ ప్రకారం ఇసుక నింపిన మగ్‌ను ఒక చేతితోనే పట్టుకోవాలి. పల్లవి ప్రశాంత్ మాత్రం ఇసుక సరిగా నింపకుండానే రెండు చేతులతో మగ్‌ను తీసుకెళ్తున్నాడని శోభా ఆరోపించింది. మధ్యలో జోక్యం చేసుకున్న శివాజీ.. అందరూ అలాగే చేస్తున్నారంటూ ఎప్పటిలాగానే ప్రశాంత్‌కు సపోర్ట్ చేశాడు. ఇక ఈ టాస్క్.. కంటెస్టెంట్స్ అందరికీ ఒకవిధంగా అర్థమయితే గౌతమ్‌కు మాత్రం మరో విధంగా అర్థమయ్యింది. జెండాను పైకి ఎత్తడం కోసం పడవలో ఒకవైపు ఉన్న ఇసుకను మరోవైపు వేయడం మొదలుపెట్టాడు గౌతమ్. అది ఫౌల్ గేమ్ అని శోభా, శివాజీ ఎంత చెప్పినా వినలేదు. ఆఖరికి బిగ్ బాసే గేమ్‌ను పాస్ చేయించి గౌతమ్ ఆట ఫౌల్ అని ప్రకటించారు. ఇక ఈ టాస్క్‌లో పల్లవి ప్రశాంత్ ముందుగా తన జెండాను పైకి ఎత్తి 100 పాయింట్లను సాధించుకున్నాడు. అందరితో పోటీపడలేని ప్రియాంక నిధానంగా టాస్క్‌ను పూర్తిచేసి 50 పాయింట్లు సంపాదించుకుంది.
టాస్కుల మధ్యలో ఎంటర్‌టైన్మెంట్..
బ్యాక్ టు బ్యాక్ టాస్కులు ఆడి అలసిపోయిన కంటెస్టెంట్స్ మంచాలపై రెస్ట్ తీసుకున్నారు. కానీ అది బిగ్ బాస్‌కు నచ్చలేదు. అందుకే ఇప్పటినుండి హౌజ్‌లో లైట్స్ ఆఫ్ అయ్యేవరకు ఎవరూ కనీసం నడుము వాల్చకూడదు అని రూల్ పెట్టారు. అంతే కాకుండా కంటెస్టెంట్స్ అందరికీ బద్దకం పెరిగిపోయిందని, దీని వల్ల ప్రేక్షకులు కూడా బోర్ ఫీల్ అవుతున్నారని, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం కోసం ప్రతీ కంటెస్టెంట్‌కు ఒక నిమిషం సమయాన్ని ఇచ్చారు. ఎంటర్‌టైన్ చేయాలంటే ఏం చేయాలి అంటూ శోభా.. తనకు ఇచ్చిన ఒక నిమిషంలో తన కష్టాలను మాత్రమే చెప్పుకుంటూ ఉంది.
అర్జున్ మిమిక్రీ చేస్తూ బిగ్ బాస్ షో గురించి చెప్పాడు. అర్జున్ తర్వాత శివాజీ వచ్చి అమర్, ప్రశాంత్, యావర్ ఎలా ఏడుస్తారు, ఎలా మాట్లాడతారు అని ఇమిటేట్ చేసి చూపించాడు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అంతా గెస్ చేయ్ గురూ టాస్క్‌లో పాల్గొన్నారు. ఈ టాస్కులో సమయానుసారం బిగ్ బాస్ కొన్ని సౌండ్స్‌ను వినిపిస్తారు. అవేంటో గెస్ చేసి రాయాలి. ఈ టాస్కులో కూడా అర్జునే ఎక్కువగా చురుగ్గా పాల్గొని 100 పాయింట్స్‌ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత స్థానంలో అమర్‌దీప్, అర్జున్, ప్రియాంక ఉండగా.. చివరి స్థానాల్లో ప్రశాంత్, యావర్ ఉన్నారు.
Also Read: ‘యానిమల్’లో రణబీర్‌కు బదులు మహేష్ నటిస్తే, ఇదిగో ఇలా ఉంటుందట, డీప్ ఫేక్ వీడియో వైరల్
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply