'బిగ్ బాస్' నాన్-స్టాప్(Bigg Boss Non-Stop) షో మొదలైంది. హోస్ట్ నాగార్జున 17 మంది కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించారు. గత బిగ్ బాస్ సీజన్లలోని బిగ్ బాస్ సభ్యులను వారియర్స్‌గా, కొత్త సభ్యులను ఛాలెంజర్స్‌గా హౌస్‌లోకి పంపించారు. రెండు రోజులుగా హౌస్ లో కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లు జరుగుతున్నాయి. కంటెస్టెంట్స్ తో కొన్ని టాస్క్ లు ఆడించి.. వాటిలో గెలిచిన కొందరిని కెప్టెన్సీ కంటెండర్స్ తో ఎంపిక చేశారు. 


అయితే ఈ టాస్క్ లలో వారియర్స్ ఎక్కువ పాయింట్స్ గెలుచుకోవడంతో.. వారి టీమ్ నుంచి నటరాజ్ మాస్టర్(Nataraj Master), అఖిల్(Akhil), మహేష్ విట్టా(Mahesh Vitta), సరయు(Sarayu), అరియానా(Ariyana), తేజస్వి(Tejaswi)లు కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడ్డారు. ఈ టాస్క్ లో భాగంగా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న బాక్స్ లని సెలక్ట్ చేసుకొని, పూల్ లో ఉన్న కీస్ ను తీసి వాటికి సరిపడా ఉన్నాయో లేదో చెక్ చేసి బాక్స్ లో ఉన్న కెప్టెన్సీ పౌచ్ ని బయటకి తీయాల్సి ఉంటుంది.


ఈ టాస్క్ లో ఎవరి స్ట్రాటజీలు వాళ్లు వేసుకున్నారు. అఖిల్ అయితే తనకు దొరికిన కీస్ అన్నింటినీ గుప్పెట్లో పెట్టుకొని మరీ బాక్స్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు. చాలా కీస్ అఖిల్ దగ్గరే ఉన్నాయి. అతడు మొండిగా తన దగ్గరున్న కీస్ ను ట్రై చేస్తూనే ఉన్నాడు. వేరే వాళ్లకు తాళాలు దొరక్కుండా చేశాడు. అయినప్పటికీ తేజస్వి పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉంది. ఫస్ట్ తాళం చాలా ఈజీగా ఓపెన్ చేసినా.. రెండో తాళం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. 


దీంతో ఈ గేమ్ లో ఎవరు గెలుస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ టాస్క్ కి మిత్రాశర్మని సంచాలక్ గా పెట్టగా.. ఆమె గేమ్ ని చూస్తూ ఉండిపోయింది. ఎవరికీ ఎలాంటి కమాండ్స్ చెప్పలేదు. అయితే ఈ టాస్క్ లో అందరికంటే ముందు తేజస్వి బాక్స్ ను ఓపెన్ చేయడంతో ఆమెను కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఈ మొత్తం గేమ్ ని చాలా జాగ్రత్తగా గమనించి తేజస్వితో డిస్కస్ చేసింది. సో.. ఫస్ట్ కెప్టెన్ గా తేజస్వి ఎంపికైంది. మరి ఎవరికి ఎలాంటి పనులు ఎసైన్ చేస్తుందో చూడాలి!


Also Read: 'తోలుతీస్తా' యాంకర్ శివకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నటరాజ్ మాస్టర్


Also Read:నటరాజ్ మాస్టర్ ని కావాలనే టార్గెట్ చేస్తున్నారా? కూతుర్ని తలచుకుంటూ ఏడ్చేశాడు