రీసెంట్ గా బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ మొదలైన సంగతి తెలిసిందే. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటూ షోకి స్టార్ట్ చేశారు. కానీ సడెన్ గా లైవ్ ఆగిపోయింది. బుధవారం రాత్రి 12 గంటల అడిగిన లైవ్ తిరిగి గురువారం రాత్రి 12 గంటలకు మొదలైంది. దీంతో ఇప్పుడు ఒకరోజు ఆలస్యంగా షో నడుస్తోంది. దీన్ని బిగ్ బాస్ నిర్వాహకులు ప్రతి రోజు ముప్పై నుంచి 45 నిమిషాల ఎపిసోడ్ ను రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ చేస్తున్నారు. తాజాగా కొత్త ఎపిసోడ్ ను ప్రసారం చేశారు. 


వారియర్స్ అండ్ ఛాలెంజర్స్.. రెండు గ్రూపులకు మార్నింగ్ యాక్టివిటీలో భాగంగా టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. వారియర్స్ వాళ్ల సీజన్ లో గేమ్ ని ఎనలైజ్ చేయమని.. వాళ్లు ఎందుకు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చిందో కారణాలను తెలిపామని చెప్పారు. ఈ క్రమంలో అషురెడ్డికి, తేజస్వికి పెద్ద వాదన జరిగింది. ఈ విషయంలో అషు చాలా బాధపడింది. అరియనాతో తన మనసులో బాధను షేర్ చేసుకుంది. 


కిచెన్ లో తేజస్వి చాలా రూడ్ గా మాట్లాడుతుందని.. ఆమె తన సీజన్ నుంచి ఏం నేర్చుకుందని ప్రశ్నించింది అషురెడ్డి. తరువాత హౌస్ మేట్స్ అందరూ కలిసి వింత వస్తువులు అనే టాస్క్ లో పాల్గొన్నారు. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో భాగంగా ఈ గేమ్ లో పాల్గొన్నారు. ఈ పోటీలో అషురెడ్డి తనకు ఇచ్చిన బొమ్మని సక్సెస్ ఫుల్ గా బయటకు తీసింది. వారియర్స్ అందరూ కలిసి ఛాలెంజర్స్ పై విజయం సాధించింది. 


వారికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా గెలిచారు. దీంతో వారియర్స్ నుంచి ఏకాభిప్రాయంతో ఇద్దరిని కెప్టెన్సీ పోటీదారులుగా ఎన్నుకోమని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో మెజారిటీ ఓట్లు అరియానా, అఖిల్ కి రావడంతో వారిని కెప్టెన్సీ పోటీదారులుగా ఎన్నుకున్నారు. అషురెడ్డికి ఎక్కువ మంది వారియర్స్ ఓట్లు వేయలేదు. మహేష్ విట్టా, ముమైత్ లు మాత్రం అషురెడ్డి పేరు చెప్పారు. గేమ్ ఎంత బాగా ఆడినా.. తనను డీమోటివేట్ చేస్తున్నారంటూ అనిల్, స్రవంతిలతో చెప్పుకొని బాధపడింది. 


ఎంతో బాగా ఆడదామని వచ్చానని.. కానీ ఇలా ప్రతి విషయంలో తనను తగ్గించేస్తున్నారని ఎమోషనల్ అయింది. వచ్చే వారంలోనైనా కెప్టెన్సీ టాస్క్ కోసం ప్రయత్నిస్తానని చెప్పింది అషు. ఆ తరువాత లైట్స్ అన్నీ ఆపేసిన తరువాత బెడ్ పై కూర్చొని ఏడ్చేసింది అషు. తనకు ఓట్లు పడకపోవడంతో బాధ పడిందా..? లేక తేజస్వితో గొడవ వలనో కానీ అషురెడ్డి ఏడవడం ఫ్యాన్స్ ను బాధపెట్టింది.