Bigg Boss 6 Telugu: దసరా పండుగకు బిగ్‌బాస్ ఇల్లు, నాగార్జున, కంటెస్టెంట్లు అందంగా ముస్తాబైపోయారు. ప్రేక్షకులను అలరించేందుకు స్టార్ సింగర్లు, హీరోయిన్లు కూడా స్టేజీ మీదకు వచ్చారు. అందుకే నిన్న ఎవరు సేవ్ అయ్యారో కూడా నాగార్జున చెప్పలేదు. ఎవరి మూడ్ కూడా చెడగొట్టే ఉద్దేశం లేకే ఇలా చేసినట్టున్నారు. అయితే ఈ రోజు మాత్రం ఆరోహి ఎలిమినేట్ అవ్వబోతోందని సమాచారం.
దసరా ఎసిపోడ్ చాలా సరదాగా సాగింది. మంచి డ్రెస్సులతో రెడీ అయిపోయారు కంటెస్టెంట్లు. వారిచేత దసరా సందర్భంగా కొబ్బరికాయలు కొట్టించారు. పాటలకు డ్యాన్సులు వేయించారు. రకరకాల ఆటలు ఆడించారు. ఇందులో ఫన్నీగా అనిపించినా టాస్కు ఎవరు వేగంగా తింటారు అన్న గేమ్‌లో శ్రీసత్య తినడం మాత్రం చాలా నవ్వుతెప్పించింది. ఇక అమ్మాయి అబ్బాయిలకు మధ్య బల పరీక్ష పెట్టారు. ఇందులో రాజశేఖర్‌తో ఫైమా పోటీ పడింది. రాజశేఖర్ ఒక చేయి వాడితే, ఫైమా మాత్రం రెండు చేతులు వాడింది. ఇక రేవంత్, గీతూ మధ్య పోటీ జరిగింది. తరువాత శ్రీసత్య - అర్జున్ కళ్యాణ్ పోటీపడ్డారు. శ్రీసత్య ‘నువ్వు ఇప్పుడు ఓడిపోతే రాత్రి నీకు అన్నం తినిపిస్తా’ అంది.అంతే వెంటనే ఓడి పోయాడు అర్జున్.
రుక్సర్ థిల్లాన్, రితికా సింగ్, శ్రద్ధా దాస్ పాటలకు డ్యాన్సులు వేశారు.
నాగార్జున సినిమా ‘ఘోస్ట్’ప్రమోషన్లో భాగంగా ఆ సినిమాలో నటించిన సోనాల్ చౌహాన్ వచ్చింది. ఆమెతో కాసేపు మాట్లాడించారు నాగార్జున. చేదు లడ్డూలు, తీపి లడ్డూలు ఇచ్చారు బిగ్ బాస్. కంటెస్టెంట్లు తమకు నచ్చిన వారికి స్వీట్ లడ్డూ, నచ్చని వారికి చేదు లడ్డూ ఇమ్మని చెప్పారు. తరువాత మళ్లీ బోలెడు గేమ్స్ ఆడించారు. కంటెస్టెంట్లు డ్యాన్సులు ఇరగదీశారు. శ్రీహాన్- ఫైమా చక్కగా డ్యాన్సు చేశారు. శ్రీసత్య-అర్జున్, మెరీనా - రోహిత్ ఇలా పోటీపడ్డారు. మొత్తంమ్మీద ఈరోజు ఎపిసోడ్ ఎంటర్ టైనింగ్ గా ఉండబోతోంది.
ఈ సారి నామినేషన్స్ లో ఎక్కువమందే ఉన్నారు. ఆదివారం కీర్తి, అర్జున్ కళ్యాణ్ నేరుగా నామినేట్ అయ్యారు.
1. సుదీప
2. కీర్తి
3. ఆరోహి
4. గీతూ
5. శ్రీహాన్
6. ఇనయా
7. రాజశేఖర్
8. సూర్య
9. అర్జున్
10. రేవంత్
ఇక వీరిలో ఆరోహి తక్కువ ఓట్లతో ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది.