బిగ్ బాస్ సీజన్ 5లో సన్నీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారాడు. అతడికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎలిమినేషన్ లో వచ్చిన ప్రతిసారి సన్నీ సేవ్ అయిపోతున్నాడు. ట్రోఫీ కూడా కొట్టేస్తాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ కి 'అనుభవించు రాజా' సినిమా టీమ్ అతిథులుగా వచ్చారు. ఇందులో కమెడియన్ సుదర్శన్ కూడా ఉన్నాడు. స్టేజ్ పైకి వచ్చిన ఆయన హౌస్ మేట్స్ పై పంచ్ లు వేస్తూ నవ్వించారు. అయితే కాజల్-సన్నీల రిలేషన్ గురించి తప్పుగా మాట్లాడాడు సుదర్శన్. 


Also Read: స్టార్ హీరోకి కరోనా పాజిటివ్.. జాగ్రత్తగా ఉండమంటూ అభిమానులకు రిక్వెస్ట్..


అప్పటివరకు సన్నీ, కాజల్ ల గేమ్ గురించి ఫన్నీగా పంచ్ లు వేసిన సుదర్శన్.. కాజల్ ని ఉద్దేశిస్తూ.. 'మీరు అలిగినప్పుడు చాలా బాగుంటుంది. సన్నీ వచ్చి ఓదార్చడం.. అదో టైప్ రొమాన్స్ బాగుంది' అని అన్నాడు. దీంతో షాకైన సన్నీ.. 'మాది బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్' అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో సన్నీ ఫ్యాన్స్ కమెడియన్ సుదర్శన్ ను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నాడు. 


బ్రదర్ అండ్ సిస్టర్ లా ఉంటున్న వాళ్లు మీకు రొమాన్స్ చేస్తూ ఎప్పుడు కనిపించారని..? సుదర్శన్ ను సోషల్ మీడియాలో వేదికగా ప్రశ్నిస్తున్నారు. ప్రమోషన్స్ కోసం వచ్చి ఇలాంటి చీప్ కామెంట్స్ చేయడం ఏంటంటూ మండిపడుతున్నారు. దీంతో సుదర్శన్ ఇందులో తన తప్పు లేదని వివరణ ఇచ్చాడు. స్టేజ్ పై ఉన్నప్పుడు హౌస్ మేట్స్ తో చాలా మాట్లాడానని.. సన్నీ-కాజల్ లతో కూడా మాట్లాడానని, కానీ ఎడిటింగ్ వలన కేవలం ఐదు నిమిషాలే చూపించారని చెప్పుకొచ్చాడు. 


సన్నీ-కాజల్ ల రిలేషన్ గురించి తప్పుగా మాట్లాడే ఉద్దేశం తనకు లేదని.. బయటకు వచ్చిన వీడియో వలన నెగెటివ్ గా అనుకుంటున్నారని తెలిపారు. ఒకవేళ తన మాటల కారణంగా బాధ పడి క్షమించమంటూ సన్నీ, కాజల్ ఫ్యామిలీలను, ఫ్యాన్స్ ను కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 



Also Read:'శ్యామ్ సింగ రాయ్' హిందీ రైట్స్‌ అమ్మేశారు! ఎంత వచ్చిందో తెలుసా?


Also Read: సందీప్ కిషన్ - విజయ్ సేతుపతి పాన్ ఇండియా సినిమాలో విలన్‌గా ఫేమస్ తమిళ దర్శకుడు


Also Read: కైకాల ఆరోగ్య పరిస్థితి.. ఇప్పటికీ విషమంగానే..


Also Read: ఫైనల్ వ‌ర్క్స్‌లో బాలకృష్ణ 'అఖండ'... ఫినిషింగ్ టచ్ ఇస్తున్న తమన్!


Also Read:రవిపై దారుణమైన ట్రోలింగ్.. ఫ్యామిలీను కూడా లాగుతూ..


Also Read: అల్లు అర్జున్ తగ్గేదే లే... ఫుల్ స్వింగులో పుష్పరాజ్ డబ్బింగ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి