BiggBossTelugu7: బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కెప్టెన్సీ టాస్క్ ఎంతో రసవత్తరంగా సాగుతోంది. మూడు రోజులుగా హౌస్ మేట్స్ అంతా వీర సింహాలు, గర్జించే పులులు అనే రెండు టీమ్స్ గా విడిపోయి పోటీ పడుతున్నారు. వీరిలో అమర్ దీప్, శివాజీ, పల్లవి ప్రశాంత్, అర్జున్, ప్రియాంక, అశ్విని గర్జించే పులులు టీం లో ఉంటే యావర్, శోభా శెట్టి, తేజ, గౌతమ్, రతికా, భోలే వీర సింహాలు టీం లో ఉన్నారు. అయితే ఓ గేమ్ లో వీర సింహాలు టీం గెలవడంతో బిగ్ బాస్ ఓ పోటీదారున్ని ప్రత్యర్థి టీంతో స్వాప్ చేసుకునే ఛాన్స్ ఇవ్వడంతో భోలేను గర్జించే పులులకు అప్పగించి అర్జున్ ని వీర సింహాలు టీం లో తీసుకున్నారు.


ఇక గురువారం కెప్టెన్సీ టాస్క్ లో గర్జించే పులులు టీం విన్ అవడంతో వీర సింహాలు టీం దగ్గర ఉన్న 500 బాల్స్ ని తమ సొంతం చేసుకున్నారు. అక్కడితో గేమ్ పూర్తయిందని, హౌస్ మేట్స్ అందరూ తమ బంతులను కాపాడుకోవాలని బిగ్ బాస్ ఆదేశించారు. దీంతో వీర సింహాలు టీం వారి ఆపోజిట్ టీం బంతులను తీసుకునేందుకు ప్రయత్నించారు. అక్కడితో గురువారం ఎపిసోడ్ పూర్తవగా తాజాగా శుక్రవారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో శివాజీ, గౌతమ్ మధ్య డిస్కషన్ పీక్స్ కు చేరింది.


ఒకసారి ప్రోమో గమనిస్తే.. స్లైడ్ నుంచి వచ్చిన బాల్స్ లో ఒక బ్లాక్ బాల్ వీర సింహాలు టీం దగ్గర ఉండడంతో వారికి స్పెషల్ పవర్ లభిస్తుందని బిగ్ బాస్ చెప్పారు. ఆ స్పెషల్ పవర్ ఏంటని టీం వాళ్లు అడగగా.." మీ అపోనెంట్స్ దగ్గర ఉన్న మొత్తం అన్ని బాల్స్ ను మీ దగ్గర ఉన్న బాల్స్ తో స్వాప్ చేసుకోండి" అని బిగ్ బాస్ చెప్పడంతో వీర సింహాలు టీ మెంబర్స్ అంతా ఎగిరి గంతేశారు. దాంతో కిచెన్ లో శివాజీ, "గోల్డెన్ బాల్ అడ్వాంటేజ్ వాళ్లకే, అన్ని అడ్వాంటేజ్ లు వాళ్లకే నా బిగ్ బాస్" అంటూ చెబుతాడు. ఆ తర్వాత భోలే.." వెళ్లిపోయేటప్పుడు నేను వెళ్లిపోవాలి గాని నా బ్లాక్ బాల్ మాత్రం మీకు ఉండాలి సర్లే, ఓకే" అంటూ గౌతమ్ తో అంటాడు.


అనంతరం శివాజీ, ప్రియాంక, గౌతమ్ ల మధ్య డిస్కషన్ మొదలవుతుంది. "రెండు ఎలా ఉంచుతారన్నా" అని గౌతమ్ శివాజీ తో అంటే.. మా ఇష్టం అంటూ శివాజీ బదిలిస్తాడు." మీకు తగినట్లు రూల్స్ మార్చుకుంటే మీరే ఆడుకోండి" అని గౌతమ్ చెప్పడంతో.." నీకు ఇష్టం వచ్చినట్టు ప్రతిసారి చేయాలంటే మేము చేయం. ఏం చేయాలో బిగ్ బాస్ చెప్తాడు కదా. నీకెందుకు వదిలేసేయ్. నీకు ఇంకా ఇవ్వలే కదా మేము, ఎందుకు కంగారు నీకు. అనుకూలంగా ఉన్నప్పుడేమో నువ్వు చాలా సైలెంట్ గా ఉంటావు. నీకు అనుకూలంగా లేకపోతే వైలెంట్ అయిపోతావ్" అని శివాజీ గౌతమ్ తో చెబుతాడు.


దానికి గౌతన్.." నేనేం తప్పు చేశానో చెప్పండి. ఈ గేమ్ లో నేను ఏం తప్పు చేశాను నాకు ఎక్స్ ప్లైన్ చేయండి" అని అంటే.." నీతో నేను మాట్లాడలేను. వాంటెడ్ వాదన పెట్టుకుంటావు నువ్వు" అంటూ శివాజీ గౌతమ్ తో అనగానే.." వాంటెడ్ వాదన ఎవరికి అవసరం లేదన్నా" అని గౌతమ్ చెప్పడంతో ప్రోమో ఎండ్ అవుతుంది. ప్రోమోని బట్టి చూస్తే గౌతమ్, శివాజీల మధ్య డిస్కషన్ పీక్ స్టేజ్ కి వెళ్ళినట్లు అర్థమవుతుంది. మరి వీళ్ళ మధ్య డిస్కషన్ ఎందుకు మొదలైంది? చివరికి కెప్టెన్సీ టాస్క్ గెలిచి కంటెండర్స్ గా నిలిచింది ఏ టీం? అనేది తెలియాలంటే శుక్రవారం ప్రసారం కాబోయే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.


Also Read : 'మా ఊరి పొలిమేర 2' ఆడియన్స్ రివ్యూ : ఆ ట్విస్టులు, నేపథ్య సంగీతం సూపర్ అంటున్నారండోయ్!