Maa Oori Polimera 2 Review : ఓటీటీలో విడుదలైన సినిమాకు సీక్వెల్ థియేటర్లలో విడుదల కావడం అనే ట్రెండ్ బహుశా 'మా ఊరి పొలిమేర 2'తోనే మొదలు అని చెప్పాలేమో!? 'సత్యం' రాజేష్, కామాక్షీ భాస్కర్ల, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన 'మా ఊరి పొలిమేర'కు ఓటీటీలో మంచి స్పందన లభించింది. దాంతో సీక్వెల్ తీశారు. ఈ రోజు ఆ సినిమా థియేటర్లలో విడుదలైంది.
'మా ఊరి పొలిమేర' చిత్రానికి అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. సీక్వెల్ కూడా ఆయన దర్శకత్వంలో తెరకెక్కింది. శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకంపై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ చిత్రాన్ని నిర్మించారు. 'సత్యం' రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, 'గెటప్' శ్రీనుతో పాటు రాకేందు మౌళి, సాహితి దాసరి, రవి వర్మ, 'చిత్రం' శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించారు.
Also Read : కీడా కోలా రివ్యూ : తరుణ్ భాస్కర్ క్రైమ్ కామెడీ నవ్వించిందా? లేదా?
థియేటర్లలో విడుదలైన 'మా ఊరి పొలిమేర 2' (Polimera 2 Review) సినిమాకు సోషల్ మీడియాలో ఎటువంటి స్పందన లభిస్తోంది. ఆల్రెడీ థియేటర్లలో సినిమా చూసిన జనాలు ఏమంటున్నారు? ఓసారి చూడండి.
ట్విస్టులు, నేపథ్య సంగీతం సూపర్!
'మా ఊరి పొలిమేర 2' సినిమాలో ట్విస్టులు, నేపథ్య సంగీతం సూపర్ అని కొందరు ట్వీట్స్ చేశారు. అయితే... ఆశించిన స్థాయిలో సినిమా లేదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అన్నట్టు... సీక్వెల్ కాకుండా మూడో పార్ట్ కూడా ఉంటుందని చివరలో చెప్పారని, ఓపెన్ ఎండింగ్ ఇవ్వడంతో 'పొలిమేర 2' అసంపూర్తిగా ఉందని ఒకరు ట్వీట్ చేశారు. ఆ ట్విట్టర్ రివ్యూ ఇక్కడ చూడండి.
Also Read : టైగర్ నాగేశ్వరరావు రివ్యూ : రవితేజ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడా? లేదా?