Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ లో ఒక్కో కంటెస్టెంట్ ని ఒక్కో ఎమోషన్ కి ప్రతిరూపంగా తీసుకుంటారు అన్న విషయం ఈ రియల్టి షోను చూసేవారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈసారి ఎమోషనల్ పర్సన్ గా నాగ మణికంఠను పరిచయం చేశారు. స్టేజ్ పైనే తన దీన గాథని చెప్పి మణికంఠ అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. అసలు ఎవర్రా మీరంతా అనుకుంటున్న టైంలో తన ఎమోషనల్ స్టోరీని చెప్పి కాస్త అటెన్షన్ గ్రాస్ చేశాడు. ఇక హౌస్ లోకి వెళ్ళాక కూడా ఇదే కంటిన్యూ చేశాడు. అయితే మణికంఠ చెప్పిందే చెప్పి విసుగు పుట్టించడంతో గంపగుత్తగా అందరూ కలిసి ఈ ఫస్ట్ వీక్ నామినేషన్లలో అతనికే హౌస్ లో ఉండే అర్హత లేదంటూ ఓటేశారు. అయితే ఆయన కన్నీరు మున్నీరుగా విలపించిన తీరు బుల్లితెర ప్రేక్షకుల మనసును పిండేసింది. కానీ ఈ సింపతి గేమ్ మణికంఠను ఇవి ఎలిమినేషన్స్ నుంచి కాపాడుతుందా? ఇదంతా ముందే రాసిన స్క్రిప్టా? అనే అనుమానాలు మొదలవుతున్నాయి. దీనికి కారణం బిగ్ బాస్ అనే చెప్పుకోవాలి.
బిగ్ ట్విస్ట్ రివీల్
నాలుగవ ఎపిసోడ్ లో నామినేషన్ ప్రాసెస్ పూర్తయ్యాక కన్నీరు మున్నీరుగా వినిపిస్తూ తనకున్న ఛాన్స్ ఇదొక్కటేనని, బయట తన గురించి దీనివల్ల ఎలాంటి నెగెటివ్ ప్రచారం జరుగుతోందోనని చిన్నపిల్లాడిలా గుక్కపెట్టి మరీ ఏడ్చాడు. నిఖిల్ ధైర్యం చెప్పినా వినకుండా తన విగ్ ని పీకి పారేసి బిగ్ ట్విస్ట్ ను రివీల్ చేశాడు. ఇక అర్ధరాత్రి బిగ్ బాస్ అతన్ని పిలిచి బాగానే ఉన్నావా అని కుశల ప్రశ్నలు అడిగాడు. కానీ మణికంఠ మాత్రం ఇక తన పని అయిపోయింది అన్నట్టుగా మళ్లీ ఏడవడం మొదలుపెట్టాడు. తనసలు ఈ విషయాలన్నీ బయట పెట్టాలని అనుకోలేదని, జెన్యూన్ గా మైండ్ గేమ్ ఆడాలనుకున్నానని, కానీ అందరూ పదేపదే దాన్నే ట్రిగ్గర్ చేయడం వల్ల ఇలా ఓపెన్ అయ్యానంటూ వివరణ ఇచ్చుకున్నాడు. ఒకవేళ ఇదంతా జరిగి బయటకు వెళ్తే తన పరిస్థితి ఏంటి అసలు బయట తనకు లైఫ్ ఉందా లేదా అనే విషయం తెలియట్లేదు అంటూ బిగ్ బాస్ దగ్గర మొరపెట్టుకున్నాడు.
అడ్డంగా దొరికిపోయిన బిగ్ బాస్
అయితే ఆశ్చర్యకరంగా బిగ్ బాస్ మీ పెదాలపై ఉండే చిరునవ్వే మీలో ఉన్న బలాన్ని బయటకు తెస్తుంది అంటూ ధైర్యం చెప్పాడు. పైగా మీరు దేని గురించి అయితే భయపడుతున్నారు ఆ విషయం గురించి భయపడాల్సిన అవసరం లేదు అంటూ బిగ్ బాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు కొత్త అనుమానాలకు తెరతీసాయి. మామూలుగానే బిగ్ బాస్ స్క్రిప్ట్ అంటూ విమర్శలు వినిపిస్తాయి. అయితే ఇప్పుడు మణికంఠ విషయంలో ఇది రుజువు అయ్యిందని అన్పిస్తోంది. అతనికి స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఇవ్వడమే కాకుండా, ఆ ఎమోషనల్ స్టోరీ ని సాగదీయడం, బిగ్ బాస్ మీరు భయపడుతున్నది ఏమి జరగదు అంటూ భరోసా ఇవ్వడం చూస్తుంటే ఈ వీక్ మణికంఠను బయటకు పంపే ఆలోచనలో లేరనే అనిపిస్తోంది. మొత్తానికి ఎమోషన్ తో తన ఫ్యామిలీని బిగ్ బాస్ హౌస్ లో కలిపే వరకు ఇలాగే కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. ఇక మణికంఠ గత సీజన్ల కంటెస్టెంట్స్ అయిన కౌశల్ లాగా సైలెంట్ గా ఉంటూనే, పల్లవి ప్రశాంత్ లాగా సింపతి గేమ్ ఆడుతూ చివరి వరకు నెట్టుకొచ్చే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది.