Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ అంటేనే సింపతీలు, గాసిప్స్, ఫేవరెటిజం, స్ట్రాటజీలకు పెట్టింది పేరు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈసారి బిగ్ బాస్ అన్లిమిటెడ్ అంటూ మొదటి రోజే నాగార్జున హింట్ ఇవ్వగా, గెలవడానికి ఏమైనా చేస్తాం అన్నట్టుగా ఉంది కంటెస్టెంట్స్ తీరు. దానికి తగ్గట్టుగానే ఫస్ట్ డే నుంచి హౌస్ మేట్స్ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఎవ్వరూ గొడవల్లో తగ్గేదేలే అన్న విధంగా నోరు పారేసుకుంటున్నారు. ఇప్పటిదాకా జరిగిన ఈ రెండు మూడు ఎపిసోడ్లను గమనిస్తే హౌస్ మేట్స్ అందరూ స్ట్రాటజీతోనే హౌస్ లోకి అడుగు పెట్టినట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా కిరాక్ సీత, సోనియా ఆకుల గత సీజన్లలో వాడిన స్ట్రాటజీని అచ్చు గుద్దినట్టుగా ఫాలో అవుతున్నారు. కానీ ఆ స్టేటస్ ఇప్పటిదాకా బిగ్ బాస్ చరిత్రలో అసలు వర్కౌట్ అయినట్టుగా ఎక్కడా లేదు. 


పాత స్ట్రాటజీని ఫాలో అవుతున్న సీత, సోనియా 


ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 లో అడుగుపెట్టిన ఈ 14 మంది కంటెస్టెంట్స్ గొడవ పడడానికే వచ్చామా అన్నట్టుగా ఉన్నారు. ప్రతి చిన్న విషయాన్ని అపార్థం చేసుకోవడమే కాకుండా దాన్ని మరింత ల్యాగ్ చేసి ఆర్గ్యూ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళుతున్నారు. వీళ్ళ వేషాలు మొదటి రోజు నుంచే ప్రేక్షకులను తలలు పట్టుకునేలా చేస్తున్నాయి. అనవసరమైన విషయాలను కూడా గొడవలుగా మార్చి రాద్ధాంతం చేస్తున్నారు. సరే ఏదైతే ఏముంది బిగ్ బాస్ అంటేనే ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు, స్ట్రాటజీలు అని సరిపెట్టుకుంటున్నారు. ఇక సోనియా, సీత నోటి ధాటికి తట్టుకోవడం ఎవరి తరం కావట్లేదు. గత సీజన్లలో కూడా ఇలాగే అనవసరంగా ఆవేశానికి పోయి, హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు కొంత మంది కంటెస్టెంట్స్. 


Also Read: బిగ్‌బాస్‌కి కలిసోచ్చిన లవ్‌ ట్రాక్స్‌ - ఈ ఏడు సీజన్స్‌లో హాట్‌ టాపిక్‌ అయిన జోడిలు, ఈసారి...


 


నెవర్ బిఫోర్.. మరి ఎవర్ ఆఫ్టర్?
 ఇలా ఆవేశాన్ని స్ట్రాటజీగా మార్చి ఆటలాడిన గత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అనగానే సోహైల్, అలీ వంటి వారు గుర్తొస్తారు. ఇక ఇప్పుడు దీన్నే ఆయుధంగా వాడుకుంటున్నారు సీత, సోనియా. సీత అక్కడక్కడా కనీసం వ్యాలీడ్ పాయింట్స్ లేవనెత్తుతుంది. కానీ సోనియా మాత్రం తను చెప్పిందే శాసనం అన్నట్టుగా వ్యవహరిస్తోంది. అయితే ఇలా ఆవేశపడిన కంటెస్టెంట్స్ ఒక్కరు కూడా ఇప్పటిదాకా బిగ్ బాస్ విన్నర్ కాలేదు. మరి వీళ్ళు ఇదే స్ట్రాటజీతో ఇంకెన్నాళ్లు హౌజ్ లో సర్వైవ్ అవుతారు అనేది చూడాలి. ఇదిలా ఉంటే మరోవైపు విష్ణు ప్రియ, పృథ్వీ, ఆదిత్య ఓం కనీసం హౌస్ లో ఉన్నారా లేరా అన్నట్టుగా సైలెంట్ గా చిల్ అవుతున్నారు. ముఖ్యంగా విష్ణు ప్రియ మీద చాలానే అంచనాలు ఉన్నాయి. కానీ ఆమె గత సీజన్ల విన్నర్స్ లాగా చాలా కూల్ గా వ్యవహరిస్తుంది. మరోవైపు స్ట్రాటజీలు హౌజ్ మేట్స్ కు మాత్రమే కాదు బిగ్ బాస్ కూడా ప్లే చేస్తాడు అన్నట్టుగా ఈ సీజన్లో ఏకంగా నలుగురు కన్నడ కంటెస్టెంట్స్ ను దింపారు. అలాగే వాళ్లకు ఏమాత్రం తగ్గని తెలుగు కంటెస్టెంట్స్ కూడా ఉండేలా చూసుకున్నారు. మరి సీజన్ 8లో ఈసారి ఏ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యి ఏ కంటెస్టెంట్ గెలుస్తాడో చూడాలి.


Also Read: నామినేషన్‌లో ఆ ఇద్దరినే టార్గెట్ చేసిన హౌస్‌మేట్స్, ఫస్ట్ వీక్ బయటకు వెళ్ళేది ఎవరంటే?