బిగ్‌బాస్‌ షో ఎంతగా ఆడియన్స్‌ ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సెలబ్రిటీలందరిని 100 రోజులకు పైగా ఒక్కచోట చేర్చి వారి నిజస్వరూపాలను బయటపెడుతుంది ఈ రియాలిటీ షో. ఎన్నో వివాదాలు ఎదుర్కొంటున్న ఈ షోకు అన్ని భాషల్లోనూ ప్రేక్షకాదరణ మెండుగా ఉంది. ఎన్నో ఏళ్లుగా బుల్లితెర ఆడియన్స్‌ని బాగా అలరిస్తూ వస్తున్న ఈ షో తెలుగులో ఇప్పటి వరకు ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. కంటెస్టెంట్స్‌ మధ్య గోడవలు, టాస్క్‌ గెలవాలనే తపన, ఈగోలు, వాగ్వాదాలు, లవ్ ట్రాక్‌ ఇలా ఎంతో వినోదం అందించే ఈ షోలో ముఖ్యంగా లవ్‌ ట్రాక్స్‌ బాగా ఆకట్టుకుంటాయి.


బిగ్‌బాస్‌ ఫస్ట్‌ సీజన్‌:


ఫస్ట్‌ సీజన్‌లో పెద్దగా స్టార్‌ యాక్టర్స ఉండటంతో అక్కడ పెద్దగా లవ్‌ ట్రాక్స్‌ వర్క్‌ అవుట్‌ కాలేదు. కానీ దీక్షా పంత్‌తో గ్లామర్‌ టచ్‌ ఇచ్చాడు. అలాగే నటుడు నవదీప్‌తో ఫ్లర్టింగ్‌తో కాస్తా ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించారు. అలా కంటెస్టెంట్స్‌ మధ్య అండర్‌ స్టాండింగ్‌తో ఫస్ట సీజన్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయ్యింది. 


బిగ్‌బాస్‌ 2వ సీజన్‌:


సెకండ్‌ సీజన్‌లో కౌశల్‌ మండ, దీప్తి సునయలు ఉన్న ఈ షో కూడా బాగానే అలరించింది. ఇందులో తనీష్‌-దీప్తి సునయనల మధ్య లవ్‌ ట్రాక్‌ బాగా వర్కౌట్‌ అయ్యింది. ఇద్దరు ఫ్రెండ్స్‌ అంటూనే ఒకరిపై ఒకరు ప్రేమ కురిపించుకోవడం ఆడియన్స్‌లో ఆసక్తిని పుట్టించింది.




బిగ్‌బాస్‌ 3వ సీజన్‌:


మూడో సీజన్‌లో వరుణ్‌ సందేశ్‌, వితిక షేరు, రాహుల్‌ సిప్లిగంజ్‌లు పాల్గొన్నారు. ఇందులో రాహుల్‌, పునర్నవిల మధ్య ఉండే రొమాంటిక్‌ లవ్‌స్టోరీ నడించింది. టాస్క్‌లు ఆడని రాహుల్‌ తరచూ పాటలు పాడుతూ మెప్పించేవాడు. ఇక పునర్నవి తన టాలెంట్‌ టాస్క్‌ల్లో కంటే గాసిప్స్‌ సృష్టించడంలోనే చూపించేది. ముఖ్యంగా వాళ్లని వీళ్లని విమర్శిస్తూ కాలక్షేపం చేసేది. 


బిగ్‌బాస్‌ 4వ సీజన్‌:


అన్ని సీజన్లలో నాలుగో సీజన్‌ బ్లాక్‌బస్టర్‌ అని చెప్పాలి. అరియాన గ్లోరి, సయ్యద్‌ సోహైల్‌, అభిజిత్‌, మోనాల్‌, అఖిల్‌లు పాల్గొన్న ఈ సీజన్‌లో టామ్‌ జెర్రి గొడవలు, ట్రాయాంగిల్‌ లవ్‌ స్టోరీ, గాసిప్స్‌తో సక్సెస్‌ ఫుల్‌గా సాగింది. ముఖ్యంగా అభిజిత్‌, మోనాల్‌ గజ్జర్‌, అఖిల్‌ సార్థక్‌ల ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. అలా నాలుగవ సీజన్‌ సక్సెస్‌ఫుల్‌ అయ్యింది. 




బిగ్‌బాస్‌ 5వ సీజన్‌:


అన్నింటిలో బిగ్‌బాస్‌ 5 ప్రత్యేకమని చెప్పాలి. ఇందులో ఈ సీజన్‌ ఎంత కాంట్రవర్సి అయ్యిందో తెలిసిందే. సిరీ హనుమంతు, షణ్మఖ్‌ జశ్వంత్‌ల రిలేషన్‌ హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇద్దరికి బయటకు వేరు వేరు రిలేషన్‌లో ఉన్నా హౌజ్‌లో వీరిద్దరి బాండింగ్‌ లిమిట్స్‌ దాటింది. ముద్దులు, హగ్‌లతో షణ్మఖ్‌, సిరీలు ట్రోల్స్‌ ఎదుర్కొన్నారు. బయటకు వచ్చాక కూడా వారిని నెటిజన్లు ఆటాడుకున్నారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తెలిసిందే. వీరిద్దరి హద్దులు మీరిన స్నేహం చివరికి షణ్మఖ్‌, దీప్తి సునయల మధ్య బ్రేకప్ కారణమైంది. 


బిగ్‌బాస్‌  6వ సీజన్:


ఈ సీజన్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అని చెప్పాలి. రోటిన్‌ టాస్క్‌లు, పెద్దగా గుర్తింపు లేని కంటెస్టెంట్స్‌ ఉండటంతో ఆడియన్స్‌ని ఈ సీజన్‌పై పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్‌ టాస్క్‌ల మీద కంటే కూడా వ్యక్తిగత అంశాలపైనే ఎక్కువ ఫోకస్‌ చేశారు. అలా తరచూ హోస్ట్‌ నాగార్జునతో చివాట్లు పడేవారు. కానీ, ఈ సీజన్‌లో శ్రీసత్య, అర్జున్ ల మధ్య కాస్తా లవ్‌ ట్రాక్‌ నడిచిన అది పెద్దగా వర్కౌట్‌ కాలేదు. ఆ తర్వాత వాసంతి-అర్జున్‌లు కాస్తా లైన్లోకి ఉన్నట్టు కనిపించారు. అదీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.






బిగ్‌బాస్‌ 7 సీజన్‌:


ఉల్టాపుల్టా అంటూ ఈ సీజన్‌ సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సీజన్‌లో టాస్క్‌లు, లవ్‌ ట్రాక్స్‌ కంటే గోడవలే ఎక్కువ. ముఖ్యంగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ తీరు ఆసక్తిగా ఉండేది. అంతా కలిసి అతడిని టార్గెట్‌ చేయడం, అతడు తగ్గేదేలే అంటూ ఇంకా రెచ్చిపోవడం ఆడియన్స్‌ని వినోదం అందిందించింది. అయితే మొదటి మూడు వారాలు రతిక రోజ్‌తో పల్లవి ప్రశాంత్‌ డైలామాలో పడేస్తూ అతడిని ఆడుకుంది. ఇది కాస్తా ఆసక్తిగా అనిపించేది. 



బిగ్‌బస్‌ 8 సీజన్‌:


ఈసారి సింగిల్‌ కాదంటూ జంటగా కంటెస్టెంట్స్‌ని హౌజ్‌లో దింపారు. ఏడుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలంటూ ఏడు జంటలు చేశారు. షో మొదలై మూడు రోజులు అవుతుంది. మరి ఈ సీజన్‌లో ఏ జంట మంది లవ్ పండుతుందో చూడాలి! 


Also Read: 'ఊర్వశివో రాక్షసివో' సీరియల్‌ వదిలేసి బిగ్‌బాస్‌కు - నిఖిల్‌ రెమ్యునరేషన్‌ ఎంత? కృష్ణ, ముకుందలకు..