గతవారం నామినేషన్స్ సందర్భంగా అయినా రచ్చ ఇంతా అంతా కాదు. ప్రియ , లహరి, రవిల మధ్య జరిగిన గొడవ లహరి ఓటింగ్ పైనే ప్రభావం చూపింది. ఫలితంగా లహరి ఎలిమినేట్ అయ్యింది. సింగిల్ మెన్, బాత్రూమ్ హగ్గులు అంటూ గతవారమంతా ఇంట్లో రచ్చ రచ్చ. ఈసారి కంటెంట్ ఇచ్చే పనిని లోబో తీసుకున్నాడు. నామినేషన్స్ లో ఓ రేంజ్ లో హల్ చల్ చేశాడు. ప్రియనుద్దేశించి గట్టిగట్టిగా కేకలు వేశాడు. ప్రియా మాత్రం గతవారం జరిగిన అనుభవాన్ని గుర్తు పెట్టుకుని శాంతంగా మాట్లాడేందుకు ప్రయత్నించింది. ఈసారి ప్రోమోలో ఏముందంటే...
బిగ్ మాస్ నామినేషన్స్ ప్రక్రియను మొదలుపెట్టమని చెప్పారు. సభ్యులంతా తమ ఫోటో స్టాండుల వెనుక నిల్చున్నారు. నామినేట్ చేయాలనుకునేవారు ఆ ఫోటోలోని ఓ ముక్కను తీసి నామినేట్ చేయాలి. విశ్వ ఎవరినీ నామినేట్ చేశాడో తెలియదు కానీ, వాగ్వాదం మాత్రం నటరాజ్ మాస్టర్ కు, విశ్వకు మధ్య జరిగింది. ‘ఏదైనా అవకాశం దొరికితే దానికి తగ్గట్టు ప్లానింగ్ చేసి మాట్లాడకు విశ్వ’ అని నటరాజ్ కామెంట్ చేశారు. దానికి విశ్వ ‘బయట మంచి యాక్టర్, ఇక్కడకొచ్చి మంచి యాక్టింగ్ చేస్తున్నాడని చెప్పడానికి నువ్వెవరు’ అని ప్రశ్నించాడు. బరాబర్ అంటాను, అన్నాను అంటూ గట్టిగా సమాధానమిచ్చాడు నటరాజ్. దీన్ని బట్టి విశ్వ నటరాజ్ ను నామినేట్ చేసినట్టు అర్థమవుతోంది.
ఇంట్లో చాలా సార్లు శ్వేతకు మద్దతుగా ఉంటానని శ్రీరామచంద్ర అన్నాడు. ఈసారి నామినేషన్లలో మాత్రం శ్వేతనే నామినేట్ చేసినట్టు కనిపిస్తోంది. ‘నాకు వెన్నుపోటు పొడవద్దు’ అని శ్రీరామ్ అనగానే, ‘నువ్వు అలా అనుకుంటున్నావా’ అని ప్రశ్నించింది శ్వేత. దానికి శ్రీరామ్ అవును అని సమాధానం చెప్పాడు.
లోబో లవ్ పై రచ్చ...
ఇక ఇంట్లో ఎంటర్ టైనర్ గా పేరుతెచ్చుకున్న లోబో ప్రియపై చాలా ఫైర్ అయ్యాడు. తన లవ్ గురించి చెబుతుంటే ఏదో సినిమాలా ఉందంటూ ప్రియ అన్నాదని, అది చాలా బాధించిందని చెప్పాడు లోబో. ప్రియా మాట్లాడబోతుంటే ‘నన్ను మాట్లాడనీ’ అంటూ పెద్దపెద్దగా అరిచాడు. నీ అరుపుకు నేను భయపడనని సమాధానమిచ్చింది ప్రియ. లోబో ఆ వెంటనే ఏడుపు అందుకున్నాడు. ఓదార్పుకు ఎప్పుడూ ముందుండే రవి పరిగెత్తుకుని వెళ్లి మరీ లోబోను ఓదార్చాడు. లోబో ఆకాశం వైపు చూస్తూ క్షమించమని అడిగాడు. ఈ సీజన్లో మొదటి వారం నుంచి గొడవలు, గ్రూపులు, నామినేషన్స్ లో రచ్చ మొదలైపోయాయి.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also read: జిజాంటిక్ జిలేబి... ఒక్కటే కిలో తూగుతుంది, చూస్తే నోరూరిపోవడం ఖాయం
Also read: మహానటి అందం వెనుక రహస్యాలివే... మీరూ ఫాలో అయిపోండి
Also read: కుంభకర్ణుడి విలేజ్.. రోజుల పాటూ నిద్రపోయే గ్రామస్థులు, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు