Bigg Boss Telugu Season 8: ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా.. ఎన్ని గొడవలు జరిగినా.. బిగ్ బాస్ అనే రియాలిటీ షోకు ఫుల్ స్టాప్ ఉండదని మరోసారి ప్రూవ్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే రోజు జరిగిన గొడవ వల్ల మరో సీజన్ కొనసాగేలా చేయకూడదని హేటర్స్ అన్నారు. కానీ అనూహ్యంగా ఈసారి బిగ్ బాస్ కొత్త అనుకున్న సమయానికంటే ముందే ప్రారంభమయ్యేలా కనిపిస్తోంది. కేవలం తెలుగులోనే కాదు.. ప్రతీ ఇండియన్ భాషలో బిగ్ బాస్ అనేది సూపర్ సక్సెస్‌ఫుల్ షోగా పేరు తెచ్చుకుంది. అన్ని భాషల్లో సీజన్ తర్వాత సీజన్.. రేటింగ్‌ను పెంచుకుంటూ పోతోంది. ఇక ఏడు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు తరువాతి సీజన్‌పై ఒక అప్డేట్ బయటికొచ్చింది.


స్పీడ్ పెంచిన మేకర్స్..


ప్రతీసారి బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో అనగానే బుల్లితెర సెలబ్రిటీలు, సింగర్స్, డ్యాన్సర్స్.. ఇలా అందరూ ఆ హౌజ్‌లోకి వెళ్లి 100 రోజుల జర్నీ ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తి చూపిస్తారు. ఈసారి కూడా అలా కొందరు స్మాల్ సెలబ్రిటీలతో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ముందు సీజన్స్‌తో పోలిస్తే బిగ్ బాస్ 8 మాత్రం కాస్త త్వరగా మొదలుకానున్నట్టు రూమర్స్ వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 8కు సంబంధించి కంటెస్టెంట్స్ సెలక్షన్, డిజైన్స్, ఫ్యాన్ పేజెస్‌తో పాటు ఇతర పనులు కూడా చకచకా సాగుతున్నట్టు తెలుస్తోంది. కొత్త సీజన్‌ను మరింత సరికొత్తగా తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమయ్యారు.


మళ్లీ ఆయనే..


తాజా సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ సీజన్ 8 జూన్‌లోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది. బిగ్ బాస్ 7ను ఉల్టా పుల్టా సీజన్ అంటూ నాగార్జున ప్రకటించారు. అయితే 8వ సీజన్ మాత్రం దానికంటే భారీగానే ఉంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ మొత్తంగా కాన్సెప్ట్ అయితే ఏమీ మారదని బిగ్ బాస్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇంతకు ముందు సీజన్స్ లాగానే బిగ్ బాస్ 8ను కూడా నాగార్జుననే హోస్ట్ చేయనున్నారు. ప్రతీ కొత్త సీజన్ ప్రారంభం అవ్వకముందు హోస్టులుగా ఇతర హీరోల పేర్లు వినిపించినా వారెవ్వరూ నిజంగా ఈ రియాలిటీ షోను హోస్ట్ చేయడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. నాగార్జున మాత్రమే ఈ రియాలిటీ షో కాన్సెప్ట్‌కు బాగా అలవాటు పడ్డారు కాబట్టి గత అయిదు సీజన్లుగా ఆయనే సక్సెస్‌ఫుల్ హోస్ట్‌గా కొనసాగుతున్నారు.


పాత కంటెస్టెంట్స్ కూడా..


మధ్యలో బిగ్ బాస్ ఓటీటీ అనేది కూడా ఉంటుందని వార్తలు వచ్చినా.. ఇప్పటికీ దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఒకవేళ ఓటీటీ సీజన్ అనేది ఉండుంటే ఇప్పటికే అది ప్రారంభం అయిపోయి ఉండాలి. అలా లేదు కాబట్టి బిగ్ బాస్ సీజన్ 8లో కొందరు పాత కంటెస్టెంట్స్ కూడా ఉంటారని రూమర్స్ బయటికొచ్చాయి. ఎప్పటిలాగానే బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ మాలో టెలికాస్ట్ అవుతూ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. జూన్‌లో ఈ షో ప్రారంభమవుతుంది కాబట్టి మే నుండే అప్డేట్స్ బయటికొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈసారి ఎవరెవరు కంటెస్టెంట్స్‌గా వస్తారు, వారి మధ్య గొడవలు ఎలా జరుగుతాయి అని బిగ్ బాస్ లవర్స్ ఎదురుచూస్తున్నారు.


Also Read: ఆ మూవీకి RGV ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు - ఇంకా 15 లక్షలు రావాలి: గాయత్రీ గుప్తా