Actress Gayatri Gupta Shocking Comments On Ram Gopal Varma : టాలీవుడ్ నటి గాయత్రీ గుప్తా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినిమాలతో రాని క్రేజ్ ను బోల్డ్ ఇంటర్వ్యూస్ తో సంపాదించుకుంది ఈ బ్యూటీ. షార్ట్ ఫిలిమ్స్‌తో కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత యాంకర్ గా మారి అనంతరం వెండితెరపై కొన్ని సినిమాల్లో నటించింది. అప్పట్లో బిగ్ బాస్ పై ఆరోపణలు చేసి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాని అనంతరం బోర్డ్ ఇంటర్వ్యూలు ఇస్తూ మరింత పాపులారిటీ అందుకుంది. తాజాగా గాయత్రి గుప్తా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై షాకింగ్ కామెంట్స్ చేసింది.


15 లక్షల వరకు రెమ్యునరేషన్ రావాలి.. కానీ గొడవ పడే ఓపిక లేక లైట్ తీసుకున్నా


నాకు ఇంకా రెమ్యునరేషన్ రూ.14 లక్షల నుంచి రూ.15 లక్షలు రావాల్సి ఉంది. నా దగ్గర అకౌంటబిలిటీ ఎవరూ లేరు, నేను ఎకనామికల్లీ ఎడ్యుకేటెడ్ కాదని వాళ్లకో క్లారిటీ వచ్చాక అలా చేశారు. అలా జరగకూడదు అంటే మనకు ముందు సైకాలజీ, లా, రైట్స్ ఇవన్నీ తెలియాలి. అవి తెలిస్తే ఎవరూ ఏం చేయలేరు. ఇప్పుడు ఆ డబ్బులు నేను అడగడానికి నా దగ్గర ప్రూఫ్స్ లేవు. అప్పట్లో బాండ్ ఉండేది కాదు. ప్రస్తుతం ప్రతిదీ పేపర్ వర్క్ జరుగుతోంది. కానీ అప్పుడు అలా లేదు" అని తెలిపింది 


'ఐస్ క్రీమ్' మూవీకి రెమ్యునరేషన్ ఏం ఇవ్వలేదు


'ఐస్ క్రీమ్' మూవీకి జీరో రెమ్యునరేషన్. వర్మ గారు ఏమి ఇవ్వలేదు. ఎక్స్పీరియన్స్ చాలు కదా అంతకంటే ఏం కావాలని నేను ముందే అనుకున్నాను. ఎందుకు ఇవ్వలేదని ప్రశ్న అడిగే హక్కు నాకు లేదు. ఎందుకంటే నేను ముందు తెలిసే వెళ్లాను. సినిమా తీసే ముందే రెమ్యూనరేషన్ ఏమి ఇవ్వలేకపోతామేమో అని చెప్పే సినిమా తీశారు. RGV గారితో వర్క్ చేయడమే ఎక్కువ, మళ్ళీ డబ్బులు ఎక్స్ పెక్ట్ చేయడం ఏంటని? నేనే అనుకున్నాను" అంటూ చెప్పింది.


నా ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతంటే..


‘‘RGVతో 'ఐస్ క్రీమ్ 2' సినిమా కంటే ముందే 'బందూక్' అనే ఒక సినిమా చేసాను. ఆ సినిమాని రెండు మూడు సంవత్సరాలు తీశారు. మొత్తం తిప్పి కొడితే 25,000 రెమ్యునరేషన్ ఇచ్చారు. హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే ఎలా చెప్పాలో తెలియదు కానీ 'సీతా అన్ ది రోడ్' సినిమా స్టోరీ నెరేట్ చేసినప్పుడు మా డైరెక్టర్ టెన్ డేస్ వర్క్ ఉంటుంది. 20,000 ఇవ్వగలుగుతాను అని అన్నారు. అప్పుడు నా కెరీర్ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి నేను కూడా ఓకే అన్నాను. కానీ ఆయన 20 రోజులు షూటింగ్ చేయలేదు. ఏకంగా మూడు సంవత్సరాల షూటింగ్ చేశాడు. ఆ మూడు సంవత్సరాల్లో ప్రతి షెడ్యూల్ కి 20,000 రెమ్యునరేషన్ ఇచ్చాడు. నాకు ముందు ఆఫర్ చేసిన రెమ్యునరేషన్ కంటే చాలా ఎక్కువ ఇచ్చాడు" అంటూ చెప్పుకొచ్చింది.


Also Read : రవిబాబు నన్ను నమ్మి ఆఫర్ ఇచ్చాడు, అక్కడే చెంప చెళ్లుమనిపించి వచ్చేశా - సీనియర్ నటి రక్ష
.