Bigg Boss Telugu season 8 : బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 53లో 'బీబీ రాజ్యం' అంటూ చీఫ్ కంటెండర్ టాస్క్ ను బిగ్ బాస్ పెట్టిన విషయం తెలిసిందే. తాజా ఎపిసోడ్ లో అదే కంటిన్యూ కాగా, బిగ్ బాస్ "అత్యంత బలమైన సేనాన్ని కూడా ఆకలి మట్టు పెడుతుంది. ప్రతి రాజ్యానికి ఆహార భద్రత అత్యంత ముఖ్యమైనది అలాంటి ఆహారాన్ని ఇచ్చే వ్యవసాయాన్ని పొందడానికి బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ పట్టుకో కార్డ్స్ లో పెట్టుకో. ఈ టాస్క్ లో గెలవడానికి 8 ధాన్యపు బస్తాలను కార్ట్ లో చేర్చుకోవాలి. తమకు చెందిన 8 ధాన్యపు బస్తాలను రెడ్లైన్ వెనక ఉన్న కార్ట్ లోకి ఎవరు ముందుగా చేరుస్తారో వాళ్లే గెలవడంతో పాటు వ్యవసాయాన్ని పొంది, మీ ప్లాన్ జెండాను పాతొచ్చు' అని చెప్పారు. ఈ టాస్క్ లో ఓజి నుంచి నిఖిల్, పృథ్వి.. రాయల్స్ నుంచి మెహబూబ్, గౌతమ్ పాల్గొన్నారు. యష్మి గౌడను సంచాలక్ గా నియమించారు. టాస్క్ ఫిజికల్ కాగా, నలుగురు శక్తివంతులే కావడంతో ఉత్కంఠభరితంగా సాగింది.
అయితే ఇంత కష్టపడి ఆడినప్పటికీ బిగ్ బాస్ బిగ్ షాక్ ఇచ్చారు. హౌస్ మేట్స్ ఫిజికల్ కావడంతో గేమ్ నీ పాజ్ చేసి, కావాలనుకుంటే కంటెస్టెంట్స్ ని మార్చుకోవచ్చు అని సలహా ఇచ్చారు. అయితే రాయల్స్ టీమ్ నుంచి అవినాష్, తేజ గేమ్ ఆడడానికి ముందుకు వచ్చారు. ఓజీ నుంచి మాత్రం నిఖిల్, పృథ్వీ కంటిన్యూ అయ్యారు. మొత్తానికి డూ ఆర్ డై అన్నట్టుగా గేమ్ ఆడి ఎట్టకేలకు ఓజీ క్లాన్ ఈ టాస్క్ విన్ అయింది. దీంతో ఓజి నుంచి కంటెండర్ గా పృథ్వీని నిలబెట్టారు. అలాగే రాయల్స్ క్లాస్ నుంచి గంగవ్వను తప్పించారు.
అయితే ఈ క్రమంలో ప్రేరణను అడగకుండానే పృథ్వీని కంటెండర్ గా ఫిక్స్ చేస్తున్నట్టు చెప్పి, ఆ తర్వాత తాను ఆ మాట అనలేదని ఫ్లిప్ అయ్యింది యష్మి. దీంతో ప్రేరణ, యష్మి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. నిఖిల్ క్లియర్ చేసే ప్రయత్నం చేసినా వాళ్ళిద్దరూ వినకుండా నెక్స్ట్ డే వంట దగ్గర కూడా ఇదే కంటిన్యూ చేశారు. ఇక నిఖిల్ "ఇన్ఫినిటీ సీజన్ మనది, ఎవరైనా సరే కప్ విన్ అవ్వాలి అంటే అది మన క్లాన్ వాళ్ళే కావాలి' అంటూ మోటివేషనల్ స్పీచ్ ఇచ్చాడు. వచ్చినప్పటి నుంచి మేమే టాస్కులు విన్ అవుతున్నాము అంటున్నరాయల్స్ క్లాన్ పొగరును తగ్గించాలనీ నబిల్, ప్రేరణ మాట్లాడుకున్నారు. హరితేజ తన కూతుర్ని తలుచుకుని ఎమోషనల్ కాగా, నబిల్ తనను చాక్లెట్స్ త్యాగం చేయమన్నారని, అయితే కళ్ళముందే లడ్డులు, చాక్లెట్స్ ఉండడంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ బిగ్ బాస్ దగ్గర వాపోయారు. అంతేకాకుండా తను త్యాగం చేసినందుకు మెహబూబ్, మణికంఠ తప్ప ఒక్కరు కూడా థాంక్స్ చెప్పలేదని ప్రేరణ దగ్గర చెప్పుకొచ్చాడు.
ఆ తరువాత సైన్యం, హాస్పిటల్ ని పొందడానికి "వైరల్ ఎటాక్" టాస్క్ పెట్టారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో గెలవడానికి అవతలి వారికి సంబంధించిన వైరస్ జోన్లోకి వీలైనన్ని ఎక్కువ వైరస్ లని విసరాలి. అలాగే మీ జోన్లోకి వీలైనన్ని తక్కువ వైరస్ లు వచ్చేలా చూసుకోవాలి. చివరికి ఎవరి వైపైతే తక్కువ వైరస్ లు ఉంటే వాళ్ళు విజేతలుగా నిలిచి, సైన్యాన్ని హాస్పిటల్ ని పొందుతారు" అని చెప్పారు. ఈ టాస్క్ లో ఓజి క్లాన్ నుచి తేజ, గౌతమ్, ఓజీ నుంచి నిఖిల్, నబిల్ ఇద్దరూ వచ్చారు. రోహిణి సంచాలక్. ఈ టాస్క్ లో కూడా ఓజి క్లాన్ సభ్యులు విన్ అయ్యారు. మొత్తానికి ఈ రోజూ ఎపిసోడ్ లో నిఖిల్ ఒక్కడే వెయ్యేనుగుల బలం చూపించి బాహుబలిలా ఆశ్చర్యపరిచాడు. దీంతో నిఖిల్ కష్టాన్ని గుర్తించి అతనికే కంటెండర్ ఛాన్స్ త్యాగం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు నబిల్. కాగా ఓజీ టీమ్ నిఖిల్ ను కంటెండర్ గా సెలెక్ట్ చేస్తే, రాయల్స్ గౌతమ్ ని తప్పించారు. అయితే ఈ టాస్క్ లో గౌతమ్ సరిగ్గా ఆడలేదని రాయల్స్ క్లాన్ సభ్యులు కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగ విబేధాల కారణంగా రాయల్స్ క్లాన్ లో రెండు గ్రూప్ లో విడిపోయారు. ఆ తరువాత 'నాకు ఎవరో తినిపిస్తా' అన్నారు అంటూ యష్మి గౌడ రావడంతో ఆమెను, గౌతమ్ ను టీజ్ చేశారు హౌస్ మేట్స్.