బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎపిసోడ్ 41 ఈరోజు స్ట్రీమింగ్ అయ్యింది. ఇక గత రెండు రోజుల నుంచి నడుస్తున్న బిబి హోటల్ టాస్క్ నిన్నటితో ఎండ్ కాగా, ఈ టాస్క్ లో రాయల్ క్లాన్ టీం విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఎపిసోడ్ 41లో మెగా చీఫ్ టాస్క్ లను పెట్టారు బిగ్ బాస్. మరి ఈ ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూసేద్దాం పదండి. 


కంటెస్టెంట్స్ మధ్య గొడవలు 


ఎపిసోడ్ మొదట్లోనే నబిల్, ప్రేరణ మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. పదేపదే అదే గొడవను తీస్తూ ప్రేరణ నువ్వు ఇమ్మెచ్యూర్ గా బిహేవ్ చేస్తున్నావు అనడంతో నబిల్ ఫైర్ అయ్యాడు. ఇక ఇదే విషయాన్ని అందరితో చెబుతూ నబిల్ వ్యవహరిస్తున్న తీరును పృథ్వి దగ్గర చెప్పి అతను ఇమ్మెచ్యూర్ గా బిహేవ్ చేస్తున్నాడు అంటూ వాపోయింది ప్రేరణ. మరోవైపు విష్ణు ప్రియ, రోహిణి మధ్య విభేదాలు మొదలయ్యాయి. పృథ్వీ గురించి ఇద్దరి మధ్య డిస్కషన్ రాగా, రోహిణి 'ఇద్దరి మధ్య ఉన్నది చెప్పాను' అంటూ తనను తాను సమర్థించుకుంది. పైగా 'కామెడీగా నేను అన్నది ఏదైనా హర్ట్ చేసి ఉంటే సారీ' అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత టాస్క్ లో విష్ణు ప్రియ తనను కావాలని టార్గెట్ చేస్తున్నట్టుగా ఫీల్ అయింది రోహిణి. అంతేకాకుండా చీఫ్ కంటెండర్ టాస్క్ లో నబిల్ జడ్జ్మెంట్ ని పృథ్వీ, హరిప్రియ తప్పు పట్టారు.


మెగా చీఫ్ పదవి రాయల్ క్లాన్ కి...  


ఇక బిబి హోటల్ టాస్క్ లో రెండు స్టార్స్ వచ్చిన మణికంఠ, నబిల్ లలో ఒకరిని చీఫ్ కంటెండర్  గా ఎన్నుకోమని బిగ్ బాస్ చెప్పగా, మణికంఠను సెలెక్ట్ చేశారు ఓజీ టీం. మరోవైపు రాయల్స్ క్లాన్ నుంచి చీఫ్ కంటెండర్ గా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన హరితేజ, రోహిణి, పావని నయని, మెహబూబ్, గౌతమ్, అవినాష్ లను పెట్టారు. మెగా చీఫ్ మొదటి లెవెల్ టాస్క్ లో 'ఎక్కువుంటే మీకే ముప్పు' అనే టాస్క్ పెట్టారు. అందులో వెల్ క్రో జాకెట్ ధరించి, దానిమీద తక్కువ బాల్స్ ఉండేలా చూసుకోవాలని మెగా చీఫ్ కంటెండర్స్ కు, మిగతా హౌస్ మేట్స్ వాళ్లపై బాల్స్ విసరాలని ఆదేశించారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో గౌతం అవుట్ అయ్యాడు. రెండవ రౌండ్ టాస్క్ లో బాల్స్ వేసేవారు బాక్స్ లో ఉండాలని, చీఫ్ కంటెండర్ గా బరిలో ఉన్నవారు గార్డెన్ ఏరియాలో  పరుగులు పెడుతూ ఆ బాల్స్ నుంచి తప్పించుకోవాలని ఆదేశించారు. ఈ రౌండ్లో నయని అవుట్ అయ్యి, ఇలా ఇంత త్వరగా తనను అవుట్ చేస్తారని తాను ఊహించలేదంటూ ఎమోషనల్ అయ్యింది. ఇక చివరి రౌండ్లో అవినాష్, రోహిణి ఇద్దరికీ ఎయిట్ బాల్స్ అతుక్కోగా, అందులో సంచాలక్ గా వ్యవహరించిన టేస్టీ తేజ రోహిణిని అవుట్ చేశాడు. ఇక చివరికి మెహబూబ్, హరితేజ, మణికంఠ, అవినాష్ మెగా చీఫ్ కంటెండర్స్ గా నిలిచారు. 


Read Also : Balakrishna: బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్... NBK109 టైటిల్ టీజర్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన నిర్మాత


కింద పడితే ముందుకెళ్లలేవు


ఆ తర్వాత 'కింద పడితే ముందుకెళ్లలేవు' అంటూ థర్డ్ లెవెల్ టాస్క్ పెట్టారు. నబిల్ ఇందులో సంచాలక్ గా వ్యవహరించగా, టేబుల్ మీద ఉన్న వస్తువులను బిగ్ బాస్ చెప్పినట్టుగా ఒకదానిపై ఒకటి పేర్చాల్సి ఉంటుంది. అలాగే అవి పడుకోకుండా చూసుకోవాలి. అయితే ఈ టాస్క్ లో లేకలేక వచ్చిన ఛాన్స్ ని మణికంఠ చేర్చుకున్నాడు. చివరికి హరితేజ మెహబూబ్ ఇద్దరూ మిగలగా, మహబూబ్ ను విన్నర్ గా ప్రకటించాడు నబిల్.ఆ తర్వాత 'దమ్ముంటే స్కాన్ చెయ్' టాస్క్ లో థండర్ వీల్స్ బైక్ ను గెలుచుకుంటారని బిగ్ బాస్ ప్రకటించగా, ఇరు క్లాన్స్ నుంచి నయని పావని, విష్ణు ప్రియ టాస్క్ లో పాల్గొన్నారు. ఇందులో నయని పావని విన్ అయ్యి బైక్ ను గెలుచుకుంది.