Bigg Boss Telugu 9 - Day 8 Episode 9 Review: కింగ్ నాగ్ సండే ఎపిసోడ్ పూర్తయిన తర్వాత మళ్లీ హౌస్‌లో ఫుడ్ గురించి ఇష్యూ నడిచింది. కెప్టెన్ సంజన ముందుకు వచ్చి.. ఇకపై కిచెన్ నుంచి ఎక్స్‌ట్రా ఫుడ్ టెనెంట్స్‌కు ఇస్తుంటే నా అప్రూవల్ తీసుకోండి. నేను, ప్రియతో డిస్కస్ చేసి ఓ డెసిషన్ తీసుకుంటానని చెప్పింది. ఇదే విషయంపై కాసేపు సంజన, మనీష్‌లతో శ్రీజ వాదించింది. హౌస్‌లో ఏదైనా ఫుడ్ దొంగతనం జరిగితే.. ఫుడ్ మానిటర్‌గా ఉన్న నువ్వు వంద శాతం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా? అని ప్రియాను సంజన ప్రశ్నించింది. అసలు నాకేం చేయాలో అర్థం కావడం లేదని ప్రియా అంటే.. మనీష్‌కు నీ రోల్ ఇచ్చేసేయ్ అంటూ శ్రీజ కామెంట్ చేసింది.
నాకు ఈ హౌస్‌లో ఉండాలని లేదు అంటూ మనీష్ ఎమోషనల్ అవుతుంటే.. ఇమ్మానుయెల్ ఓదార్చారు. ఈ ఇడియట్స్ మధ్య నేను ఉండలేను. ఏందన్నా అసలు.. ఇంత చిల్లర పంచాయితీలు పెడుతున్నారు. అసలు రెస్పెక్ట్ లేదు. వాళ్లకి కెమెరా వస్తే.. అరవాలి అంతే. నేను అరవలేకనా? కామనర్స్‌కి వీళ్లొక గలీజ్ మార్క్. వరస్ట్ కామనర్స్. ఇది జెన్యునూటి కాదు అంటూ తనని ఓదార్చుతున్న ఇమ్ముకి చెప్పాడు.
Also Read: బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ల రెమ్యూనిరేషన్ లిస్ట్... భరణి టాప్, కామనర్స్‌కి ఎంత ఇస్తున్నారో తెలుసా?
అదే సమయంలో హరీష్ దిగులుగా ఉండడం చూసి బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్‌కి పిలిచారు. ఎందుకలా ఉన్నారని అడగగా.. హరీష్ నాకు ఇక్కడ ఉండాలని లేదు.. కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామని వచ్చాను. కానీ బయట ఎలా ఉందో? ఇక్కడ కూడా అలాగే ఉంది బిగ్ బాస్. తనూజ, భరణి, ఇమ్ముతో నాకు ఇష్యూస్ ఉన్నాయి. నేను చాలా ఎమోషనల్ పర్సన్, చాలా స్ట్రాంగ్. సంజన చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. నాపై రాంగ్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళ ముఖాలు చూడాలని లేదంటూ బాధపడ్డాడు. తర్వాత హరీష్‌కు బిగ్ బాస్ ధైర్యం చెప్పి రాముని కన్ఫెషన్ రూమ్‌కు పిలిచారు. హరీష్‌ని బాగా చూసుకోండి .. తన భాద్యత మీదే అని చెబుతారు. అలాగే అని చెప్పాడు రాము. తర్వాత రాము, హరీష్ డిస్కషన్ చేశారు. శ్రీజ భోజనం తీసుకువచ్చినా.. నాకు వద్దు.. మీలాంటి వాళ్ళ మధ్య ఉండదల్చుకోలేదని అంటాడు. హరీష్‌తో భోజనం చేయించడానికి రాము ట్రై చేశాడు.
ఆ రోజు రాత్రికి మళ్లీ సంజన తన పనితనం ప్రదర్శించింది. కొన్ని ఆరంజ్‌లు దొంగిలించింది. దీనిపై కాసేపు డిస్కషన్ నడిచింది. ప్రియా అందరి గదుల్లో వెతికి, చివరికి కిచెన్‌లో ఉన్న బాక్సులో వాటిని గమనించింది. ఎవరు తీసి, అక్కడ పెట్టారనే దానిపై పెద్ద వాగ్వాదమే నడిచింది. ఆ తర్వాత అందరూ ఒక చోటకు చేరి, మాట్లాడుకుంటున్నారు. సంజన కెప్టెన్‌గా ఒక మాట చెప్తున్నా ఎవరికైనా ఇబ్బంది ఉంటే చెప్పండని అడిగింది. సుమన్ శెట్టి నాకు క్లీనింగ్ పని వద్దు.. ఇది ఎవరికైనా ఇవ్వండి. నేను కిచెన్‌లో అసిస్టెంట్‌గా ఉంటానని అన్నాడు. ఇంకా కొంతమంది డ్యూటీని ఆమె ఛేంజ్ చేశారు. ఆ తర్వాత రీతూ, పవన్, ఇమ్ముల మధ్య కామెడీ నడిచింది. తనూజా.. నా నడుం గిల్లకు అంటూ ఇమ్ము చేసిన కామెడీ కాసేపు సరదాగా అనిపించింది.
Also Read: బిగ్ బాస్ ఎపిసోడ్ 6 రివ్యూ... డ్రింక్ చుట్టూ తిరిగిన కథ, నవ్వు రాని టాస్క్... బోరింగ్ ఎపిసోడ్
అనంతరం రెండవ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ప్రతి ఇంటి సభ్యుడు ఇద్దరిని నామినేట్ చేసి, అందుకు తగిన కారణాలు చెప్పి, వారి ఫేస్‌కు రెడ్ పెయింట్ పూయాలని బిగ్ బాస్ చెప్పారు. కెప్టెన్ సంజనని నామినేట్ చేసే ఛాన్స్ లేదని చెప్పారు. మొదటగా తనూజ వచ్చి హరిత హరీష్‌ని నామినేట్ చేసి, నాకు లాస్ట్ వీక్‌లో హరీష్ బిహేవియర్ నచ్చలేదు. మీరు అలా చేయవద్దు, ఇలా చేయవద్దు అని చెప్పిన బిహేవియర్ నచ్చలేదు.. అందుకే నామినేట్ చేస్తున్నాను అని అంటుంది. దానికి హరీష్ వివరణ ఇచ్చాడు. వారిద్దరి మధ్య చాలా సీరియస్‌గా డిస్కషన్ నడిచింది. నా రెండవ నామినేషన్ ఫ్లోరా శైనీ.. ఎందుకంటే ఏదైనా ఉంటే కలిసి మాట్లాడుకోవాలి అంతే కానీ షాంపూలు, లోషన్లు అన్ని మిక్స్ చేయడమనేది నాకు నచ్చలేదు.. అందుకే నామినేట్ చేస్తున్నాను. ఫ్లోరా తన వాదనకు క్లారిటీ ఇచ్చింది.
తర్వాత మనీష్ వచ్చి భరణిని నామినేట్ చేశాడు. మీరు ప్రతి విషయాన్నీ అప్పటికి వదిలేసి.. తర్వాత అందరి ముందు దానిని మళ్ళీ ఎత్తి చూపిస్తున్నారు. అది నచ్చలేదు. అందుకే నామినేట్ చేస్తున్నానని చెప్పాడు. మనీష్ చేసిన ఆరోపణలకు భరణి వివరణ ఇచ్చాడు. రెండో పర్సన్‌గా రీతూ చౌదరిని నామినేట్ చేశాడు మనీష్. తనని ఉద్దేశించి మీరు సరిగ్గా పాత్రలు క్లీన్ చేయడం లేదు.. పర్మిషన్ లేకుండా ఓనర్స్ ఇంట్లోకి వస్తున్నారు.. అందుకే నామినేట్ చేస్తున్న అంటూ రీతూని నామినేషన్ చేశాడు. దీనికి రీతూ సీరియస్‌గా తన వాదనను వినిపించింది. రాంగ్‌గా నామినేట్ చేసినట్లుగా మనీష్‌పై డిఫెండ్ చేసింది. ఇంకా ఎవరెవరు నామినేట్ అవుతారనేది నెక్ట్స్ ఎపిసోడ్‌లో తెలుస్తుంది. నామినేషన్ ప్రక్రియ మాత్రం రచ్చరచ్చగా జరుగుతోంది.
Also Read- మొదటి వికెట్‌గా శ్రష్టి వర్మ అవుట్... వెళ్తూ వెళ్తూ ముగ్గురుకి షాక్... భరణికి బంపరాఫర్!