Bigg Boss Telugu 9 Day 5 Sep 15 Latest Promo : బిగ్‌బాస్‌లో తన సొంత నిర్ణయంతో.. తన ఆలోచనలతో.. ఎవరి మాట వినకుండా వెళ్లిపోతున్న హరీశ్ నిరాహారదీక్ష చేస్తున్నాడు. మనీష్ కూడా ఏడ్చేశాడు. అయితే సోమవారం అసలు నామినేషన్ ఊసు ఎత్తకుండా ప్రోమోను కట్ చేశారు. అంటే ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్లో ఉండకపోవచ్చు. లేదా స్టార్ట్ అవ్వొచ్చు. ఎందుకంటే ఇప్పటికే లైవ్‌లో నామినేషన్స్ పూర్తి అయిపోయాయి. కానీ ఎక్కడా ప్రోమోల్లో నామినేషన్ ప్రస్తావనే తీసుకురాలేదు. ఉదయం ఇమ్మూ ఎంటర్టైన్మెంట్తో ప్రోమో కట్ చేసి.. ఇప్పుడు కామనర్స్‌పై ప్రోమోను రిలీజ్ చేశారు.
ప్రోమోలో ఏముందంటే..
సంజన కెప్టెన్.. ఆమె మాటను అందరూ వినాలని నాగార్జున చెప్పినా.. కామనర్స్ మాత్రం దానికి విరుద్ధంగానే చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీజ, ప్రియ సంజన చెప్తోన్న మాటలకు అడ్డు చెప్తున్నారు. ఫుడ్ విషయంలో సంజన ఒకటి చెప్తే.. ప్రియ దాని గురించి ఆర్గ్యూ చేసింది. దానికి శ్రీజ కూడా వత్తాసు పలికింది. వాళ్లు ఫుడ్ తీసుకుపోతుంటే మేము దొంగతనం చేయకుండా ఖాళీగా కూర్చోవాలా అంటూ అడిగింది. ఈ సమయంలో మనీష్‌తో కూడా ప్రియ, శ్రీజ వాగ్వాదానికి దిగారు. నన్ను టార్గెట్ చేస్తున్నామంటూ పక్కకెళ్లి ఏడుస్తావంటూ శ్రీజ.. మనీష్‌ని ఉద్దేశించి మాట్లాడింది.
ఏడ్చేసిన మనీష్
ప్రియ, శ్రీజతో ముందు నుంచి మనీష్‌కి పడట్లేదు. అయితే ఆదివారం ఎపిసోడ్ తర్వాత వారి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో మనీష్ ఏడ్చేశాడు. అతని దగ్గరికి ఇమ్మూ వెళ్లగా అతనితో కామనర్స్ వేస్ట్.. వరస్ట్ అంటూ చెప్పుకుని ఏడ్చేశాడు. సెల్ఫిష్, రూత్‌లెస్ ఇడియట్స్ ఈ కామనర్స్ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
నిరాహార దీక్ష చేస్తోన్న హరీశ్
శనివారం, ఆదివారం ఎపిసోడ్ తర్వాత మాస్క్ మ్యాన్ ఫేస్ వాడిపోయింది. అప్పటి నుంచి హోజ్లో కలవట్లేదు. ఎవరితో మాట్లాడట్లేదు. సెలబ్రెటీలు వచ్చినా సరే కనీసం నవ్వకుండా సీరియస్‌గా ఉన్నాడు. అయితే హరీశ్ రెండ్రోజుల నుంచి భోజనం చేయట్లేదంటూ శ్రీజ ఫుడ్ తీసుకువస్తుంది. దాంతో ఆమెకు నేను తినను.. నీళ్లు కూడా తాగను.. మీలాంటి వాళ్లతో నేను కలిసి ఉండలేను. అయితే లైవ్‌లో హరీశ్‌ని బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి మాట్లాడినట్లు తెలుస్తుంది. అలాగే భరణి సంజన దగ్గర తనను మరింత బ్యాడ్ చేస్తున్నాడంటూ చెప్పడం ప్రోమోలో చూపించారు. దీంతో ప్రోమో ముగిసింది.
నామినేషన్స్ ప్రక్రియ
లైవ్‌లో నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. ఈ వారం ఆరుగురు కంటెస్టెంట్లు డేంజర్ జోన్లో ఉన్నారు. దాదాపు అందరూ ఫ్లోరా షైనీని టార్గెట్ చేశారు. పవన్ మరోసారి నామినేషన్స్‌లోకి రాగా.. భరణి, మాస్క్ మ్యాన్ హరీశ్, మనీష్, ప్రియా కూడా ఉన్నారు. ఇది రేపు రివిల్ చేయవచ్చు.