Bigg Boss Monday Nominations Promo : బిగ్​బాస్ సీజన్ 9 తెలుగు డే 50 నామినేషన్స్ రసవత్తరంగా జరుగుతున్నాయి. అయితే ఇంట్లోకి వచ్చిన ఎక్స్-కంటెస్టెంట్​లు నేరుగా నామినేట్ చేస్తూ.. ఒకరిని ఎంచుకుని వారితో నామినేషన్స్ చేయిస్తున్నారు. దాదాపు ఇంట్లోకి వచ్చిన వారు.. ఇంట్లో ఉన్నవారు ఈ వారం ఓ ముగ్గురిని టార్గెట్ చేశారు. రీతూ, తనూజ, కళ్యాణ్ టార్గెట్ అయినట్లు కనిపిస్తుంది. దాదాపు అందరూ వీరినే అంటున్నారు. అయితే తనూజ పేరు చెప్పి కళ్యాణ్​ని ఎక్కువమంది టార్గెట్ చేశారు. తనూజ సేఫ్​గా అవుతున్నట్లు కనిపిస్తుంది. మరి ప్రోమోలో ఏమి చూపించారు? హైలెట్స్ ఏంటో చూసేద్దాం. 

Continues below advertisement


బిగ్​బాస్​ నామినేషన్స్ ప్రోమో రివ్యూ


ఒక ఫేక్ లవ్ స్టోరితో లోపలికి వచ్చావు అంటూ రీతూని ఫ్లోరా నామినేట్ చేసింది. అలాగే ముందు కళ్యాణ్​కి దగ్గరగా ఉండి.. ఇప్పుడు పవన్​తో ఉంటున్నావు అని డైరక్ట్​గా చెప్పేసింది ఫ్లోరా. చాలా ఫేక్​గా కనిపిస్తున్నారంటూ చెప్పింది. మీరు అలా ఫీల్ అయ్యారంటూ రిప్లై ఇవ్వగా.. అయేషా వెళ్లిపోతున్నప్పుడు నువ్వు నవ్వావు. నీకు ఎమోషన్స్​ లేవంటూ కొన్ని కారణాలు చెప్పింది. తర్వాత ఫ్లోరా సుమన్ శెట్టికి నామినేషన్స్ పవర్ ఇవ్వగా.. ఆయన సంజనను నామినేట్ చేశాడు. సారీ చెప్పానుగా అన్న అంటే.. నువ్వు కెప్టెన్​గా ఉన్నప్పుడు మీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చాము. తొక్కలో కెప్టెన్ అని మీరు అన్నారు.. అది చెరిగిపోద్దా అంటూ గట్టిగా పొడుస్తూ నామినేట్ చేశాడు. 



అమ్మాయిల పిచ్చోడు కళ్యాణ్


హోజ్​లో ఉన్నంత వరకు కళ్యాణ్​కి సపోర్ట్ చేసిన శ్రీజ.. ఈసారి ఇంట్లోకి వచ్చి కళ్యాణ్​నే నామినేట్ చేసింది. నువ్వు అమ్మాయిల పిచ్చోడివా అని అడగ్గా లేదు అని చెప్తే.. మరెందుకు నువ్వు డిఫెండ్ చేసుకోలేదు అని అడిగింది. లైట్ ఎందుకు తీసుకున్నావు కళ్యాణ్ అని చెప్పిందని వదిలేశాను అంటాడు. నీ క్యారెక్టర్ డీగ్రేడ్ చేస్తుంటే పర్లేదు సారీ చెప్పేసింది కదా అని వదిలేస్తావా అంటూ ప్రశ్నించింది. అండ్ తనూజని నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదు అని అడిగింది. సేమ్ రీజన్స్​తో ఇంకొకరు ఆమెను నామినేట్ చేశారు. అవి కాపీక్యాట్​లాగా చెప్పాలని అనిపించలేదు అంటూ కళ్యాణ్ రిప్లై ఇచ్చాడు. నువ్వు నెగిటివ్ అవుతావనే ఉద్దేశంతోనే నామినేట్ చేయలేదంటూ శ్రీజ చెప్పింది. 


రీతూ-దివ్వెల మాధురి గొడవ.. గట్టిగానే అయిందిగా



శ్రీజ మాధురిపై రివేంజ్ ప్లాన్ చేసింది. నామినేషన్స్ చేయించడానికి మాధురికి ఇచ్చింది. బాండ్స్ అన్నారుగా.. ఇప్పుడు మీ బాండ్స్​తో ఎవరికి నామినేట్ చేస్తారో చూస్తాను అంటూ ఇస్తుంది. మాధురి పొగరుగా చూస్తూ కత్తి తీసుకుని.. రీతూని నామినేట్ చేస్తుంది. టీమ్​లో అందరూ కూడా చెప్పారు. డోంట్ ట్రస్ట్ రీతూ అని.. పవన్​నే కంటెండర్ చేయాలనుకున్నావంటూ అడుగుతుంది. నేను కంటెండర్ అయినా తర్వాత నా డబ్బులు నేను ఎవరికైనా ఇస్తాను అంటూ రీతూ గట్టి రిప్లై ఇస్తుంది.


పవన్​ని సపోర్ట్ చేయడానికి వచ్చావా? గేమ్ ఆడడానికి వచ్చావా అంటూ సీరియస్​గా అడుగుతుంది. మీకు తనూజకి బాండ్​లేదా? మీరు ఆమెకు సపోర్ట్ చేయడానికి వచ్చారా? ఈ ఇంటిలో అందరికీ బాండ్ ఉంది.. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ రీతూ సీరియస్ అవుతుంది. అందరివి హెల్తీ బాండ్స్ మీది అన్​ హెల్తీ బాండ్స్ అంటూ సీరియస్ అయింది మాధురి. ఎపిసోడ్​లో మరెన్ని వినాల్సి వస్తుందో.. వేచి చూడాల్సిందే.