Bigg Boss Alekya Chitti Pickles Ramya Promo : కాంట్రవర్సీ పాప అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యకు బిగ్​బాస్ ఫిదా అయ్యాడు అనుకుంటా. నిన్న ఒక ప్రోమో ఆమె గురించి వేసిన బిగ్​బాస్ ఈరోజు ఆమె చుట్టూ రెండో ప్రోమోలు వేశాడు. రమ్యకు వచ్చిన ఫుడ్ చూసి కంటెస్టెంట్లు అల్లాడిపోతున్నారు. దానికి సంబంధించిన ప్రోమోలు స్టార్ మా విడుదల చేసింది. బిగ్​బాస్ సీజన్ 9 తెలుగులో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాత బజ్​ అంతా దివ్వెల మాధురి, అలేఖ్య చిట్టి పికెల్స్ రమ్య చుట్టూనే తిరుగుతుంది. దాంతో బిగ్​బాస్​ కూడా వారినే హైలెట్ చేస్తూ ప్రోమోలు విడుదల చేస్తున్నాడు. ఈరోజు ఉదయం దివ్వెల మాధురిని హైలెట్ చేసే ప్రోమో రాగా.. ఇప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యకు చెందిన రెండు ప్రోమోలు వచ్చాయి. 

Continues below advertisement


అలేఖ్య చిట్టి పికిల్స్​ రమ్యకి రెండు ప్రోమోలు 



అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య నిన్న ఇచ్చిన ఫుడ్ లిస్ట్​కి బిగ్​బాస్​కి కూడా దిమ్మ తిరిగి ఉంటుంది. కానీ నాగ్​మామ ఇచ్చిన మాట కాదనలేక బిగ్​బాస్ ఆమె అడిగిన ఫుడ్ అంతా పంపించాడు. ఆమె ఆ ఫుడ్​ని సుమన్ శెట్టితో కలిసి షేర్ చేసుకుంది. అయితే రమ్యకి వచ్చిన ఫుడ్ చూసి ముందు వెళ్లిన కంటెస్టెంట్లు అల్లాడిపోతున్నారు. తమకి ఫుడ్ పంపమని.. కనీసం చికెన్ పంపమని అడుగుతున్నారు. అయితే ఈ ప్రోమోలో అలేఖ్యకు సంజన తినిపిస్తూ కనిపించింది. బిగ్​బాస్ నన్ను కూడా కొడుకు అనుకుని చికెన్ పంపండి అంటూ ఇమ్మూ కామెడీ చేశాడు. ఇలా ఈరోజు అలేఖ్యకు సంబంధించి ఒక ప్రోమోలో వచ్చిన కంటెంట్ ఇది. 


అపరిచితుడి ప్రోమోలో రెండో ప్రోమో.. 



అలేఖ్య చిట్టికి సంబంధించి ఈరోజు రెండో ప్రోమో వచ్చింది. దీనిలో ఇమ్మూ అపరిచితుడు స్కిట్ వేశాడు. రమ్య హీరోయిన్. ఆమెను ఇంప్రెస్ చేస్తూ ఆమెకోసం డ్రాయింగ్ వేశాడు ఇమ్మూ. ఆ ఫోటో చూసి ఏంటిది అని రమ్య అడిగితే.. నువ్వే నీకోసం రెండు జడలు, రెండు కండలు కూడా వేశాను అంటే కామెడీ చేశాడు. ఆమెను ఇంప్రెస్​ చేసేందుకు ఫన్ స్కిట్ చేశారు. అయేషా కూడా రమ్యను ప్రోమించమంటూ అడుగుతుంది. ఇలా రెండో ప్రోమో సాగింది. అయితే వీటిని చూసిన నెటిజన్లు అలేఖ్య చిట్టిపై బిగ్​బాస్ మనసు పారేసుకున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.