Bigg Boss Telugu 9 - Day 27 Promo 2: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 డే 27కు సంబంధించి రెండవ ప్రోమో విడుదలైంది. దీనికి ‘వీకెండ్ ఫైర్’ అనే ట్యాగ్‌లైన్‌ను జత చేశారు. అంటే, హోస్ట్ కింగ్ నాగార్జున ఈ వారం హౌస్‌మేట్స్ ఆటతీరుపై సీరియస్‌గా దృష్టి పెట్టనున్నారని ఈ ట్యాగ్‌లైన్ స్పష్టం చేస్తోంది. ఈ ప్రోమోలో, నాగార్జున కంటెస్టెంట్లను సూటి ప్రశ్నలతో ఇరుకున పెడుతూ, వారం రోజులుగా హౌస్‌లో జరిగిన ముఖ్య సంఘటనలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు వచ్చిన ప్రోమోలో ‘గొడవలు బాగా ముదిరిపోయాయ్.. మనం మాట్లాడాల్సింది చాలా ఉంది’ అని ఈ వీకెండ్‌ హౌస్‌లో ఎలాంటి హీట్ ఉండబోతుందో హింట్ ఇచ్చేసిన నాగార్జున.. ఈ ప్రోమోలో మాత్రం ఫుల్ ‌ఫైర్ మీద కనిపించారు.

ఈ ప్రోమో స్టార్టింగ్‌లోనే ‘సంజన ఎందుకు ఏడుస్తున్నావ్?’ అని నాగార్జున అడితే.. సంజన లేచి.. ‘నన్ను అందరూ కార్నర్ చేస్తున్నట్లుగా ఫీలింగ్ వస్తుంది’ అని ఎమోషనల్‌గా తెలిపింది. ఇవాళ మీ అందరికీ స్టార్స్ వస్తాయని చెబుతూ.. కెప్టెన్ రామూని స్టార్స్‌ను తీసుకొచ్చేందుకు పంపించారు. అలాగే అందరికీ చుక్కలు కూడా కనబడతాయంటూ.. అసలు విషయం కుండబద్దలు కొట్టేశారు. నువ్వు చెప్పిన ప్రేమకథ చాలా ఎమోషన్‌గా ఉంది, కంటిలో నుంచి నీళ్లు కూడా వచ్చేశాయ్ అని నాగ్ అనగానే.. ఇమ్ము లేచి ‘నేను చాలా మిస్ అవుతున్నాను సార్’ అని ఏడ్చేశాడు. నిన్నటి నుంచి నావల్ల కావడం లేదు సార్.. ప్లీజ్ తను ఎలా ఉందో ఒక్క మాట చెప్పండి సార్.. అని నాగ్‌ని ధీనంగా ఇమ్ము వేడుకుంటున్నాడు.

Also Readబిగ్‌బాస్ డే 25 రివ్యూ... ఇమ్మూ, భరణి, తనూజ మధ్య బిగ్ బాస్ చిచ్చు... సొంత టీంకి సంజన అన్యాయం... ఒక్కో టాస్కులో ఒక్కో ట్విస్టు

ఈ హౌస్‌కి గెలవడానికి వచ్చావా? బంధాలను ఏర్పరచుకోవడానికి వచ్చావా? అని తనూజని నాగ్ అడిగారు. ‘సార్.. అది జెన్యూన్ ఎమోషన్ సార్’ అని తనూజ అనగానే.. అదే నిన్ను, నీ ఆటను ముంచేస్తుందని నాగ్ సీరియస్‌గా చెప్పారు. ‘టీ కప్పులో తుఫాను అని విన్నాం.. ఇది పోపుల సునామిలా ఉంది’ అని నాగ్ అనగానే.. ‘నేను ఆ రోజుని ఇప్పటికీ ఊహించుకుంటుంటే.. అది నాకు వద్దు అని అనిపిస్తుంది.. వినలేని మాటలన్నీ విన్నాను సార్ ఆ రోజు’ అని తనూజ చెప్పింది. టెనెంట్స్, ఓనర్స్‌కి ఏం కావాలో చేసి పెట్టడం రెస్పాన్సిబిలిటీనా? కాదా? అని దివ్యను నాగ్ ప్రశ్నించగానే.. ‘నేను చేయనని ఎప్పుడూ చెప్పలేదు సార్..’ అని దివ్య అనగానే, చెయ్యలేదు కదా.. అని నాగ్ సీరియస్ అయ్యారు. ‘ఆ విషయంలో వాళ్ల గొడవ అప్పటికే చాలా పెద్దదైపోయింది’ అని దివ్య వివరణ ఇచ్చింది.

మనకు కావాల్సింది పోపా? ఫైటా?.. అది కాంప్లిమెంట్ కాదు సంజన అని మరోసారి ఆమెకు నాగ్ చురకలు అంటించారు. ప్రాంక్‌కి, థెప్ట్‌కి తేడాని మరిచిపోయావు.. ఇది అందరినీ హర్ట్ చేస్తుందని చెప్పి.. ‘దొంగలున్నారు జాగ్రత్త’ బోర్డును ఇమ్ముతో సంజన మెడలో వేయించారు నాగ్. ఈ హౌస్‌లో నీ కోసం నలుగురు త్యాగం చేశారు. ఇప్పుడా నలుగురు నీ పక్షాన లేరు. అందుకు కారణం నీ ప్రాంక్స్. అమ్మాయిలు, మమ్మీ కంపారిజన్ ఎందుకు చేశావ్? అది చాలా తప్పు కదా? అని సంజనను నాగ్ ఏకధాటిగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. మమ్మల్ని పక్కన పెట్టేస్తున్నారనే ఫీలింగ్ వచ్చేస్తుందని సంజన అనగానే.. ‘నీకోసం నలుగురు త్యాగం చేశారంటూ నాగ్ బిగ్గరగా ఆమెపై అరిచేశారు. అందరికీ రావాల్సిన గుడ్లు నువ్వు తినేసినా.. ఎవ్వరూ నిన్ను అనలేదు. నీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని ఎలా అనుకుంటున్నావ్? ఇది కరెక్ట్ కాదు సంజన.. అటువంటి మాటలు అనవద్దు’ అని సంజనకు క్లాస్ ఇచ్చారు నాగ్. ఇది ఈ ప్రోమోలో ఉన్న విషయం. మొత్తం మీద, ఈ డే 27 ప్రోమో 2 చూస్తుంటే, శనివారం ఎపిసోడ్ చాలా ఎమోషనల్‌గా, ప్రశ్నలతో, విమర్శలతో నిండి ఉంటుందని, హౌస్‌మేట్స్‌కు తమ తప్పులు తెలుసుకునే అవకాశం దొరుకుతుందని తెలుస్తోంది. హోస్ట్ నాగార్జున పదునైన విశ్లేషణ, సూటిగా చురకలు అంటించే తీరు ఆసక్తికరంగా ఉంది.

Also Read: బిగ్‌బాస్‌లో ఈ వారం ఊహించని ఎలిమినేషన్... మాస్క్ మ్యాన్ ఔట్... ఆయన సంపాదన ఎంతో తెలుసా?