Bigg Boss Telugu 9 - Day 27 Promo 1: బిగ్ బాస్ 4వ వారం వీకెండ్‌కు చేరుకుంది. ఈ వీకెండ్ మస్తీని బిగ్ బాస్ వెరైటీగా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. తాజాగా డే 27కి సంబంధించిన మొదటి ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమో చూసిన వారంతా హోస్ట్ నాగార్జున ఈ వారం మాములుగా క్లాస్‌లు ఇవ్వడం లేదనేది అర్థమవుతోంది. ఈ వారమంతా టాస్క్‌లు, గొడవలు, ఎమోషన్స్‌తో వేడెక్కిన హౌస్.. నాగార్జున ప్రవేశంతో పూర్తిగా మారిపోనుంది. ఈ వారం అంతా గొడవలు పడిన వారు కూడా ఈ వీకెండ్ నవ్వుతూ కనిపిస్తారు. హౌస్‌లోని వారు, ఈ షోని ఫాలో అయ్యే వారు శనివారం, ఆదివారం ఎపిసోడ్స్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తుంటారు. కారణం హోస్ట్ నాగార్జునతో సరదా సంభాషణ, గెస్ట్‌లు, ఆయన ఆడించే ఆటలు. హౌస్‌మేట్స్‌లో కూడా ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.
ఇక ఈ వారం రోజులుగా హౌస్‌లోని వారి ప్రదర్శన ఎలా ఉంది, ఎవరు బాగా ఆడారు, ఎవరు ట్రాక్ తప్పారు? అనే అంశాలను నాగార్జున తనదైన శైలిలో సమీక్షిస్తూ.. ఇవ్వాల్సిన వారికి ఇచ్చిపడేస్తుంటారు. ఈ ‘వీకెండ్ మస్తీ’ కేవలం వినోదం మాత్రమే కాదు, కంటెస్టెంట్లకు అత్యంత కీలకమైన సెగ్మెంట్ కూడా. నాగార్జున ఇచ్చే ఫీడ్‌బ్యాక్, ప్రశంసలు, హెచ్చరికలు, కంటెస్టెంట్ల ఆట తీరు, ఎమోషన్స్ అన్నీ హైలెట్ అవుతూ.. వీకెండ్ మస్తీకి పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్‌గా మారతాయి. ఇక ఈ శనివారం జరగబోయే ఎపిసోడ్‌కు సంబంధించి వచ్చిన ప్రోమోలో ఉన్న విషయానికి వస్తే..
డే 27 ఫస్ట్ ప్రోమోలో, నాగార్జున ఎంట్రీతోనే ‘గొడవలు బాగా ముదిరిపోయాయ్.. మనం మాట్లాడాల్సింది చాలా ఉంది’ అనడం చూస్తుంటే.. ఈ వారం ఒక్కొక్కరికి ఉంటది నాసామిరంగా.. అనే రేంజ్‌లో ఇంట్రస్ట్ పెంచేశారు. వెంటనే ఎటువంటి ఆలస్యం చేయకుండా హౌస్‌లోకి వెళ్లిపోదామని నాగార్జున చెప్పగానే.. హరీష్ బిగ్ బాస్ పంపిన సందేశం చదువుతున్నారు. ‘బిగ్ బాస్ ఈ రోజు మీకు ఇస్తున్న టాస్క్.. థమ్సప్ అన్‌లాక్ ది తుఫానీ ఫర్ బిర్యానీ. స్విమ్మింగ్ పూల్‌లో కొన్ని కాయిన్స్ ఉన్నాయి. ప్రతి కాయిన్ పై ఒక వైపు ఓ అక్షరం ఉంటుంది. అందులో ఉన్న ఆల్ఫాబెట్ కాయిన్స్‌ను స్వీకరించాలి. మరొకరు వారికి కేటాయించిన తుఫానీ కాయిన్ బోర్డులో నిలబెట్టాలి. తుఫానీ అనే వర్డ్ వచ్చేలాగా, కాయిన్ బోర్డులో పెట్టి బజర్ నొక్కుతారో, వారు ఈ టాస్క్ విజేతలు అవుతారు’ అని బిగ్ బాస్ సందేశాన్ని హరీష్ వినిపించారు.
ఈ టాస్క్‌లో స్విమ్మింగ్ పూల్‌లోకి దివ్య, కళ్యాణ్ దిగగా, దివ్య - డెమాన్ పవన్ టీమ్ విన్ అయినట్లుగా చూపించారు. అయితే విజయం పొంది, బిర్యానీ తినే టైమ్‌కి భరణి, సంజనల మధ్య పెద్ద వార్ మొదలైంది. ఇద్దరూ విన్నింగ్ టీమ్‌లో ఉన్నా, వారిద్దరి మధ్య సెల్ఫీష్, షేమ్‌లెస్ వర్డ్స్ యుద్ధానికి కారణమయ్యాయి. భరణిని తీరుపై సంజన ఫైర్ అవుతూనే, ఆమెకు ఎదురైన అనుభవాన్ని ఇతర కంటెస్టెంట్స్‌కు చెబుతూ ఎమోషనలైంది. మొత్తంగా చూస్తే.. ఈ వారం సంజన మరో వార్‌కి తెర తీసినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే హౌస్‌లో గుడ్ల విషయంలో ఆమె ఏం చేసిందో అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా భరణితో వార్ పెట్టుకుని, హాట్ టాపిక్ అయింది. మరి వీరందరికీ నాగార్జున ఎలా మందు పూస్తాడో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని గంటల వరకు వెయిట్ చేయాల్సిందే.