బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రియాలిటీ షో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అనే ఇంట్రెస్టింగ్ థీమ్ తో మొదలైంది. కానీ హౌస్ లో మాత్రం కామనర్స్ కే గడ్డుకాలం నడుస్తోంది. ఇప్పటిదాకా మొత్తం వారానికి ఒకరు చొప్పున ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. కానీ అందులో ఒకరు మాత్రమే సెలబ్రిటీ ఉన్నారు. మిగతా ఇద్దరూ ప్రియా శెట్టి, మర్యాద మనీష్ కామనర్స్. ఇక ఇప్పుడు నాలుగవ వారం నామినేషన్ లో కూడా మరో షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. ఈసారి ఏకంగా మాస్క్ మ్యాన్ (Mask Man Haritha Harish)ను బయటకు పంపించారు.
కామనర్స్ కు కలిసిరాని కాలం... ఊహించని ఎలిమినేషన్ 4వ వారం నామినేషన్లలో రీతూ చౌదరి, సంజన, ఫ్లోరా షైనీ, శ్రీజ దమ్ము, దివ్య నికిత, హరిత హరీష్ ఉన్నారు. ఈ లిస్ట్ లో ఉన్న సెలబ్రిటీలు రీతూ, సంజన, ఫ్లోరా, రీతూలకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతివారం ఫ్లోరా నామినేషన్ లోకి రావడం, సేవ్ కావడం జరుగుతూనే ఉంది. ఇక మిగిలిన కంటెస్టెంట్స్ లో శ్రీజ, దివ్య, హరీష్ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ ముగ్గురిలో శ్రీజ అంటే తీవ్రమైన నెగెటివిటీ ఉండగా, ప్రియా వెళ్ళిపోయాక అది కాస్త తగ్గింది. పైగా ఈవారం విజృంభించి ఆడిన కళ్యాణ్ పడాలతో ఆమెకు మంచి బాండింగ్ ఉండడంతో, అతని ఫ్యాన్స్ ఓటింగ్ కూడా కలిసి వచ్చింది. అలా ఓటింగ్ తారుమారు అవ్వడంతో ఈ వారం ఎలిమినేట్ అవ్వక తప్పదనుకున్న శ్రీజ సేఫ్ అయ్యింది. చివరగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన దివ్య, హరీష్ ఓటింగ్ పరంగా వెనకబడి ఉన్నారు. వీళ్లిద్దరిలో హరీష్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది.
మాస్క్ మ్యాన్ సంపాదన ఎంత ? మాస్క్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు కామనర్ హరిత హరీష్. అగ్ని పరీక్షను దాటుకుని, ఇప్పటి దాకా బిగ్ బాస్ లో కొనసాగాడు. అయితే ఈ నాలుగు వారాల ప్రయాణంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఒకానొక టైమ్ లో మితిమీరిన కోపంతో మాట జారాడు. "ఆడవాళ్లను తక్కువ చేసి మాట్లాడావ్" అంటూ నాగార్జున కౌంటర్ ఇచ్చినా, ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ముక్కుసూటిగా మాట్లాడే ఆయన... తాను అన్నమాట ఆడవాళ్లను తక్కువ చేయాలనే ఉద్దేశంతో అన్నది కాదని అన్నాడు. పైగా ఇలాంటి ముఖ్యమైన సిట్యువేషన్ లో తనకు సపోర్ట్ చేయనందుకు హౌస్ మేట్స్ పై అలిగి, నిరహార దీక్షకు సైతం దిగాడు. తనలోని హ్యూమర్ సైడ్ ను చూపించమంటూ భార్య నుంచి వచ్చిన మెసేజ్ తో అన్నీ పక్కన పెట్టేశాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది. ఈ వారం చేతికి గాయం కావడంతో హరీష్ హౌస్ లో పెద్దగా కనిపించలేదు. అదే ఆయనకు బిగ్గెస్ట్ మైనస్ గా మారింది. ఈ 4 వారాల్లో ఆడియన్స్ ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసిన కంటెంట్ ను ఇవ్వలేకపోయారు. దీంతో ఈవారం బిగ్ బాస్ ఆయనకు టాటా బైబై చెప్పేశారు. హౌస్ లో ఉన్నప్పుడు ఆయన వారానికి 60 వేలు చొప్పున నాలుగు వారాల్లో రూ. 2.40 లక్షలు సంపాదించినట్టు సమాచారం.