Bigg Boss Telugu 9 Latest Emotional Promo : బిగ్‌బాస్ తెలుగుపై రోజురోజుకి బజ్ పెరుగుతుంది. దానికి తగ్గట్లే కంటెంట్‌ను కూడా బాగా ప్లాన్ చేస్తుంది బిగ్‌బాస్ టీమ్. దానిలో భాగంగానే ఎప్పటికో జరగాల్సిన ఫ్యామిలీ సెంటిమెంట్‌ని ముందుగా తీసుకొచ్చేసింది. సీజన్ ప్రారంభమైన రెండు వారాలకే ఫ్యామిలీ లెటర్స్, మెసేజ్‌లు అంటూ సెంటిమెంట్ డ్రామాకు తెరలేపాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా టాస్కులు నిర్వహిస్తూ.. బ్యాటారీ ఛార్జ్ పేరుతో సందేశాలు ఇస్తూ.. టాస్క్‌లు ఆడిస్తున్నారు. తాజాగా దానికి సంబంధించిన డే 17 ప్రోమోను విడుదల చేశారు.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో..
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. సెప్టెంబర్ 24వ తేదీన ఎమోషనల్ ప్రోమోను విడుదల చేశారు. ముందుగా లోపలికి వెళ్లిన తనూజకు బిగ్‌బాస్ మూడు ఆప్షన్స్ ఇచ్చారు. చెల్లి వాయిస్ రికార్డ్ కావాలా? లెటర్ కావాలా? స్పెషల్ వ్యక్తి పంపిన హార్ట్ సింబల్‌తో కూడిన టీషర్ట్ కావాలా అంటూ అడగ్గా తనూజ ఎమోషనల్ అయిపోయింది. వీటిలో ఏది కావాలన్నా 50 శాతం పవర్ తగ్గిపోతుందని చెప్పడంతో ఏడ్చేస్తుంది. చివరికి చెల్లిపంపిన రికార్డ్ కావాలంటూ చెప్తోంది. దానికి బిగ్‌బాస్ హార్ట్ టీషర్ట్ మీకు స్పెషల్ అని అనుకుంటున్నాను.. స్పెషల్ వ్యక్తి మీకు దానిని పంపించారంటూ.. చెప్పేసరికి తనూజ ఏడుస్తూ.. నాకు వద్దు బిగ్‌బాస్ అంటూ చెప్తుంది.
భరణి బాక్స్‌తో ఫిట్టింగ్..
తనూజ తర్వాత లోపలికి వెళ్లిన సుమన్ శెట్టి బిగ్‌బాస్ ఓ ఫిటింగ్ పెట్టాడు. బ్యాటరీ పర్సెంట్ 10 శాతమే ఉందని.. అయితే మీరు ఫ్యామిలీ నుంచి వచ్చిన మెసేజ్ చూడాలనుకుంటే.. కచ్చితంగా భరణి దగ్గర ఉన్న సీక్రేట్ బాక్స్ ఓపెన్ చేయించాలని చెప్పారు. దాంతో సుమన్ శెట్టి వేరే దారిలేదా అంటే.. లేదు అని చెప్పడంతో సుమన్ శెట్టి ఏమి చేయలేక బయటకొచ్చాడు. భరణి దగ్గరకు వెళ్లి.. మీరు ఆ సీక్రెట్ బాక్స్ ఓపెన్ చేస్తే బ్యాటరీ పెరుగుతుంది. నా ఫ్యామిలీ మెసేజ్ వస్తుందని చెప్పాడు. నా బాక్స్‌తో దీనికి సంబంధం ఏంటని భరణి అడగ్గా తెలియదంటూ చెప్పాడు సుమన్ శెట్టి. దీంతో ప్రోమో కట్ అయింది. అయితే లైవ్ ప్రకారం భరణి సీక్రెట్ బాక్స్ ఓపెన్ చేశాడు. సుమన్ శెట్టి కూడా మెసేజ్ పొందాడు.
ఈ ఎమోషనల్ ఎపిసోడ్ తర్వాత కెప్టెన్సీ టాస్క్ జరగనుంది. అయితే అదే సమయంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే వీళ్లు డమ్మీ కంటెస్టెంట్లు అంటున్నారు. కానీ ముగ్గురు కామనర్స్‌ని లోనికి పంపి వారిలో ఒకరిని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఉంచుతారని చెప్తున్నారు. అలాగే ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు ఇంట్లోకి వెళ్లబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. పైగా ఈ వారం రెండు ఎలిమినేషన్స్ ఉండొచ్చని టాక్ గట్టిగా వినిపిస్తుంది.