పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ లో ఫ్యామిలీ వీక్ రావాలంటే చాలా టైమ్ పడుతుంది. షో ఎండింగ్ లో లేదా మొదలైన చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ మెసేజులను అందుకుంటారు కంటెస్టెంట్స్. ఇక చివర్లో ఫ్యామిలీ వీక్ అని చెప్పి, టాప్ కంటెస్టెంట్స్ ఫ్యామిలీలను హౌస్‌లోకి పంపిస్తారు. కానీ సీజన్ 9లో మాత్రం రెండు వారాలకే ఎమోషనల్ బజర్ మోగించారు బిగ్ బాస్. కంటెస్టెంట్స్ కు మరింత మైలేజ్ ఇవ్వడానికో లేదంటే అందరి మాస్క్ లు తీయడానికో తెలీదు కానీ, అప్పుడే ఫ్యామిలీ మెసేజ్ అంటూ కంటెస్టెంట్స్ చేత కన్నీళ్లు పెట్టించారు.

Continues below advertisement

రీతూ సీక్రెట్ టాస్క్ బిగ్ ఫెయిల్  ఎపిసోడ్ మొదట్లోనే నిన్నటి నామినేషన్ రచ్చ కంటిన్యూ అయ్యింది. శ్రీజ ఏడవగా, మధ్యలో మాట్లాడడం అనేది గ్రూప్ గేమ్ లా ఉందంటూ భరణిపై తనూజ ఫైర్ అయ్యింది. అలాగే రాము, తనూజ, రీతూ కంటెండర్ టాస్క్ లో జరిగిన అపార్థం గురించి మాట్లాడుకున్నారు. మరోవైపు వంట విషయంలో హరీష్, సంజన మధ్య గొడవ మొదలైంది. ఇమ్మాన్యుయేల్ శ్రీజను ఓదార్చాడు. ఇక సుమన్ శెట్టితో హరీష్ మాట్లాడుతూ "మీకు ఫుడ్ విషయంలో ఒక యూనిటీ ఉండదు కానీ, నామినేషన్స్ లో మాత్రం బాగా ఉంటుంది" అని పంచ్ వేశాడు. దీంతో "ఇంకో రెండ్రోజుల్లో ఫుడ్ వస్తుంది, ఒక్కరూ తప్పు చేస్తే అందరినీ అనడం తప్పు కదా సర్" అంటూ హరీష్ నోరు మూయించాడు సుమన్.   

16వ రోజు ఉదయాన్నే టాస్క్ తో ఫన్ మొదలెట్టారు. అంతలోనే బిగ్ బాస్ రీతూనీ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. బిగ్ బాస్ ఇచ్చిన చికెన్ ను చూసి, తన తల్లి వండి పెట్టేది అంటూ ఆనంద్ బాష్పాలు రాల్చింది. కానీ కండిషన్ అప్లై అంటూ ఇంటి సభ్యుల సిక్రెట్ ను చెప్పమన్నారు బిగ్ బాస్. దీంతో కళ్యాణ్ పై తనూజకు సాఫ్ట్ కార్నర్ ఉందని, కానీ దాన్ని చూపించదని చెప్పింది. కానీ బిగ్ బాస్ సంతృప్తి చెందకపోగా, సాయంత్రంలోపు అందరి సీక్రెట్స్ చెప్పాలని ఆదేశించారు. అలా పవన్ దగ్గర నుంచి మొదలు పెడితే అందరి దగ్గర అడిగింది రీతూ. కానీ వర్కౌట్ కాలేదు. ఆమెకు సీక్రెట్ టాస్క్ ఇచ్చారని మాత్రం అందరూ కనిపెట్టారు. 

Continues below advertisement

సంజన లైఫ్ లో డేంజర్ ఎక్స్ లవర్ రీతూతో మాట్లాడుతూ సంజన కాలేజ్ లో ఒకరిని లవ్ చేసినట్టు వెల్లడించింది. కానీ వాడు సక్సెస్ కాకూడదని తనను కొట్టాడని, చివరికి తాను దక్కక యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడని చెప్పింది. ఇక తన తల్లికి అబద్ధాలు చెప్తానని తనూజ తన సీక్రెట్ చెప్పేసింది. మిగిలిన వాళ్ళెవ్వరూ నోరు విప్పలేదు. 

రంగలోకి దిగిన బిగ్ బాస్"గతవారం నాగార్జున నుంచి వచ్చిన రియాక్షన్ శాంపిల్ మాత్రమే. అసలు సినిమా రాబోయే వారంలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు జరగబోయే టాస్క్ కంటెండర్, కెప్టెన్సీ, నామినేషన్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది. కృష్ణుడిలా దారి చూపడమే కాకుండా, అర్జునుడిలా రంగంలోకి దిగుతాను" అంటూ బిగ్ బాస్ ఆపిల్ టాస్క్ ఇచ్చారు. అందులో రెడ్, బ్లూ, బ్లాక్ సీడ్స్ ను ఇచ్చారు. ఈ గ్యాప్ లో ఓ కునుకేసిన ఓనర్స్ కు కెప్టెన్ డెమాన్ పనిష్మెంట్ ఇచ్చాడు.

సుమన్ శెట్టి స్వాగ్ సంజనకు కాఫీ ఇచ్చి, దాన్ని గెలుచుకోవడానికి ఆమెను ఇంప్రెస్ చేయాలని ఆదేశించారు బిగ్ బాస్. అంతలోనే "లవ్ ప్రపోజల్ స్కిట్ అనగానే కళ్యాణ్ ను తీసుకుని వెళ్ళింది" అంటూ ఇమ్ము అలిగాడు. దీంతో తనూజ ఫైర్ అయ్యింది. ఎట్టకేలకు స్కిట్ చేసి కాఫీని సంపాదించుకున్నారు. డిమాన్, ఇమ్మూ, సుమన్ శెట్టి కాలేజ్ అబ్బాయిలుగా నటించారు. తనూజ, రీతూ, ఫ్లోరా క్లాస్ మేట్లుగా చేశారు. సుమన్ శెట్టి, తనూజ మధ్య లవ్ ట్రాక్ ఫన్నీగా, హైలెట్ గా నిలిచింది.

యాపిల్స్ లో బ్లూ విత్తనం ద్వారా హౌస్ మేట్స్ కి ఇంటి నుంచి వచ్చిన సందేశాన్ని నెమరు వేసుకునే అవకాశం ఇచ్చారు. "ఇక్కడ ఏది పొందాలన్నా దానికోసం కొంత మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అది మీ ముందున్న బ్యాటరీ రూపంలో ఉంది" అంటూ టాస్క్ మొదలు పెట్టారు బిగ్ బాస్. ఒక్కొక్కరూ టాస్క్ లో గెలిచి తీసుకునే నిర్ణయం ఆధారంగా బ్యాటరీ తగ్గుతుందని వెల్లడించారు. ముందుగా ఇమ్మాన్యుయేల్ బజర్ మోగించగా, అతని తండ్రి లెటర్ 45%, తల్లి మెసేజ్ 30%, ఫ్యామిలీ ఫోటో 25 శాతం బ్యాటరీ తగ్గుతుందని ఆప్షన్ ఇచ్చారు బిగ్ బాస్. అందరికీ ఛాన్స్ రావాలనే ఉద్దేశంతో ఇమ్మూ 25% బ్యాటరీ ఇచ్చేసి ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాడు. ఇక రాము, తనూజ, సంజన, ప్రియా కూడా ఈ విషయంలో ఎమోషనల్ అయ్యారు.