Bigg Boss Telugu 9 Latest Emotional Promo : బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో వచ్చింది. పొద్దున్న ఇచ్చిన ప్రోమోతో అందరినీ నవ్వించేసిన బిగ్‌బాస్ ఇప్పుడు అందరినీ ఏడ్పించేశాడు. బిగ్‌బాస్ హోజ్‌లోకి వచ్చి మూడు వారాలే అయినా కూడా కంటెస్టెంట్లో ఇంటికి దూరంగా ఉంటూ తమ వారిని మిస్ అవుతున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా బిగ్‌బాస్ ముందుగానే ఇంటి నుంచి సందేశాలు తీసుకొచ్చేశాడు. దీంతో అప్పటితో నవ్వులతో నిండిపోయిన బిగ్‌బాస్ హోజ్.. ఈ న్యూస్‌తో ఎమోషనల్‌గా మారిపోయింది.
బిగ్‌బాస్ ప్రోమోలో ఏముందంటే..
బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు ఇంటి నుంచి మెసేజ్ తీసుకొచ్చేశాడు. కానీ వాటిని పొందాలంటే ఆడి సంపాదించుకోవాలంటూ ట్విస్ట్ పెట్టాడు. ఫ్యామిలీ నుంచి మెసేజ్లు వచ్చాయని చెప్పేసరికే అందరూ ఎమోషనల్ అయిపోయారు. అయితే ఫ్యామిలీ మెంబర్స్ పంపించిన లెటర్స్, మెసేజ్లు పొందాలంటే.. గేమ్ ఆడాలని చెప్పాడు. అంతేకాకుండా 100 పర్సెంట్ ఉన్న బ్యాటరీని కూడా డిస్ప్లే చేశారు. గేమ్ ఆడి గెలిచి.. మెసేజ్ తీసుకుంటే లేదా ఇతర విధానాల బట్టి బ్యాటరీ తగ్గుతుందని చెప్పాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా నిర్వహించిన గేమ్‌లో ఇమ్మాన్యూయేల్ గెలిచాడు.
ఇమ్మూ గెలిచి కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లగా మీకు లెటర్ కావాలన్నా.. వాయిస్ రికార్డ్ కావాలన్నా బ్యాటరీ తగ్గుతుంది. అయితే తర్వాత ఇంట్లోవారి మెసేజ్ చూడాలనుకునేవారికి కొంతే బ్యాటరీ ఉందని చెప్పడంతో ఇమ్మూ ఎమోషనల్ అయ్యాడు. ఇంట్లో దాదాపు అందరూ తమ వారితో మాట్లాడాలని చూస్తున్నారని చెప్పాడు. ముఖ్యంగా తనూజ, సంజన, సుమన్ ఇలా ఇంట్లో వారిపై బెంగతో ఉన్నారంటూ చెప్పుకొచ్చాడు. వారికోసం వదిలేయాల వద్దనే ఆలోచనలో ఏడుస్తూ.. నేను ఏడిస్తే మా అమ్మ చూడలేదు బిగ్‌బాస్ అంటూ ఎమోషనల్ అయ్యాడు.
మొత్తానికి ఈ వారం ఇలా ఇంట్లో వారి మెసేజ్లు ఇస్తూనే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ప్లాన్ చేశాడు బిగ్‌బాస్. అయితే ముందుగా వచ్చే సెలబ్రెటీలు, కామనర్స్ డమ్మీ కంటెస్ట్లనే బజ్ ఎక్కువగా వినిపిస్తుంది. దీని తర్వాత రియల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది. ఇలా సీజన్ 9 పై ఆసక్తిని కలిగించేలా బిగ్‌బాస్ టీమ్ ప్లాన్ చేస్తుంది. ఈరోజు ఎపిసోడ్ అయితే కచ్చితంగా ఎమోషనల్ రైడ్‌గా ఉండనుంది.