Bigg Boss Telugu 9 Latest Promo : బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగులో ఈ వారం ఫన్ టాస్క్ మొదలైంది. కెప్టెన్సీ టాస్క్‌లు వచ్చేవరకు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చేవరకు కంటెస్టెంట్లు ఖాళీగానే ఉంటారు. నామినేషన్ల తర్వాత ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు ఫన్నీ టాస్క్‌లు చేస్తున్నారు కంటెస్టెంట్లు. ఈసారి కూడా సెలబ్రెటీలే కంటెంట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. కామనర్స్‌తో కలిసి కాలేజ్ ఎపిసోడ్ టైప్‌లో ఓ ఫన్నీ టాస్క్ ప్లాన్ చేశారు. దీనిలో హీరో సుమన్ శెట్టి.
బిగ్‌బాస్ లేటేస్ట్ ప్రోమో ఎలా ఉందంటే..
బిగ్‌బాస్ విడుదల చేసిన ఫన్నీ ప్రోమో బాగా ఆకట్టుకుంటుంది. రీతూ.. ఇమ్మూని అన్నా.. అన్నా వాడు నన్ను పిలిచి ఇవి ఎత్తు అన్నాడన్నా అని చెప్పగా.. ఇమ్మూ.. వాడు నీ మంచి గురించే చెప్తాడమ్మా.. బామ్మర్థి ఆడు అంటూ డిమోన్ పవన్‌ని ఉద్దేశించి చెప్తాడు. వాడు మాకు కెప్టెనా? లేక నీకు కెప్టెనా? లేక నువ్వే వాడికి కెప్టెనా మాకు అర్థం కావట్లేదమ్మా అంటూ కామెడీ చేస్తాడు.
సుమన్ అన్నా నామినేషన్స్‌లో లేవని మంచి జోష్‌లో ఉన్నావుగా అంటూ.. నెక్స్ట్ వీక్ వచ్చేస్తావులే అని ఫన్ చేస్తాడు. తనూజ కత్తి పట్టుకుని ఉంటే.. కత్తిలా ఉన్నావ్ అక్కా అంటూ ఇమ్మూ కామెడీ చేయడంతో అందరూ నవ్వేస్తారు. కామనర్స్ వర్క్ చేయడంతో సెలబ్రెటీలు ఖాళీగా ఉన్నారు. దీంతో వారు టాస్క్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు.
ఒరేయ్ సుమన్.. ఒరేయ్ సుమన్.. అమ్మాయిలు నీకు ఎలా పడిపోతున్నారురా.. మాకు కూడా కొంచెం టిప్స్ చెప్పు అంటూ ఇమ్మూ, డిమోన్ పవన్ వస్తారు. కాలేజీ అమ్మాయిలుగా తనూజ, రీతూ, ఫ్లోరా షైనీ వస్తారు. ఒరేయ్ నాకు సిగ్గు ఏస్తుందిరా అంటూ సుమన్ సిగ్గు పడితే.. అతని ప్రేమకోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్న పాత్రలో తనూజ కనిపించింది. పేరెంట్స్ ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకుందాం అంటూ ఫన్నీ స్కిట్ చేశారు.
సుమన్ శెట్టి, తనూజ ప్రేమలో ఉంటే.. పక్కనుంచి వచ్చిన ఇమ్మూ.. సుమన్ శెట్టి డైలాగ్‌ను ఇమిటేట్ చేస్తాడు. ఒరేయ్ దుర్మార్గుడా.. అమవాస్య రోజు పుట్టినోడా.. ఫ్రెండ్స్‌ని ఎలా మర్చిపోతావురా అంటే.. లవ్ తర్వాతేరా ఫ్రెండ్స్ అంటూ తనూజను ఎత్తుకున్నాడు సుమన్ శెట్టి. దీంతో ప్రోమో ముగిసింది.