తెలుగు ఆడియన్స్ ను విశేషంగా అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటినుంచి ఒక లెక్క అన్నట్టుగా సాగుతోంది. ఇప్పటికే హౌస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్స్ ఒక్కోవారం ఎలిమినేట్ కాగా, త్వరలోనే వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉండబోతున్నాయనే చర్చ జోరుగా నడుస్తోంది. అంతలోనే బిగ్ బాస్ చరిత్రలోనే నెవర్ బిఫోర్ అనే అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఊహించని సర్ప్రైజులతో పాటు మిడ్ వీక్ షాక్ ఇవ్వడానికి బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నారనేది ఆ అప్డేట్ సారాంశం. 

Continues below advertisement

మిడ్ వీక్ ఎంట్రీలు, ఎలిమినేషన్లు ఇండస్ట్రీ వర్గాల గుసగుసల ప్రకారం గతంలో ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ షోలో ఈసారి అదిరిపోయే సర్ప్రైజ్ లు ఉండబోతున్నాయి. అందులో భాగంగానే డబుల్ ఎలిమినేషన్లు, వైల్డ్ కార్డు ఎంట్రీలు, సీక్రెట్ రూమ్ టాస్క్ లు ఉండబోతున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీలు అన్న సాంప్రదాయం మొదటి నుంచి ఉంది. కానీ ఎప్పటిలా కాకుండా ఈసారి బిగ్ బాస్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ను ప్లాన్ చేశాడని తెలుస్తోంది. అందులో భాగంగా హౌస్‌లోకి ముగ్గురు వైల్డ్ కార్డు ఎంట్రీలు అడుగు పెట్టబోతున్నారని, అది కూడా అగ్నిపరీక్షలో ఆఖరి దాకా వచ్చిన కంటెస్టెంట్స్ అనే విషయం తాజాగా బయటకు వచ్చింది. బుధవారం ఉదయాన్నే ఈ ముగ్గురు కంటెస్టెంట్స్ హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. అంటే బుధవారం బుర్రబద్దలయ్యే ట్విస్ట్ అన్నమాట. ఇదే ఊహించని  సర్ప్రైజ్ అనుకుంటే, అంతకుమించి అన్నట్టుగా ఈసారి రెండు మూడు డబుల్ ఎలిమినేషన్లు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం హౌస్‌లో 13 మంది కంటెస్టెంట్లు ఉండగా, త్వరలోనే 9 వైల్డ్ కార్డు ఎంట్రీలు హౌస్ లోకి రాబోతున్నాయని సమాచారం. అయితే గేమ్ ని మెయింటైన్ చేయడానికి అటు వైల్డ్ కార్డు ఎంట్రీ లు, ఇటు డబుల్ ఎలిమినేషన్లు ఒకేసారి జరిగే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.

Also Read: బిగ్ బాస్ 9 తెలుగు డే 15 రివ్యూ... నామినేషన్లలో లత్కోర్ పంచాయతీ... ఫ్లవర్ ఎవరో ఫైర్ ఎవరో తేలిపోయింది... కామనర్స్ ను కార్నర్ చేసిన ఓనర్స్

Continues below advertisement

అగ్ని పరీక్ష నుంచి హౌస్ లోకి ఆ ముగ్గురు... నిజానికి అగ్ని పరీక్షలో తమను తమ ప్రూవ్ చేసుకున్న కొంతమందికి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశం లభించలేదు. ముఖ్యంగా నాగ ప్రశాంత్ అనే కంటెస్టెంట్ ను జడ్జిలు బిందు మాధవి, నవదీప్, అభిజీత్ పొగడ్తలతో ముంచెత్తారు. అలా ఎంటర్టైన్ చేస్తూనే టాస్కులలో సత్తా చాటిన నాగీకి అవకాశం దొరకకపోవడం అన్యాయమని అందరూ భావించారు. కానీ బిగ్ బాస్ దానికి జస్టిఫికేషన్ ను వైల్డ్ కార్డు ఎంట్రీ రూపంలో ఇవ్వబోతున్నట్టు సమాచారం. నిజానికి అగ్నిపరీక్షలో పాల్గొన్న చాలామందికి ఫ్యాన్ బేస్ లేదు. శ్రీజ, డెమాన్ పవన్ కు మాత్రమే ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఇప్పుడు ప్యూర్ కామనర్స్ అయిన నాగ ప్రశాంత్, షాకీబ్, దివ్య నికిత ఎంట్రీ ఇవ్వనున్నారు. సమాచారం ప్రకారం అగ్నిపరీక్షలో నెగ్గినప్పటికీ వీళ్ళ ముగ్గురికీ అంత ఈజీగా హౌస్ లో ఉండే ఛాన్స్ దొరకదు. ఎందుకంటే ఈ ముగ్గురూ టాస్క్ లలో పాల్గొని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి వీళ్లలో ఈ సెకండ్ ఛాన్స్ ను ఎవరు ఒడిసి పట్టుకుంటారు? ఆ అవకాశం ఎలా లభించబోతోంది ? ఈ వార్తల్లో నిజమెంత ? అనేది చూడాలి.

Also Readబిగ్ బాస్ 9 డే 14 రివ్యూ... మరోసారి కెప్టెన్ గా సత్తా చాటిన డెమాన్... తనూజ లైఫ్ లో స్పెషల్ పర్సన్... మోస్ట్ బోరింగ్ పర్సన్ జైలుకెళ్తే, వెళ్తూ ప్రియాకి ఇచ్చిపడేసిన మర్యాద మనీష్