Bigg Boss Telugu 9 Day 1 Episode 2 Review: బిగ్ బాస్ 9 సీజన్‌లో కామనర్స్ 6, సెలెబ్రిటీలు 9 మంది అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇన్ హౌస్, అవుట్ హౌస్ అంటూ ఓనర్స్, టెనెంట్స్ అనే కాన్సెప్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. అగ్ని పరీక్షను ఎదుర్కొని వచ్చిన కామనర్స్‌కి ఓనర్స్ హోదాను ఇచ్చాడు బిగ్ బాస్. ఇంట్లోకి అడుగు పెట్టిన సెలెబ్రిటీలు టెనెట్స్‌గా మారి అవుట్ హౌస్‌లో ఉండాల్సి వచ్చింది. ఓనర్స్‌కి మాత్రమే అన్నీ లగ్జరీలు వర్తిస్తాయి. ఫుడ్ సైతం ఓనర్స్‌కే దక్కుతుంది. ఇక ఈ ఫుడ్ విషయంలోనే మొదటి రోజు చిన్న చిన్న గొడవలు జరిగాయి.

సెలెబ్రిటీలు కూర్చోవడం.. కామనర్స్ నిల్చుని ఉండటంపై బిగ్ బాస్ సెటైర్ వేశాడు. ఈ ఇల్లు ఓనర్స్‌ది అని మర్చిపోయారా? అని కాస్త కౌంటర్లు వేశాడు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే.. అగ్ని పరీక్షను ఎదుర్కొని ఓనర్స్‌గా మారారు.. ఇప్పుడు సెలెబ్రిటీలకు అగ్ని పరీక్ష.. అంటూ బిగ్ బాస్ హింట్ ఇచ్చాడు. హౌస్ ఓనర్స్ కాస్త మానిటర్స్‌గా మారి తమ టెనెంట్స్ చేస్తున్న పనులకు బాధ్యత వహించాలని చెప్పాడు. ఈ క్రమంలో కిచెన్ టేబుల్, డైనింగ్ టేబుల్ క్లీనింగ్ విషయంలో కామనర్స్‌ మధ్యలోనే ఓ ఏకాభిప్రాయం రాలేదు. దీంతో ప్రియా, హరీష్, శ్రీజ, కళ్యాణ్, పవన్ మధ్య సఖ్యత లేకుండా పోయింది. ఇదే విషయాన్ని పట్టుకుని సెలెబ్రిటీ గ్రూపు కౌంటర్లు వేసుకుంది. వాళ్లలో వాళ్లకే పడటం లేదు అని భరణి సెటైర్ వేశాడు.

Also Read: ఒరేయ్ ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి మాట్లాడు - ఫ్యాన్‌పై మంచు లక్ష్మి ఆగ్రహం

టెనెంట్స్ బయటకు వెళ్లాలి.. అని బిగ్ బాస్ ఆదేశం ఇచ్చాడు. అప్పుడే పనులన్నీ చేసుకుని అన్నం పెట్టుకుని ఇమాన్యుయేల్ తినబోయాడు. కానీ బిగ్ బాస్ ఆదేశాల మేరకు వెంటనే బయటకు వెళ్లాల్సి వచ్చింది. అలా ఇమాన్యుయేల్ తినలేదు అని హరీష్ నానా హైడ్రామా చేశాడు. బిగ్ బాస్ ఆదేశాల్ని బేఖాతరు చేస్తూ హరీష్ కాస్త మొండిగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో రేలంగి మామయ్యలా బిల్డప్ ఇచ్చాడు. నోటి కాడి కూడు లాక్కుంటాను అంటే నేను ఒప్పుకోను.. బిగ్ బాస్‌ను అయినా ఎదురిస్తాను.. ఎలాంటి పర్యవసనాలు అయినా ఎదుర్కొంటాను అని హరీష్ కాస్త ఓవర్ యాక్షన్ చేశాడు.

హరీష్, శ్రీజ ఇద్దరూ కూడా తమ టెనెంట్స్‌కి ఫుడ్ తీసుకెళ్లారు. కానీ బిగ్ బాస్ మాత్రం వద్దని వారించాడు. ఓనర్స్‌కి మరీ మంచితనం ఎక్కువైనట్టుగా కనిపిస్తోంది. టెనెంట్స్‌కి ఆకలి లేకపోయినా సరే, వద్దన్నా సరే ఫ్రూట్స్, బిస్కెట్లు తెచ్చి మరీ తినమని ఓనర్స్ బలవంతం చేస్తూనే వచ్చారు. ఇక బిగ్ బాస్ అయితే చివరకు ఓనర్స్, టెనెట్స్‌కి కలిపి ఫుడ్ పంపించాడు. ఈ క్రమంలో ఎవరికి ఇచ్చిన ఫుడ్ వారే తినాలని కండీషన్ పెట్టాడు. అక్కడ సిట్యువేషన్ కాస్త సీరియస్ అయిపోయింది. అంతకు ముందు చేసిన టాస్కులో భాగంగా హరీష్‌ని ఇమ్ము గుండు అంకుల్ అని పిలిచాడు.

ఆ గుండు అంకుల్ అనే పదాన్ని ఇమ్ము కంటిన్యూ చేయడంతో హరీష్ కాస్త సీరియస్ అయ్యాడు. గార్డెన్ ఏరియాను క్లీన్ చేయడానికి ఇమాన్యుయేల్‌కి ఎంత టైం పడుతుందో అతని మెంటర్ హరీష్ చెబుతాడు అని బిగ్ బాస్ లింక్ పెట్టాడు. అయితే ఆ గుండు అంకుల్ అనే కామెంట్ వల్ల అప్పటికే హరీష్‌తో ఇమ్ముకి చెడింది. దీంతో అక్కడే కాస్త వాగ్వాదం జరిగింది. గుండు అంకుల్ ఎందుకు అంటున్నావ్?.. బాడీ షేమింగ్ చేస్తున్నావా?.. హద్దుల్లో ఉండు.. అని హరీష్ అన్నాడు. సారీ చెప్పిన తరువాత కూడా ఎందుకు తీస్తున్నావ్? నేనేమీ కావాలని అనలేదు.. ఏదో సరదాకి అన్నాను.. అయినా సారీ చెప్పినా కూడా ఎందుకు మళ్లీ మళ్లీ టాపిక్ తీస్తావ్ అన్నట్టుగా ఇమ్ము మాట్లాడాడు.

నీ కోసం ఫుడ్ కూడా మానేశాను అని హరీష్ తాను చేసిన త్యాగం గురించి చెప్పుకున్నాడు. దీంతో భరణి ఎంటర్ అయి గొడవను ఆపే ప్రయత్నం చేశాడు. ఇక్కడితో వదిలేయండి అని భరణి అంటే.. ఎక్కడి వరకు తీసుకు వెళ్లాలో నాకు తెలుసు.. అని హరీష్.. ఎక్కడికైనా తీసుకెళ్లుకోండి.. అని ఇమ్ము ఢీ అంటే ఢీ అనే టైపులో అన్నాడు. ఆ తరువాత రీతూ, కళ్యాణ్ కళ్లలో కళ్లు పెట్టుకుని చూస్తూ ఫన్నీ టాస్క్ ఆడారు. కావాలని అనలేదు.. మిమ్మల్ని బాడీ షేమింగ్ చేయాలంటే.. ముందు నా బాడీ ఎలా ఉందో చూసుకోవాలి కదా.. అంటూ హరీష్‌ను గొడవను ప్యాచప్ చేసుకునే ప్రయత్నం ఇమ్ము చేశాడు. ఇక ఓనర్స్‌కి కావాల్సిన ఫుడ్‌ను టెనెంట్స్ చేత చేయించుకోవచ్చని బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. టెనెంట్స్‌కి మాత్రం బిగ్ బాస్ నుంచి ఫుడ్ వస్తుందట. కాఫీ దొంగతనం చేయాలని తనూజ అయితే ఓ ప్లాన్ వేస్తోంది. మరి ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? లేదా? అన్నది రేపటి ఎపిసోడ్‌లో చూడాలి.

Also Read: ఆ పిక్ నా లైఫ్‌ను మార్చేసింది - మెగాస్టార్‌తో బెస్ట్ మూమెంట్ షేర్ చేసుకున్న తేజ సజ్జా