Bigg Boss Telugu 9 Day 1 Promo 2 : మంచి చేద్దాము.. ఫుడ్ పెడదామని కామనర్స్ అనుకుంటే.. తిరిగి వాళ్లకే రివర్స్ అయ్యేలా మారింది ఈరోజు బిగ్​బాస్ పంచాయతీ. బిగ్​బాస్​ హౌజ్​లో మొదటిరోజు నుంచే గొడవలు పెట్టడం స్టార్ట్ చేశాడు. ముందుగా పనులు డివైడ్ చేయడంతో ఆర్గ్యూమెంట్స్ చేయిస్తే.. తాజాగా ఫుడ్ విషయంలో చిచ్చు పెట్టాడు. కామనర్స్ అగ్నిపరీక్షలో గేమ్స్ ఆడి ఇంట్లో ఓనర్స్​గా మారగా.. సెలబ్రెటీలు టెనెన్ట్స్​గా మారారు. ఇప్పుడు ఓనర్స్​గా ఉన్న కామనర్స్​కి లగ్జరీ ఉంటుంది. అయితే దీనిని బేస్ చేసుకునే గేమ్​ని ముందుకు తీసుకెళ్లే పనిలో ఉన్నాడు బిగ్​బాస్. 

Continues below advertisement

సెలబ్రెటీలు లగ్జరీ కావాలంటే గేమ్స్ ఆడి వాటిని దక్కించుకోవాలనే కాన్సెప్ట్​తో వారిని అద్దెకు ఉండేవారిగా చూపించారు. అయితే బిగ్​బాస్​ హోజ్​లో ఓనర్స్​గా ఉన్న కామనర్స్​ సెలబ్రెటీలకు అన్ని సౌకర్యాలు ఇచ్చారు. దీంతో బిగ్​బాస్ తన ఆటను మొదలు పెట్టాడు. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. 

ప్లేట్ వదిలి వెళ్లిపోండి..

టెనెన్ట్స్ ఇళ్లు ఓనర్స్​కి మాత్రమే.. మీరు బయటకు వెళ్లండి అంటూ అనౌన్స్ చేశాడు. ఆ సమయంలో భోజనం చేస్తోన్న టెనెన్ట్స్ బయటకు వెళ్లిపోబోయారు. అక్కడ ఫుడ్ సర్వ్ చేసుకుంటున్న సంజనా, తనూజ, హరీశ్, ఇమ్మాన్యూయేల్ ఫుడ్ సర్వ్ చేసుకుంటున్నారు. అయితే భరణి ఫుడ్ పెట్టాల అంటూ ఇమ్యూని అడగ్గా అతను వద్దంటూ తింటూ బయటకు వెళ్లిపోతాడు. దీంతో బిగ్​బాస్ మీ ప్లేట్స్ అక్కడే వదిలేసి బయటకు వెళ్లిపోమంటూ చెప్తాడు. 

Continues below advertisement

కామనర్స్​లో హరీశ్ నన్ను తినొద్దని చెప్పండి నేను తినను. అంతే కానీ తింటున్నవాడి దగ్గర నుంచి ప్లేట్ లాక్కోను అంటూ స్టేట్​మెంట్ పాస్ చేశాడు. తర్వాత సెలబ్రెటీల దగ్గరకి కామనర్స్ వచ్చి ఇమ్మూని తినమని చెప్తారు. దాంతో ఇమ్మాన్యూయేల్ తినొచ్చా? అంటే తినండి అని శ్రీజ చెప్తుంది. ఇది తింటే వచ్చే పనిష్మెంట్ కూడా వారే తీసుకుంటామని చెప్తారు. 

ఈ డిస్కషన్ సమయంలోనే ఓనర్స్ అందరూ లివింగ్ ఏరియాకు రండి అనౌన్స్ రాగా.. అందరూ బయటకు వెళ్లిపోతారు. టెనెన్ట్స్ ఔట్​ హోజ్​కు ముందు నిల్చోమని చెప్తాడు. ఇక నుంచి ఓనర్స్ అనుమతి లేకుండా ఇంట్లోకి వెళ్లకూడదని సూచిస్తాడు బిగ్​బాస్​. అలాగే పంపిన ఆహారం మొత్తాన్ని స్టోర్​ రూమ్​లో పెట్టండని చెప్తాడు. దీంతో సంజనా బిగ్​బాస్ మేము ఏమి తినలేదు అని అడుగుతుంది. 

మొదలైన డిస్కషన్.. 

బయటకు వచ్చిన ఓనర్స్.. అక్కడున్న టెనెన్స్ట్​కి ఫుడ్ ఇచ్చేందుకు ట్రై చేస్తారు. మీకు శిక్ష పడకుండా చూస్తామంటూ హామి ఇవ్వగా.. వారిపై సెలబ్రెటీలు రివర్స్ అయ్యారు. మీరు చేసే పని వల్ల హౌజ్​ మొత్తానికి శిక్ష వేస్తే ఎవరూ బాధ్యత తీసుకుంటారు అంటూ తనూజ సీరియస్ అయింది. అలాగే ఈరోజు మొత్తం ఫుడ్ పెట్టకుంటే ఎలా అని అడుగుతుంది. 

ఓనర్స్ లోపలికి వెళ్లగా.. బయటున్న సెలబ్రెటీలు మాట్లాడుకుంటారు. భరణి వాళ్లు కావాలనే మన దగ్గరికి వచ్చి వాళ్లు చెప్పాలనుకున్నది చెప్పి వెళ్లిపోతున్నారని.. వాళ్లకి రూల్స్ పాటించడం ఎలా అనేది తెలియట్లేదు అన్నట్లు మాట్లాడుకున్నారు. దీంతో కామనర్స్, సెలబ్రెటీల మధ్య గొడవలు మొదలైనట్లే కనిపిస్తుంది. దీనిని బేస్ చేసుకుని బిగ్​బాస్ గేమ్స్ ప్లాన్ చేసే అవకాశం ఉంది. మరి ఈరోజు ఎపిసోడ్​లో ఏమి జరగనుందో చూడాల్సి ఉంది.