Bigg Boss Telugu 8 Task for Weekly Ration : నామినేషన్స్ పూర్తి అయిన తర్వాత బిగ్​బాస్​ మంగళవారం ఎపిసోడ్​లో ఓ టాస్క్ ఇచ్చాడు. ఫుడ్​ మొత్తాన్ని స్టోర్​ రూమ్​లో పెట్టాలని ఆదేశించాడు. నచ్చిన ఫుడ్​ ఎంత కావాలంటే అంత తినేయమని చెప్పాడు. బజర్ మోగించి.. ఫుడ్​ని అక్కడే ఉంచేయాలని చెప్పి.. దానిని ఎక్స్​టెండ్​ చేస్తూ.. బుధవారానికి టాస్క్​ ఇచ్చాడు బిగ్​బాస్​. దానికి సంబంధించిన ప్రోమోను స్టార్​ మా విడుదల చేసింది. ఈ ప్రోమో ఎలా సాగిందంటే.. 


గ్రూప్​లుగా డివైడ్ చేసి


ఈ సీజన్​లో కెప్టెన్సీ లేకుండా చీఫ్​లుగా గ్రూప్స్​ని డివైడ్ చేసిన బిగ్​బాస్​.. వారికి బెనిఫిట్స్ ఇస్తూ.. క్లాన్స్​ని సిద్ధం చేసుకునేలా టాస్క్​లు ఇస్తున్నాడు. ఈ బెనిఫిట్స్ కోసం క్లాన్స్, చీఫ్స్​ కష్టపడుతున్నారు. అయితే ఈ ఎపిసోడ్​లో మాత్రం చీఫ్స్​కి ముందు టాస్క్​ ఇచ్చి.. అనంతరం క్లాన్స్​ టాస్క్​తో దీనిని లింక్ చేశాడు. ఇలాంటి ట్విస్ట్ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అనొచ్చు. 



చీఫ్స్​కి మాత్రమే..


యాక్షన్ ఏరియా​లో ఉంచిన ఫుడ్​ని.. అక్కడున్న బుట్టల్లో బజర్ మోగించక ముందు వేసుకోవాలని బిగ్​బాస్ క్లాన్స్​కి ఆర్డర్ ఇచ్చాడు. ఈ వారం రేషన్​ని ఇలా దక్కించుకోవాలని చెప్పాడు. ఈ వారానికి సరిపడ ఆహారాన్ని తీసుకురావడం చీఫ్ బాధ్యత అంటూ తెలిపాడు. సైరన్ మోగడంతో యశ్మీ లోపలికి వెళ్లి ఫుడ్ సేకరించగా.. సెకండ్ సైరన్​కి నైనిక, మూడో సైరన్​కి నిఖిల్ వెళ్లి.. వారానికి కావాల్సిన ఫుడ్​ని బజర్​ మోగించే లోపు సేకరించారు. అయితే ఈ సేకరించిన ఫుడ్​ని దక్కించుకునేందుకు క్లాన్స్​కి కొన్ని ఛాలెంజ్​లు ఇచ్చాడు. 


Also Read : బిగ్​బాస్​లో లవ్ ట్రాక్ షురూ.. అది మానేస్తే ఏమైనా ఇస్తానంటూ బంపర్ ఆఫర్ ఇచ్చిన సోనియా.. ట్రయాంగల్​ స్టోరిగా మారనుందా?


క్లాన్స్​కి లెమన్ పిజ్జా..


చీఫ్స్ సేకరించిన ఫుడ్ పొందాలంటే.. క్లాన్స్ సభ్యులు లెమన్ పిజ్జా ఆడి.. ఫుడ్​ని పొందాలంటూ ట్విస్ట్ పెట్టాడు. లెమన్ పిజ్జా అంటూ న్యూ టాస్క్ పెట్టాడు. ఏ క్లాన్ సభ్యులైతే మూడు నిమ్మకాయలను మేజ్​లోపలి నుంచి బయటకు తెస్తారో వారికి పాయింట్ వస్తుందని తెలిపాడు. అయితే ఈ మేజ్​న గాల్లోనే తాడులతో హ్యాండిల్ చేయాలి. ఇలా ఏ క్లాన్ సభ్యులు ఎన్ని రౌండ్స్​లో ఎన్ని నిమ్మకాయలు తెస్తారో.. వారు విజేతలుగా నిలిచి.. వారు సేకరించిన ఫుడ్​ని పొందుతారంటూ బిగ్​బాస్ తెలిపాడు.



యశ్మీ టీమ్​ నుంచి అభయ్ నవీన్, పృథ్వీ ఈ ఛాలెంజ్ ఫేస్ చేశారు. నిఖిల్ టీమ్​ నుంచి నిఖిల్, మణికంఠ ఈ టాస్క్ ఆడగా.. నైనిక టీమ్​ నుంచి నబిల్, సీత ఈ ఛాలెంజ్​ని ఫేస్​ చేశారు. శేఖర్ బాష ఈ టాస్క్​కి సంచాలకుడిగా వ్యవహరించాడు. మిగిలిన సభ్యులు తమ క్లాన్స్​ని సపోర్ట్ చేస్తూ కనిపించారు. దీంతో ప్రోమో ముగిసింది. మరి ఈ టాస్క్​లో ఎవరు గెలిచారు. రేషన్​ ఎవరిని వరించిందో తెలుసుకోవాలంటే ఎపిసోడ్ విడుదలయ్యేవరకు ఆగాల్సిందే. 


Also Read : నామినేషన్స్​లో యశ్మీకి అదిరే పవర్ ఇచ్చిన బిగ్​బాస్.. ఏడ్చేసిన నైనిక.. ఓదార్చిన నిఖిల్.. సరికొత్త టాస్క్​ ఊహించని ట్విస్ట్​తో