బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియతో హౌస్ మొత్తం హీట్ ఎక్కింది. కంటెస్టెంట్స్ మధ్య ఓ రేంజ్ లో గొడవ జరిగింది. సోమవారం, మంగళవారం రెండు రోజులు హౌస్ లో నామినేషన్ హీట్ కొనసాగింది. ఎప్పటిలాగే నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ బూతులు మాట్లాడుతూ కొట్టుకునేంత స్థాయికి వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. హౌస్ మేట్స్ అంతా కెప్టెన్సీ కోసం పోటీ పడుతున్నారు. ఈసారి కెప్టెన్సీ టాస్క్ లో ఎప్పటిలాగే ఫిజికల్ గేమ్ కాకుండా మైండ్ గేమ్ ఇచ్చారు బిగ్ బాస్. శారీరకంగానే కాదు మానసికంగాను హౌస్ మేట్స్ ఎంత చురుగ్గా ఉన్నారో తెలుసుకునేందుకు బిగ్ బాస్ టాస్క్ పెట్టాడు.
తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమోలో తేజ - శోభ శెట్టి మధ్య పెద్ద గొడవ జరిగినట్టు కనిపిస్తుంది. ఆడే ప్రతి గేమ్ లో ఎవరు గెలుస్తారో వారు ఈ వారం కెప్టెన్సీ కోసం పోటీపడే కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలుస్తారని బిగ్ బాస్ తెలిపాడు. అలాగే లాస్ట్ వచ్చిన వారు కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకుంటారని అన్నాడు. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా మొదట కొన్ని రకాల వస్తువులను కంటెస్టెంట్లకు చూపిస్తూ అవి నీటిలో వేస్తే తేలుతాయా లేక ములుగుతాయా సరిగ్గా గెస్ చేయాలని చెప్పాడు. ఆ టాస్క్ చాలా రసవత్తరంగా సాగింది.
ఇక తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే.. బీబీ మారథాన్ లో భాగంగా డబ్బాలు సెట్ చేయాలి అంతే.. అంటూ రెండవ గేమ్ ని ఇచ్చాడు బిగ్ బాస్. బాక్సులు వరుసగా సెట్ చేసేందుకు మీరు బాక్సులు ఎత్తకూడదని కండిషన్ కూడా పెట్టారు. దాంతో ప్రశాంత్, యావర్, రతిక, గౌతమ్ ఈ గేమ్ లో పాల్గొన్నారు. ఈ గేమ్ లో యావర్, గౌతమ్, ప్రశాంత్ పోటాపోటీగా ఆడినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. గేమ్ పూర్తయిన అనంతరం తేజ - శోభ శెట్టి మధ్య గొడవ మొదలైంది. పర్సనల్ గా ఫీల్ అయ్యాడు కాబట్టే అన్నాడు? అని తేజతో శోభా చెబుతుంది. దానికి తేజ.. శోభాశెట్టిపై సీరియస్ అవుతూ 'పో అవతలికి' అంటూ గట్టిగా అరిచాడు. దాంతో శోభా.. తేజ దగ్గరికి వచ్చి డిస్కషన్ మొదలు పెడుతుంది.
అది తేజకి నచ్చక లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు శోభ ‘‘నువ్వు భయంతో వెళ్తున్నావ్?’’ అని చెబుతుంది. దానికి తేజ బదులిస్తూ.."ఏమీ లేని దానికి పెద్దది చేయకు. నేను ఇక్కడే ఉన్నాను ఎవరితోనైనా చెప్పించు" అని అంటాడు. ఆ తర్వాత తేజ శివాజీతో మాట్లాడుతూ.. "ఏంటన్నా? ప్రతిదానికి ఇది. నేనేదో రతిక గత సరదాగా అంటే దానికి దీనికి ఎందుకు లింకు పెట్టింది? అని అనడంతో, ఏది ఎక్కువైనా ఇలాగే ఉంటుంది. వదిలేసేయండి" అంటూ శివాజీ తేజతో చెప్పడంతో ప్రోమో ఎండ్ అవుతుంది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది. ప్రోమోను బట్టి చూస్తే బుధవారం ప్రసారమయ్యే ఎపిసోడ్లో తేజ శోభ శెట్టి మధ్య పెద్ద గొడవే జరిగినట్లు కనిపిస్తోంది. బెస్ట్ బడ్డీస్ గా ఉండే ఈ ఇద్దరి మధ్య గొడవ ఎక్కడ మొదలైంది? ఎందుకు మొదలైంది? అనే తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.
Also Read : అనసూయ ‘జబర్దస్త్’ను వదిలేయడానికి కారణం అది కాదు, అతనిపై స్కిట్ చేయడమే నా తప్పు: అదిరే అభి