‘జబర్దస్త్’ కామెడీ షో తో కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అదిరే అభి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘జబర్దస్త్’ పై యాంకర్ అనసూయ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే ‘జబర్దస్త్’ లో తాను చేసిన చేసిన కొన్ని స్కిట్స్ గురించి కూడా ప్రస్తావించారు. దీంతో అదిరే అభి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. డీటెయిల్స్ లోకి వెళ్తే.. ఈటీవీలో ప్రసారమవుతున్న ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు పాపులారిటీ తెచ్చుకున్నారు. అలా ‘జబర్దస్త్’ ద్వారా కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో అదిరే అభి కూడా ఒకరు. ‘జబర్దస్త్’ లో కమెడియన్ గా పాపులర్ అయిన అభి ఆ క్రేజ్ తో సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.


అయితే తనకు కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చిన ‘జబర్దస్త్’ నుంచి కొద్దికాలం బయటకు వచ్చేసాడు. రెమ్యునరేషన్ విషయంలో అసంతృప్తిగా ఉన్న అభి ‘జబర్దస్త్’ షో కి గుడ్ బై చెప్పినట్లు ఆమధ్య వార్తలు కూడా వచ్చాయి. ‘జబర్దస్త్’ నుంచి బయటకు వచ్చేసిన అభి ఆ తర్వాత ‘స్టార్ మా’లో ప్రసారమైన ‘కామెడీ స్టార్స్’ షోలో సందడి చేశాడు. అక్కడ కూడా తనదైన కామెడీతో ఫుల్ గా నవ్వించాడు. ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటూ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అదిరే అభి ‘జబర్దస్త్’ గురించి అనసూయ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అనసూయ, రష్మిలకి ‘జబర్దస్త్’, ఎక్స్ ట్రా ‘జబర్దస్త్’ టీమ్స్ ఎలా డివైడ్ చేశారు? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు అభి బదులిస్తూ..


"జబర్దస్త్‌కు మొదట అనసూయ యాంకర్ గా చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు వేరే పనిమీద బయటికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు రష్మీ వచ్చింది. రష్మి వచ్చిన కొన్ని రోజులకి ‘జబర్దస్త్’, ఎక్స్ ట్రా ‘జబర్దస్త్’ రెండు వచ్చాయి. అప్పుడు రెండు షోస్ ని కూడా రష్మీనే హ్యాండిల్ చేసింది. కానీ ఎప్పుడైతే అనసూయ వచ్చిందో అప్పుడు ‘జబర్దస్త్’ అనసూయకు, ఎక్స్ ట్రా ‘జబర్దస్త్’ రష్మీకి ఇచ్చి ఇద్దరికీ ఒక్కో ఎపిసోడ్ లాగా ఇచ్చారు" అని అన్నాడు. ఆ తర్వాత అనసూయ ‘జబర్దస్త్’ నుంచి ఎందుకు వెళ్లిపోయారు? అని అడగగా..


"నాకు తెలిసి తను మెటర్నిటీ కోసం వెళ్ళిపోయారు. బయట చాలా రూమర్స్ వచ్చాయి. అవి ఏమి నిజం కాదు. బయట రాసుకునే వాళ్ళు చాలా రాసుకుంటారు. తను మెటర్నిటీ గురించే ‘జబర్దస్త్’ నుంచి వెళ్లిపోయారు" అని తెలిపారు అభి. 'నేను ఈ స్కిట్ చేయకుండా ఉంటే బాగుండు' అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అని యాంకర్ అడగగా.." ఒకటే ఒక స్కిట్ లో అనిపించింది. 2014లో ఒక స్కిట్ చేశాను. ఆ స్కిట్ వల్ల సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక పర్సన్ హార్ట్ అయ్యారు. ఆయన్ని హార్ట్ చేసే విధంగా మేము స్కిట్ చేసాం. అది తప్పే. దానివల్ల ఆ పర్సన్ ఎంతో హార్ట్ అయ్యారు. ఆ స్కిట్ చేయకుండా ఉండాల్సింది అని ఇప్పటికీ నేను రిగ్రేడ్ అయ్యేది ఆ ఒక్క స్కిట్ మాత్రమే" అంటూ చెప్పుకొచ్చాడు అదిరే అభి.


Also Read : పార్ట్-1కి పది రెట్లు ఉంటుంది - 'బ్రహ్మాస్త్ర 2' పై బిగ్ అప్డేట్ ఇచ్చిన రణ్ బీర్!




Join Us on Telegram: https://t.me/abpdesamofficial