Nagarjuna Akkineni: బిగ్ బాస్ రియాలిటీ షోకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. కేవలం తమ భాషలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ షోను ఫాలో అయ్యేవారు ఉంటారు. ఇక బిగ్ బాస్ షోకు తెలుగులో కూడా చాలా పాపులారిటీ ఉంది. అందుకే ఇప్పటివరకు తెలుగులో ఈ రియాలిటీ షో సక్సెస్‌ఫుల్‌గా ఏడు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రతీసారి మునుపటికంటే ఎక్కువగా టీఆర్‌పీని సంపాదిస్తూ రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఇక తాజాగా ముగిసిన బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ ఎపిసోడ్ కూడా ఇప్పటివరకు ఉన్న టీఆర్‌పీ రికార్డులను అన్నింటిని బ్రేక్ చేసిందని స్టార్ మా స్వయంగా ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ముందే రివీల్ అయినా..
‘అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే అదిరిపోయే 21.7 టీవీఆర్ పాయింట్స్‌ను దక్కించుకుంది. దీంతో ఎవరూ అందుకోలేని విజయాన్ని సాధించింది. దీనిని ఇంత గ్రాండ్ సెలబ్రేషన్‌గా చేసినందుకు థాంక్యూ’ అంటూ స్టార్ మా ట్వీట్ చేసింది. మామూలుగా బిగ్ బాస్ రియాలిటీ షో లాంచ్ ఎపిసోడ్‌కు, గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అసలు బిగ్ బాస్‌ను రెగ్యులర్‌గా ఫాలో అవ్వనివారు కూడా ఫైనల్స్‌లో ఎవరు గెలుస్తారా అని ఆసక్తితో ఎదురుచూస్తారు. అందుకే ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్‌కు 21.7 పాయింట్స్ దక్కాయి. పైగా విన్నర్ పల్లవి ప్రశాంతే అని ఫైనల్స్ టెలికాస్ట్ అవ్వకముందే రివీల్ అయినా కూడా చాలామంది ఈ ఎపిసోడ్‌ను ఆసక్తికరంగా చూశారు.
కామన్ మ్యాన్ విన్నర్..
ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగులో 7 సీజన్లతో పాటు ఒక ఓటీటీ సీజన్‌ను కూడా పూర్తిచేసుకుంది. కానీ ఒక్క సీజన్‌లో కూడా కామన్ మ్యాన్ టైటిల్ గెలవడం వరకు కాదు కదా.. కనీసం ఫైనల్స్ వరకు కూడా రాలేదు. కానీ ఈసారి కామన్ మ్యాన్‌లాగా ఎంటర్ అయిన పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వడంతో చాలామంది ప్రేక్షకులు సంతోషించారు. తను రైతుబిడ్డ అని చెప్పుకోవడంతో సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి విన్నర్ అయ్యాడని మరికొందరు ప్రేక్షకులు విమర్శించారు. ఇక చాలామంది ప్రేక్షకులు శివాజీ విన్నర్ అవ్వాలని అనుకున్నారు కానీ టాప్ 3వ స్థానం వరకే వచ్చి ఆగిపోయాడు. రన్నర్‌గా నిలిచిన అమర్‌దీప్‌పై పాజిటివ్ కంటే నెగిటివ్ రివ్యూలే ఎక్కువగా వచ్చాయి.
ఫ్యాన్స్ ఖుషీ..
బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అని ముందే రివీల్ అవ్వడం వల్ల తన అభిమానులు చాలామంది స్టూడియోస్ దగ్గరకి చేరుకోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. పోలీసులు చెప్పినా వినకుండా పల్లవి ప్రశాంత్ ర్యాలీ నిర్వహించాడని తనను అదుపులోకి కూడా తీసుకున్నారు. నాలుగు రోజులు జైలు శిక్షను అనుభవించిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఇటీవల విడుదలయ్యి మళ్లీ తన తోటి కంటెస్టెంట్స్‌ను కలిశాడు. ఇక పల్లవి ప్రశాంత్‌పై కేసు, జైలు విషయాలపై చాలామంది కంటెస్టెంట్స్ స్పందించడానికి ముందుకు రాలేదు. భోలే షావలి ఒక్కడే స్వయంగా వచ్చి లాయర్లతో మాట్లాడి, ప్రశాంత్‌కు బెయిల్ వచ్చేవరకు అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. ఇక ఇంత కాంట్రవర్సీ మధ్య ముగిసిన బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ టీఆర్‌పీ విషయంలో రికార్డ్ సాధించిందని తెలిసి ఈ షో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.
Also Read: మానసా చౌదరి రొమాన్స్ మామూలుగా లేదుగా, ఒక్క పాటలో 14 లిప్ కిస్‌లు!