'కోపం వస్తే తిట్టేస్తా... ప్రేమ వస్తే లవ్ చేస్తా' అంటున్నారు వాసంతి కృష్ణన్ (Vasanthi Krishnan) అంటున్నారు. ఎవరీ అందాల భామ అని అనుకుంటున్నారా? 'బిగ్ బాస్' ఇంటిలోకి కొత్తగా అడుగు పెట్టిన కంటెస్టెంట్.


తెలుగు బుల్లితెర వీక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్' ఆరో సీజన్ (Bigg Boss Season 6 Telugu) ఈ రోజు మొదలైంది. ఇప్పటి వరకు హౌస్‌లోకి పన్నెండు మంది కంటెస్టెంట్లుఅడుగు పెట్టారు. ఆ పన్నెండు మందిలో ఐదుగురు అబ్బాయిలు అయితే... ఏడు మంది అమ్మాయిలు. ఫిమేల్ డామినేషన్ ఎక్కువ ఉంది కదూ! ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే... ఫర్ ద ఫస్ట్ టైమ్, తెలుగు 'బిగ్ బాస్' ఇంటిలోకి ఒక జంటను పంపించారు. రోహిత్, మరీనా జంట కూడా ఉన్నారు. 


ఇప్పుడు 'బిగ్ బాస్' ఇంటిలోకి పదమూడో కంటెస్టెంట్‌గా వాసంతి కృష్ణన్ అడుగు పెట్టారు. ఆల్రెడీ ఆవిడ 'వాంటెడ్ పండు గాడ్' సినిమాలో నటించారు. తన పేరు చివర కృష్ణన్ చూసి చాలా మంది తనకు పెళ్లి అయిపోయి ఉంటుందని అనుకుంటారని, తాను సింగిల్ అని ఆమె తెలిపారు. లైఫ్ పార్ట్‌న‌ర్‌ ఎలా ఉండాలని అనుకుంటున్నారు? అని నాగార్జున అడిగినప్పుడు ఆ విషయం చెప్పారు. తనకు కాబోయే వాడు నిజాయతీగా ఉండాలని వాసంతి కృష్ణన్ తెలిపారు. 


వాసంతికి టాస్క్ ఇచ్చిన నాగార్జున
'బిగ్ బాస్' ఇంటిలోకి వెళ్లే ముందు వాసంతి కృష్ణన్ కు హోస్ట్ అక్కినేని నాగార్జున టాస్క్ ఇచ్చారు. ఆమెకు మూడు బ్యాడ్జీలు ఇచ్చారు. అందులో ఒకటి కిస్, ఇంకొకటి పంచ్,  మరొకటి హాగ్. ఆల్రెడీ ఇంటిలో ఉన్న సభ్యులలో ఒకరికి పంచ్ ఇవ్వాలని, ఒకరిని ముద్దు పెట్టుకోవాలని, ఇంకొకరిని కౌగిలించుకోవాలని నాగార్జున చెప్పారు. ఆ మూడు టాస్క్ లు ఆవిడ ఇంకా చేయలేదు గానీ... ఇంటిలోకి అడుగు పెట్టిన తర్వాత మరీనాకు కిస్ చేశారు. వాళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉందని తెలుస్తోంది.


Also Read : భార్యాభర్తలను ఒకేసారి ఇంట్లోకి పంపిన 'బిగ్ బాస్' - రోహిత్, మరీనా దంపతులు వచ్చారోచ్


బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్(Bigg Boss). అన్ని భాషల్లో ఈ షో సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఈ షోకి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 6ను ఈ రోజు మొదలు పెట్టారు.


ఇప్పటివరకు నాలుగు సార్లు ఈ షోకి హోస్ట్ గా చేసిన అనుభవం ఉన్న నాగార్జున (Akkineni Nagarjuna) ఐదోసారి కూడా హోస్ట్ చేస్తున్నారు. ఈసారి మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ కనిపించనున్నారు. ఆదివారం నాడు గ్రాండ్ గా షో మొదలైంది. ఇక కంటెస్టెంట్స్ ను ఒక్కొక్కరిగా నాగార్జున ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.


Also Read : 'బిగ్ బాస్' ఇంట్లో చిత్తూరు చిరుత గీతూ - రోడ్డు యాక్సిడెంట్‌లో కుట్లు & కోమా - పెద్ద కథే ఉందిగా