Bigg Boss Season 8, Day 9 Review: బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 9 ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ముందుగా బేబక్క హౌస్ నుంచి బయటకు వెళ్లిపోవడం గురించి నైనిక, సీతక్క ఎమోషనల్ అయ్యారు. మరోవైపు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని విష్ణు ప్రియ సోనియా ఎలిమినేట్ అవుతుందనుకున్నా అంటూ నోరు జారింది.ఆ తర్వాత నైనిక, ప్రేరణ కూడా ఈ డిస్కషన్లో పాల్గొన్నారు. విష్ణు ప్రియ మేటర్ ను డైవర్ట్ చేయగా, నైనిక తను పోదు, పైగా తనకంటూ క్లాన్ నిర్మించుకుంటుంది, త్వరలోనే చీఫ్ కూడా అవుతుంది అని చెప్పింది. కానీ విష్ణు ప్రియ అలా ఆశీర్వదించకు అంటే నైనిక లేదు నేను మాటిస్తున్న అంటూ సెటైరికల్ గా చెప్పింది. అంతకంటే ముందు పృథ్వీ, సోనియా, అభయ్, నిఖిల్ నలుగురు కూర్చుని నైట్ అంతా బేబక్క తమను రోడ్డుపై వేయడం గురించి కామెడీ చేస్తూ తెగ నవ్వుకున్నారు.
Read Also: సెకండ్ వీక్ నామినేట్ అయ్యింది వీళ్లే, ఆ కలర్స్ కు అర్థం ఇదే
ఆ తర్వాత బెడ్రూంలో ప్రేరణ, యశ్మీ ఇద్దరూ కూర్చోగా, ప్రేరణ ఈరోజు ఆ టాపిక్ తీసి క్లియర్ చేసుకుంటావా అని అడిగింది. యష్మి లేదు నామినేషన్ లో చెప్తాను అని చెప్పింది. చీఫ్ ను నామినేట్ చేయొద్దు అంటే నైనికను చేయనని, విష్ణు ప్రియ, సీత తన ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పింది. ఆ తర్వాత హౌస్ లో గ్రూపులుగా మారడం గురించి నబిల్, మణికంఠ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత బెడ్రూంలో నిఖిల్ ఇద్దరు అమ్మాయిల మధ్య తను నలిగిపోతున్నట్టు మణికంఠ ముందు బిల్డప్ ఇచ్చాడు. నెక్స్ట్ అందులో సోనియా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అనే విషయం గురించి పృథ్వీ దగ్గర మాట్లాడింది. విష్ణు ప్రియ కాస్త జెలసిగా ఫీల్ అయినట్టుగా కనిపించింది. ఆ తర్వాత టమాట మెంతికూర గురించి విష్ణుప్రియ, సీత మధ్య చర్చ నడిచింది. తనకు తినాలని ఉందట, అందుకే తను వండాడు అంటూ సోనియా కోసం నిఖిల్ వంట చేశాడు అని సీత చెప్పింది. తనకు తినాలని ఉంటే తను వండాడా.. ఎంత ప్రేమ ఎంత ప్రేమ అంటూ సెటైరికల్ గా విష్ణు ప్రియ నవ్వగా, అంటే వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారట నాకు చెప్పారు అని సీత కవర్ చేసింది. పైగా ఎవరో ఒకరు ఐ ఫౌండ్ యు లాగా దే ఫౌండ్ దెమ్ అంతే అంటూ నిఖిల్ అక్కడికి రావడంతో యాయా అంటూ ఆ సంభాషణకు ఫుల్ స్టాప్ పెట్టారు.
వాళ్లిద్దరూ తేనెపూసిన కత్తులు... హౌస్ నుంచి బయటకు వచ్చాక బేబక్క షాకింగ్ కామెంట్స్
మధ్యాహ్నంకి సోనియాకు తనకి మధ్య జరిగిన గొడవ గురించి మణికంఠతో చర్చించింది విష్ణు ప్రియ. నెక్స్ట్ సోనియా సిగరెట్ మానెయ్ రా నువ్వు ఏమి అడిగినా ఇస్తాను అని చెప్పడంతో ఒక్కసారి నిఖిల్ షాక్ అయ్యాడు. కానీ తప్పకుండా మానేస్తానని మాట ఇచ్చాడు. నెక్స్ట్ నామినేషన్ రచ్చ మొదలైంది. మీరందరూ ఒక క్లాన్ లో భాగం కాబట్టి, మీ ఓటు మీ విధేయతను తెలియజేస్తుంది అంటూ ముందుగానే ఏబీపీ తెలుగులో ప్రస్తావించిన విధంగా నామినేషన్ ప్రక్రియను వివరించారు బిగ్ బాస్. యష్మి ఇంట్లో పెద్ద క్లాన్ కాబట్టి కొన్ని ప్రయోజనాలను ఇచ్చారు. అందులో ఒకటి ఆమె ఈవారం నామినేషన్స్ నుంచి సేవ్ అయింది. మిగతా ఇద్దరు చీఫ్ లని మాత్రం ఎవరైనా నామినేట్ చేయొచ్చు. సీత నామినేషన్ ప్రాసెస్ ను మొదలు పెట్టగా డామినేటింగ్ అంటూ నిఖిల్ ను, ప్రేరణను నామినేట్ చేసింది. అభయ్... ఆదిత్యను, విష్ణుప్రియను నామినేట్ చేశాడు. సోనియా... నైనికను, సీతను నామినేట్ చేసింది. మణికంఠ.. ఆదిత్యను, శేఖర్ ను నామినేట్ చేశారు. ఆదిత్య.. అభయ్ ని, శేఖర్ ను నామినేట్ చేసాడు. విష్ణు ప్రియ.. మణికంఠని, సోనీయాను నామినేట్ చేస్తుంది. శేఖర్.. మణికంఠని, ఆదిత్యను నామినేట్ చేశారు.