బిగ్​బాస్​ సీజన్ 7 కెప్టెన్సీ టాస్క్​లో భాగంగా బిగ్​బాస్ కంటెస్టెంట్లకు 'స్టోర్​ ఇట్ పోర్​ ఇట్'. ఈ గేమ్​లో నలుగురు సభ్యులు పాల్గొనాలని బిగ్​బాస్​ సూచించారు. షవర్​ నుంచి వచ్చిన నీటిని తమ హెల్మెట్​పై ఉన్న స్పాంజ్​ని తడిపి.. దానిలోని నీటిని కంటైనర్​లో నింపాల్సి ఉంటుందని తెలిపారు. ఎవరి కంటైనర్​లో ఎక్కువ నీరు ఉంటుందో వారే కెప్టెన్సీ కంటెండర్​గా నిలుస్తారు అని తెలిపారు. 


తోసుకుంటూ గేమ్ ఆడేస్తూ..


ఈ టాస్క్​లో పాల్గోనేందుకు సందీప్ మాస్టర్, అశ్విన్, భోళే శంకర్​, అర్జున్​ పాల్గొన్నారు. చాలా చురుగ్గా ఈ గేమ్​లో పాల్గొన్న నలుగురు.. తమ ఎఫెర్ట్స్ బాగా పెట్టినట్లే కనిపించింది. టాస్క్​లో భాగంగా ఒకరినొకరు తోసుకుంటూ.. గేమ్​ ఆడారు. దీనిలో భాగంగా అర్జున్ అశ్వినిని పుష్​ చేయగా.. ఆమె కింద పడిపోయింది. శివాజీ ఆమెకు సహాయం చేశారు. టాస్క్ ముగిసిన వెంటనే సందీప్.. అమర్ దీప్, తేజతో ముచ్చట పెట్టాడు. "ఫిజికల్ చేయాలంటే రెండు నిముషాలు పట్టదు. పీక ఇలా పట్టుకుని చాలా సార్లు తోచాడు." అంటూ సందీప్ తెలిపాడు.


మాఫియా ఎగైనెస్ట్ అయ్యింది..


వీరి సంభాషణ లివింగ్ ఏరియాలో జరగగా.. వాష్ ఏరియాలో అర్జున్​ శివాజీతో మాట్లాడాడు. "ఏంటి మాఫియా మొత్తం ఎగైనెస్ట్  అయింది" అని అర్జున్ శివాజీతో అన్నాడు. "మెడకి చాలా ఎఫెక్ట్ అయింది. అశ్వినిని ఉద్దేశిస్తూ.. ఆ పిల్లను ఒక్క తోపు తోస్తే.. వెళ్లిపోయింది అలా" అని తెలిపాడు. "ఇంతకముందు నో మాస్టర్​ అనేవాళ్లు.. ఇప్పుడు మాస్టర్, మాస్టర్ అంటున్నారంటూ అర్జున్ శివాజీతో ఫన్ చేశాడు. సందీప్​ వాళ్ల దగ్గర శోభా కూడా ఉన్నట్లు ప్రోమోలో చూపించారు. గచ్చిబౌలి స్ట్రాటజీస్​ అంటూ శివాజీ సైటర్లు వేశాడు. దీంతో ప్రోమో కట్ అయింది. 


మొత్తానికి బిగ్​బాస్​ హౌజ్​లో సీరియల్ బ్యాచ్​కి, నాన్ సీరియల్​ బ్యాచ్​కి హోరా హోరీగా ఫైట్ జరుగుతుంది. అర్జున్ సీరియల్ బ్యాచ్​ అయినా.. తను మాత్రం నాన్ సీరియల్ బ్యాచ్​తో కలిసి.. గట్టి స్ట్రాటజీలు వేస్తున్నాడు. ముందు టాస్క్​ల్లో ఫౌల్​ గేమ్​ ఆడి సీరియల్ బ్యాచ్​ అడ్డంగా దొరికిపోయింది. ఇప్పటివరకు అర్జున్ కూడా వాళ్లతో కలిసి ఫౌల్​ గేమ్​ ఆడాడు. కానీ ఇప్పుడు మాత్రం వారి గురించి.. శివాజీతో చర్చిస్తున్నాడు. 


Also Read : శోభాపై అరిచిన తేజ, ఏది ఎక్కువైనా ఇలాగే ఉంటాదంటూ శివాజీ హితబోధ!


లైవ్​ టెలికాస్ట్​ని బట్టి ఈ టాస్క్​లో అర్జున్​ గెలిచి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. కెప్టెన్ ఎవరు అవుతారో తెలియాలంటే మరిన్ని టాస్క్​లు కంటెస్టెంట్స్ ఆడాల్సి ఉంది. ఇప్పటికే పల్లవి ప్రశాంత్, ప్రియాంక కంటెండర్​ అయ్యారు. వీరిలో ఎవరో ఒకరు కెప్టెన్ అయ్యే అవకాశముంది. ఇప్పటికే పల్లవి ప్రశాంత్​ కెప్టెన్​ కాగా.. అర్జున్ ఆల్రెడీ కెప్టెన్​గా చేస్తున్నాడు. వాళ్లు రెండోసారి కెప్టెన్ అవుతారో.. లేదా కొత్తవారికి ఛాన్స్ వస్తుందో లేదో వేచి చూడాల్సిందే. 


Also Read : ఏమీ లేకున్నా.. కొన్ని విస్తరాకులు ఎగిరెగిరి పడుతున్నాయ్ - సీరియల్ బ్యాచ్‌పై శివాజీ కామెంట్స్