బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss Telugu Season 7)లో అస్త్రాల వేట, వాటికోసం పోటీ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. ముందుగా బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ అంతా హౌజ్‌మేట్స్ కాదని, పవర్ అస్త్రాను సాధిస్తేనే బిగ్ బాస్‌లో ఎవరైనా హౌజ్‌మేట్స్‌గా మారగలుగుతారని నాగార్జున ముందే క్లారిటీ ఇచ్చారు. అలా Bigg Boss Telugu Season 7 ప్రారంభమయిన మొదటి వారంలో వపర్ అస్త్రాను గెలుచుకున్నాడు సందీప్. ఇప్పుడు రెండో పవర్ అస్త్రా కోసం పోటీ మొదలయ్యింది. ఆ పవర్ అస్త్రా ఎవరికి దక్కుతుంది అనే విషయంలో హౌజ్‌లో మళ్లీ గొడవలు మొదలయ్యాయి.
తాళంచెవి ఎవరికి దక్కాలి
బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss Season 7)లో రెండో వారం రెండో పవర్ అస్త్రా కోసం కంటెస్టెంట్స్ అంతా రెండు టీమ్స్‌గా విడిపోయారు. రణధీర అని పేరు పెట్టుకున్న శివాజీ, షకీలా, ప్రిన్స్ యావర్, అమర్‌దీప్, ప్రియాంక, శోభా శెట్టి టీమ్ చాకచక్యంతో ఆడి.. మాయాస్త్రాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు రెండో పవర్ అస్త్రా కోసం ఈ టీమ్‌లో పోటీ మొదలయ్యింది. అసలు పవర్ అస్త్రా ఎవరికి దక్కితే బాగుంటుంది అనే విషయాన్ని అవతలి టీమ్ అయిన మహాబలి డిసైడ్ చేసే ఛాన్స్‌ను బిగ్ బాస్ ఇచ్చినట్టుగా తాజాగా విడుదలైన ప్రోమోలో చూపించారు. ప్రస్తుతం మాయాస్త్రానికి సంబంధించిన రెండు తాళం చెవులు మహాబలి టీమ్ దగ్గర ఉండడం కూడా ఈ ప్రోమోలో కనిపించింది. కానీ అసలు ఇది ఎలా జరిగింది తెలియాలంటే బిగ్ బాస్ (Bigg Boss) ఎపిసోడ్ ప్రసారం అయ్యేవరకు ఎదురుచూడాల్సిందే.
చివరిగా ఎవరు వెళ్లాలి
మహాబలి టీమ్‌లో ఒక్కొక్కరుగా వెళ్లి.. రణధీర టీమ్‌లో ఉన్న ఏ కంటెస్టెంట్‌కు పవర్ అస్త్రా దక్కితే మేలు అన్న విషయాన్ని చెప్పాలి. దీంతో మహాబలి టీమ్‌లో డిస్కషన్ మొదలయ్యింది. ఎవరు ముందు వెళ్లాలి, ఎవరు తర్వాత వెళ్లాలి అని చర్చించుకున్నారు. మహాబలి టీమ్ నుంచి వచ్చిన శుభశ్రీ.. శోభా నుంచి తాళంచెవిని తీసుకొని ప్రిన్స్‌కు ఇవ్వాలని చెప్పింది. ఇక అమర్‌దీప్ కూడా మహాబలి టీమ్ మెంబర్స్ చెప్తున్న కారణాలకు సమాధానాలిచ్చాడు. ఇంతలోనే మహాబలి టీమ్‌లో తరువాత ఎవరు వెళ్లాలి అనే చర్చ మొదలయ్యింది. దీని వల్ల వారి మధ్య వాగ్వాదాలు కూడా జరిగాయి. చివరిగా వెళ్లే కంటెస్టెంట్ చేతిలో పవర్ అస్త్రా ఎవరి చేతికి వెళ్లాలో డిసైడ్ చేసే పవర్ ఉంటుంది కాబట్టి రతిక.. తను చివరిగా వెళ్తానని చెప్పింది. దానికి ఆ టీమ్ సభ్యులు అసలు ఒప్పుకోలేదు. దీంతో దామినిపై ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టింది రతిక.
అందరూ బఫూన్స్
మహాబలి టీమ్ అంతా చర్చించుకొని, వాదించుకున్న తర్వాత కూడా చివరిగా ఎవరు వెళ్లాలి అనేది నిర్ణయించుకోలేకపోయారు. సహనం కోల్పోయిన రతిక ‘‘‘నాకు చండాలంగా అనిపిస్తుంది ఈ టీమ్‌లో ఉండడం. బఫూన్స్’’ అంటూ కామెంట్ చేసింది. ‘‘రెండురోజుల నుంచి అదే టీమ్‌లో ఉండి ఇప్పుడు ఒక్కసారిగా ఇది నా టీమ్ కాదు వీరంతా బఫూన్స్ అంటున్నావు’’ అంటూ సందీప్ తనపై అరవడం మొదలుపెట్టాడు. అలా అన్న తర్వాత కూడా రతిక.. ‘‘అవును అలాగే ప్రవర్తిస్తున్నారు’’ అంటూ సమాధానమిచ్చింది. అలా చాలాసేపు మహాబలి టీమ్ నుంచి చివరిగా వెళ్లాల్సిన కంటెస్టెంట్‌ను డిసైడ్ చేయలేకపోవడంతో గౌతమ్ కృష్ణ, అమర్‌దీప్, సందీప్, శోభాశెట్టి కూడా సహనం కోల్పోయారు. ‘‘గేమ్ ఆడడం రాదు’’ అంటూ అరిచాడు అమర్‌దీప్. మొత్తానికి మహాబలి టీమ్ ప్లే చేస్తుంది స్ట్రాటజీనా, లేక నిజంగానే వారి మధ్య గొడవలు జరుగుతున్నాయా అనే విషయం తెలుసుకోవాలంటే నేడు ప్రసారం అయ్యే బిగ్ బాస్ ఎపిసోడ్‌లోనే తెలుస్తుంది.
Also Read: కొత్త వ్యాపారంలోకి అక్కినేని హీరో, హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్ కొనుగోలు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial