తెలుగు సినిమా పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కినేని నాగేశ్వరరావు మొదలుకొని అక్కినేని అఖిల్ వరకు సినిమా పరిశ్రమలో రాణిస్తున్నారు. అక్కినేని నాగార్జున సినిమాలతో పాటు వ్యాపారంగంలోనూ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బాటలోనే నడిచేందుకు ప్రయత్నిస్తున్నాడు నాగ చైతన్య. సినిమాల్లోనే కాకుండా స్పోర్ట్స్ రంగంలో కూడా తన లక్‌ను పరీక్షించుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. వాస్తవానికి నాగ చైతన్యకు కారు రేసింగ్ పై చాలా ఆసక్తి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఓ రేసింగ్ టీమ్‌కు ఓనర్ గా మారబోతున్నారు. 


‘హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్’ టీమ్ ను కొనుగోలు చేసిన నాగ చైతన్య


ఇప్పటికే ‘హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్’ అనే టీమ్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ టీమ్ తో   ఈ ఏడాది జ‌రుగ‌నున్న ఫార్ములా 4 ఇండియ‌న్ చాంఫియ‌న్‌షిప్ లో నాగ‌చైత‌న్య టీమ్ పాల్గొనబోతోందట.  ఈ టీమ్‌కు అఖిల్ ర‌బీంద్ర‌, నీల్ జానీ డ్రైవ‌ర్స్‌ గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. రేసింగ్ గేమ్స్ ప‌ట్ల అక్కినేని నాగార్జునతో పాటు అక్కినేని అఖిల్, అక్కినేని నాగ చైతన్యకు బాగా ఇంట్రెస్ట్ ఉంది. తాజాగా హైదరాబాద్ లో జరిగిన రేసింగ్ గేమ్స్ లో నాగార్జునతో పాటు నాగ చైతన్య, అఖిల్ సందడి చేశారు. సినిమా రంగంలో ఫర్వాలేదు అనిపించిన నాగ చైతన్య, స్పోర్ట్స్ వ్యాపారంలో ఎలా రాణిస్తాడోనని ఆయన అభిమానులు ఆలోచిస్తున్నారు. రేసింగ్ గేమ్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న యంగ్ స్టర్స్ కు ‘హైద‌రాబాద్ బ్లాక్ బ‌ర్డ్స్’ టీమ్ ఓ వేదిక కాబోతుందని నాగ చైతన్య వెల్లడించాడు. ఇప్పటికే డ్రైవ‌ర్స్ ఛాంపియ‌న్‌షిప్‌తో ఇండియ‌న్ రేసింగ్ లీగ్‌లోకి అడుగు పెట్టిన నాగ‌ చైత‌న్య టీమ్ రెండో స్థానంలో నిలిచింది. స్పోర్ట్స్ రంగంలోనూ నాగ చైతన్య బాగా రాణించాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాదు, అక్కినేని నాగ చైతన్యకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్తున్నారు.  






చందూ మొండేటితో సినిమా చేస్తున్న చైతన్య


ఇక నాగ చైతన్య చివరిసారిగా ‘కస్టడీ’ మూవీలో కనిపించాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని మత్స్యకారుల కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. జీఏ 2 పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది.  ఈ చిత్రంలో నాగ చైతన్య జాలరి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. 2018లో గుజరాత్ నుంచి వేటకు వెళ్లి పాకిస్తాన్ కోస్ట్‌ గార్డుల‌కు చిక్కిన 21 మంది మత్స్యకారుల్లో ఒకరైన రామారావు జీవిత కథ ఆధారితంగా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. బన్నీ వాసు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.  


Read Also: థాంక్స్ చాలదు, సాంగ్స్ అదరగొట్టాలి - అల్లు అర్జున్, అట్లీ సినిమాకు అనిరుధ్ ఫిక్స్ 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial